Prasanna Vadanam OTT Update: ఓటీటీలోకి.. వచ్చేసిన సుహాస్ మైండ్‌బ్లోయింగ్ క్రైమ్ థ్రిల్లర్! ట్విస్టులైతే ఓ లెవల్
ABN, Publish Date - May 21 , 2024 | 08:16 PM
ఇటీవల వినూత్న కాన్సెప్ట్‌తో వచ్చి మంచి విజయం సాధించిన స్ట్రెయిట్ తెలుగు చిత్రం ప్రసన్నవదనం డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న సుహాస్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా మే3న థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని దక్కించుకుంది.
ఇటీవల వినూత్న కాన్సెప్ట్‌తో వచ్చి మంచి విజయం సాధించిన స్ట్రెయిట్ తెలుగు చిత్రం ప్రసన్నవదనం (Prasanna Vadanam) డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న సుహాస్ (Suhas) హీరోగా తెరకెక్కిన ఈ సినిమా మే3న థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని దక్కించుకోవడమే కాక సుహాస్‌కు డబుల్ హ్యట్రిక్ విజయాన్ని అందించింది. పాయల్ రాధాకృష్ణ (Payal Radhakrishna), రాశిసింగ్ (Rashi Singh), నితిన్ ప్రసన్న ప్రధాన పాత్రల్లో నటించగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు అర్జున్ (arjun yk) దర్వకత్వం వహించారు.
ఇప్పటివరకు మనకు తెలసిన కలర్ బ్లైండ్‌నెస్ కాన్సెప్ట్‌కు భిన్నంగా పేస్ బ్లేండ్‌నెస్‌తో ఈ ప్రసన్న వదనం (Prasanna Vadanam) చిత్రం రూపొందడం విశేషం. కథ విషయానికి వస్తే.. ఓ యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడిన సూర్యకు పేస్ బ్లేండ్‌నెస్ అనే వ్యాధి వస్తుంది. దీని వళ్ల అవతలి వారి ముఖాన్ని గుర్తించలేడు కేవలం గొంతు అధారంగానే మనషులను గుర్తుంచుకుంటూ కాలం వెళ్లదీస్తుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు రాత్రి రోడ్డుపై ఓ వ్యక్తి మర్డర్ చేయడం చూస్తాడు. అయితే యాక్సిడెంట్‌గా భావించిన పొలీసులు అప్పటికే ఆ కేసును క్లోజ్ చేసి ఉంటారు. అయితే అది యాక్సిడెంట్ కాదని మర్డర్ అని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తాడు సూర్య. ఇక ఆ తర్వాతి నుంచి సూర్యపై హత్యా ప్రయత్నాలు జరుగుతుంటాయి.. అయితే వారు తన పక్కనే తిరుగుతున్నా సూర్య గుర్తింలేక పోతాడు. పైగా సూర్య ఆ మర్డర్ కేసులో చిక్కుకుని జైలుకు వెళ్లాల్సి వస్తుంది.
*Prasanna Vadanam Movie Review: సుహాస్ కి ఇంకో హిట్ వచ్చిందా?
చివరకు సూర్య ఈ కేసు నుంచి ఎలా బయట పట్టాడు, తనకున్న వ్యాధిని అధిగమించి అసలు నిందితులను పట్టించగలిగాడా అనే నేపథ్యంలో సినిమా అద్యంతం ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. నెక్స్ట్ ఏం జరుగబోతుందనే సస్పెన్స్ ను కూడా క్రియేట్ చేస్తోంది. ఇంటర్వెల్‌కు వచ్చే ట్విస్టుతో మైండ్ బ్లాక్ కావడం గ్యారెంటీ, క్లైమాక్స్ అయితే మరో లెవల్. ఇప్పుడీ సినిమా డిజిటల్ వీక్షకులకు థ్రిల్ ఇవ్వడానికి మే 23 గురువారం నుంచి ఆహా (aha video) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్‌లో మిస్సయిన వారు ఎంచక్కా ఇప్పుడు ఇంట్లోనే చూసి అస్వాదించండి. అయితే మధ్యలో ఓ లిప్‌లాక్ తప్పితే మిగతా సినిమాను ఫ్యామిలీతో కలిసి చూసేయవచ్చు.