Satya OTT: ప్రతి ఒక్కరినీ పాత రోజులకు తీసుకెళ్లే సినిమా ఓటీటీలోకి వచ్చేసింది..
ABN, Publish Date - Sep 07 , 2024 | 09:18 PM
ప్రతి ఒక్కరినీ పాత రోజులకు తీసుకెళ్లే సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. హమరేశ్, ప్రార్ధనా సందీప్ జంటగా నటించిన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ‘సత్య’. వాలీ మోహన్‌దాస్ దర్శకత్వం వహించారు. శివమ్ మీడియా పతాకంపై తమిళ చిత్రం ‘రంగోలి’ని తెలుగులోకి నిర్మాత శివమల్లాల ‘సత్య’ పేరుతో అనువదించిన విషయం తెలిసిందే. ఈ సినిమా వినాయకచవితి స్పెషల్‌గా ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
హమరేశ్ (Hamaresh), ప్రార్ధనా సందీప్ (Prarthana Sandeep) జంటగా నటించిన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ‘సత్య’ (Satya). వాలీ మోహన్‌దాస్ దర్శకత్వం వహించారు. శివమ్ మీడియా పతాకంపై తమిళ చిత్రం ‘రంగోలి’ని తెలుగులోకి నిర్మాత శివమల్లాల ‘సత్య’ పేరుతో అనువదించిన విషయం తెలిసిందే. ‘ఆడుకాలం’ మురుగదాస్ తండ్రిపాత్రలో నటించిన ఈ సినిమాను థియేటర్లలో చూసిన ప్రతి ఒక్కరు చక్కని విలువలున్న చిత్రమన్నారు. విమర్శకులు సైతం ఈ సినిమాను మెచ్చుకున్నారు. ఇప్పుడీ సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేసింది.
Also Read- Game Changer: అభిమానుల నిరీక్షణ ఫలించింది.. అదిరిపోయే పోస్టర్‌తో అప్డేట్
ప్రభుత్వ కళాశాలల కంటే ప్రైవేట్ కళాశాలలు అయితే మంచి అలవాట్లు, చదువు వస్తాయనే అనే అపోహ నుండి.. చక్కగా చదివే పిల్లలు ఏ స్కూల్‌లో, కాలేజీలో ఉన్నా మంచిగానే చదువుతారు అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను దర్శకుడు తెరకెక్కించారు. అప్పులు చేసి వడ్డీలు కడుతూ పిల్లలను ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలలో చేర్చి ఇబ్బందులు పడే ఒక చిన్న ఫ్యామిలీ కథే ఈ ‘సత్య’. ఆద్యంతం హృద్యంగా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు వినాయకచవితి సందర్భంగా ఆహాలో స్ట్రీమింగ్ జరుపుకుంటోంది. (Satya Streaming in Aha OTT)
ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమాని చూసి ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లోని స్కూల్, కాలేజీ, టీనేజ్ లవ్‌ని మరోసారి గుర్తు తెచ్చుకుంటారని, మిస్ కాకుండా ఈ సినిమాను చూడాలని చిత్రయూనిట్ ప్రేక్షకులను కోరుతోంది. ఈ చిత్రానికి సుందరమూర్తి సంగీతాన్నిఅందించగా మాటలను కె.యన్ విజయ్‌కుమార్ అందించారు. ప్రస్తుతం ఆహాలో ఈ సినిమా మంచి స్పందనను రాబట్టుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
Read Latest Cinema News