మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

OTT Movie: ‘విద్య వాసుల అహం’ ఆహాలో ఎప్పుడంటే...

ABN, Publish Date - May 13 , 2024 | 01:53 PM

పెళ్లంటే ఇష్టంలేని వాసు, విద్యలు ఇద్దరూ కలిపి పెళ్లిచేసుకోవాల్సి వస్తుంది. పెళ్ళైన తరువాత ఇద్దరూ ఇగోలకి పోయి ఏమి చేశారు, కథ ఎటు తిరిగింది అనే విషయం తెలుసుకోవాలంటే 'విద్య వాసుల అహం' ఈ నెల 17న ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది, చూసెయ్యండి. రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ లు ఇందులో జంటగా నటించారు.

A scene from the film Vidya Vasula Aham

ఈమధ్య ఎటువంటి సినిమా అయినా థియేటర్స్ లో సరిగ్గా నడవటం లేదు. సినిమాలు చూడటానికి ప్రేక్షకులు రావటం లేదు అనటానికి ఎండలు, ఐపీల్, ఎన్నికల హడావిడి ఇలా ఎన్నో కారణాలున్నాయి. ఇలా ఈమధ్య చాలా సినిమాలు విడుదలవుతున్నాయి కానీ సినిమా థియేటర్స్ కి ప్రేక్షకులు రావటం లేదు. అందుకనే కొన్ని సినిమాలు నేరుగా ఓటిటి లో విడుదలవుతున్నాయి. ఆలా ఓటిటిలో విడుదలైన విడుదలైన 'మై డియర్ దొంగ' ఈమధ్య చాలా పెద్ద విజయం సాధించని అనే చెప్పాలి. ఈ సినిమా ఆహాలో విడుదలయింది.

ఇప్పుడు మరో సినిమా ఇదే ఓటిటి ఆహా లో విడుదలకి సిద్ధం అయింది. ఈ సినిమా పేరు 'విద్య వాసుల అహం' ఇందులో కొంచెం మసాలా కూడా వున్నట్టుగా ఈ సినిమా టీజర్ చూస్తే అర్థం అవుతోంది. అహంతో కూడిన ప్రేమ‌క‌థ‌ లోని భావోద్వేగాల‌ను, ఇగోల‌ను చూపించ‌డానికి రెడీ అవుతున్నారు విద్య‌, వాసు. ఈ సినిమా మే 17న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ వేదిక‌గా ప్రీమియ‌ర్ కానుంది. (Vidya Vasula Aham is streaming on Aha OTT channel on May 17)

ఈ సినిమా కథని క‌థ‌ని టూకీగా చెప్పాలంటే రాహుల్ విజయ్, శివానిలు అసలు పెళ్ళంటే ఇష్టం లేని వాసు, విద్యలుగా ఇందులో కనిపిస్తారు, కానీ ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోవలిసి వస్తుంది. పెళ్లయిన తరువాత ఇద్దరూ ఒకరి అభిప్రాయాలకి, ఇంకొకరు గౌరవించాలి, మాట్లాడుకోవాలి, కానీ కాని ఇద్దరూ నేనే నెగ్గాలి అని అనుకుంటే, అదే ఇగోకి పోతే, ఆ పెళ్లి జీవితంలో ప్రేమ బాధ్యతల మధ్యలో ఇగో వస్తే ఎలా ఉంటుంది అనే నేపధ్యలో కథ జరుగుతుంది. అలాంటి సమయంలో వీరిద్దరూ ఇగోతో కలిసే ఉంటారా లేదా పెళ్ళైన కొత్తలో ఉండే మూమెంట్స్ ని ఎంజాయ్ చేస్తారా అనేది తెలియాలంటే ఆహాలో మే 17 వ‌రల్డ్ డిజిట‌ల్ ప్రీమియ‌ర్ అయ్యే వ‌ర‌కు వేచి చూడాల్సిందే...

ఈ సినిమాకి మహేష్ దత్త మొతూరు, లక్ష్మీ నవ్య మక్కపాటి నిర్మాతలు. మణికాంత్ గెల్లి దర్శకుడు. ‘విద్య వాసుల అహం’ (ఏ లాంగ్ లాంగ్ ఈగో స్టోరి) అనే టాగ్ లైన్ లో వస్తున్నా ఈ సినిమా ఆహాలో ఈ నెల 17న విడుదలవుతోంది అని చిత్ర యూనిట్ వెల్లడించింది.

Updated Date - May 13 , 2024 | 01:53 PM