Stree 2 OTT: ప్రభాస్ ‘కల్కి’ సినిమాకు వణుకు పుట్టించిన సినిమా ఓటీటీలోకి వచ్చేసింది..

ABN, Publish Date - Sep 26 , 2024 | 05:45 PM

శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్‌ రావు జంటగా.. అమర్ కౌశిక్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘స్త్రీ 2’. కలెక్షన్స్ విషయంలో ప్రభాస్ ‘కల్కి 2898AD’ని సైతం భయపెట్టిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

Stree 2 Movie Still

శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor), రాజ్‌కుమార్‌ రావు (Rajkumar Rao) జంటగా.. అమర్ కౌశిక్ (Amar Kaushik) దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘స్త్రీ 2’ (Stree 2). ఈ సినిమా ఆగస్ట్‌లో విడుదలై సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. రెబల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898AD’ చిత్రానికి పోటీగా కలెక్షన్స్ రాబట్టి.. అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒకనొక దశలో ‘కల్కి’ని మించేలా కలెక్షన్స్ రాబట్టినట్లుగా కూడా వార్తలు వైరల్ అయ్యాయి. ఇప్పుడీ సినిమా ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. కాకపోతే కొన్ని కండీషన్లతో స్ట్రీమింగ్‌కి వచ్చిందీ చిత్రం.

Also Read- Prakash Raj Vs Pawan: పవన్‌కు ప్రకాష్ రాజ్ మరో కౌంటర్‌

2018లో విడుదలైన స్త్రీ (Stree) మూవీకి సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఏకంగా రూ. 600 కోట్లు కొల్లగొట్టి.. హిందీ సినిమాల్లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాల జాబితాలో చేరింది. దీంతో థియేటర్లలో ఈ సినిమాని మిస్సైన అభిమానులు ఓటీటీ(OTT)లో ఎప్పుడెప్పుడొస్తుందా అని వేచి చూస్తున్నారు. కాగా ఈ నిరీక్షణకు ఫుల్ స్టాప్ పెడుతూ మేకర్స్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పేశారు. ఆగస్ట్ 15న విడుదలై 42 రోజుల లాంగ్ రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని ప్రస్తుతానికి అమెజాన్ ప్రైమ్‌లో రెంట్ విధానంలో రూ. 349 చెలించి చూడొచ్చు. మరికొద్ది రోజుల్లోనే సబ్‌స్క్రిప్షన్‌పై ఉచితంగా చూసే అవకాశాన్ని పొందొచ్చు. అలాగే ఈ సినిమా మొదటి పార్ట్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ (Disney+ hotstar)లో అందుబాటులో ఉంది.


‘స్త్రీ 2’ కథ విషయానికి వస్తే.. మొదటి పార్ట్ ‘స్త్రీ’లో చందేరీ గ్రామంలోని స్త్రీ నుంచి సమస్యలు తొలిగిపోయిన తర్వాత ఏర్పడిన తలలేని ‘సర్కట’ నుంచి మోడ్రన్ అమ్మాయిలకు ఎదురయ్యే సరికొత్త సమస్యలపై ఈ ‘స్త్రీ 2’ కొనసాగుతుంది. ఈ సమస్యలు ప్రధాన తారాగణం ఎలా ఎదుర్కొన్నారనేది.. ఎంతో ఆసక్తికరంగా తెరపై చూపించారు. ఈ కామెడీ హారర్‌ ఫిల్మ్‌‌‌ ఓటీటీలోనూ మంచి స్పందనను రాబట్టుకునే అవకాశం లేకపోలేదు. శ్రద్దా కపూర్, రాజ్‌కుమార్‌ రావులతో పాటు పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, ఆపర్ శక్తి కీలక పాత్రల్లో నటించగా మ్యాడ్‌డాక్ ఫిల్మ్స్, జియో స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి.

Also Read- Movie Ticket Mafia: అభిమానుల జేబులు గుల్ల చేస్తున్న బెనిఫిట్‌ షోలు

Also Read- Harsha Sai: అసలెవరీ హర్షసాయి.. మరో మెగాస్టార్ అంటూ బిల్డప్ ఇచ్చిన వారంతా ఏమయ్యారు

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Sep 26 , 2024 | 05:45 PM