మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Tillu Square: డీజే టిల్లన్నా ఓటీటీలోకి వ‌చ్చేసిండు.. ఇక మోత‌ మోగాల్సిందే

ABN, Publish Date - Apr 26 , 2024 | 06:22 AM

రెండు తెలుగు రాష్ట్రాల‌లో చాలామంది అభిమానులు ఎదురు చూస్తున్న చిత్రం సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన 'టిల్లు స్క్వేర్' డిజిట‌ల్ స్ట్రీమింగ్ వ‌చ్చేసింది.

tillu square

రెండు తెలుగు రాష్ట్రాల‌లో చాలామంది అభిమానులు ఎదురు చూస్తున్న చిత్రం డిజిట‌ల్ స్ట్రీమింగ్ వ‌చ్చేసింది. ఆ సినిమానే సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) జంటగా నటించిన 'టిల్లు స్క్వేర్' (Tillu Square) మార్చి 29న థియేటర్ల‌లోకి వ‌చ్చిన సినిమా మొద‌టి రోజు నుంచే విప‌రీత‌మైన పాజిటివ్ టాక్‌తో దూసుకువెళ్లి రూ. 125 కోట్ల‌కు పైగా క‌లెక్షన్ల‌ను కొల్ల‌గొట్టి చ‌రిత్ర సృష్టించింది. అంతేగాక సిద్దుకు స్టార్ స్టేట‌స్‌పను తీసుకువ‌చ్చింది. సితార ఎంటర్ టైనమెంట్ సంస్థ నిర్మించన‌ ఈ సినిమాకు మల్లిక్ రామ్ దర్శకత్వం వ‌హించాడు.

థియేటర్స్ లో ఇంకా ప్రదర్శించబడుతోన్న ఈ సినిమా ఈ రోజు (ఏప్రిల్ 26) నుంచి ప్ర‌ముఖ ఓటీటీ దిగ్గ‌జ ఫ్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌(Netflix)లో తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. గ‌తంలో వ‌చ్చి సూప‌ర్ హిట్ అయిన 'డీజీ టిల్లు' చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా మొద‌టి దాని క‌న్నా రెట్టింపు వినోదాన్ని పంచ‌గా, మంచి స్టోరీతో , ట్విస్టుల‌తో ప్ర‌జ‌ల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంది. ఔట్ అండ్‌ ఔట్ కామెడీతో రూపొందిన ఈ చిత్రం ఒక చిన్న నేరం నేపథ్యం చుట్టూ తిరుగుతూ ఉంటుంది.


మ‌రోసారి అమ్మాయితో ప్రేమ‌లో ప‌డ్డ సిద్దు పెళ్లికి రెడీ అవుతున్న జ‌మ‌యంలో వ‌రుస‌గా స‌మ‌స్య‌ల వ‌ల‌లో చిక్కుకుంటూ ఉంటాడు వాటి నుంచి త‌ప్పించుకునే క్ర‌మంలో టిల్లు చుట్టూ క‌థ తిరుగుతూ సిద్దు మాటలు, హావభావాలు ప్రేక్షకులని కడుపుబ్బా నవ్విస్తాయి. అనుపమ పరమేశ్వరన్ లిల్లీ గా గ్లామరస్ గా అద‌ర గొట్టగా చివ‌ర‌లో రాధిక ఎంట్రీ, ఒక‌టి రెండు ట్విస్టులు భ‌లే ఉంటాయి.. ఇక ఆలస్యం ఎందుకు ఇప్పుడే నెట్ ఫ్లిక్స్ (Netflix)లో చూసెయ్యండి. కాకోతే సినిమా మొద‌ట్లో ముద్దు స‌న్నివేశాలు ఫ్యామిలీస్‌తో చూడ‌డానికి కొద్దిగా ఆసౌక‌ర్యంగా ఉంటుంది. అది త‌ప్పితే ఏమిగ‌తా సినిమాను అంతా కుటుంబంతో క‌లిసి హాయిగా వీక్షించొచ్చు.

Updated Date - Apr 26 , 2024 | 06:32 AM