Sathyam Sundaram OTT: ‘సత్యం సుందరం’ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది
ABN, Publish Date - Oct 22 , 2024 | 11:19 AM
హీరో కార్తీ, అరవింద్ స్వామి లీడ్ రోల్స్‌లో నటించిన హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘సత్యం సుందరం’. ‘96’ ఫేమ్ సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించారు. ‘దేవర’కు పోటీగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఆ వివరాల్లోకి వెళితే..
హీరో కార్తీ, అరవింద్ స్వామి లీడ్ రోల్స్‌లో నటించిన హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘సత్యం సుందరం’ (Sathyam Sundaram). ‘96’ ఫేమ్ సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 28న విడుదలైన పాజిటివ్ స్పందనను రాబట్టుకుంది. ఇప్పుడీ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా ఈ సినిమా అక్టోబర్ 27 నుంచి తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుందని తెలుపుతూ.. నెటిఫ్లిక్స్ ఓటీటీ సంస్థ అధికారికంగా ఓ పోస్టర్‌ని విడుదల చేసింది. ‘దేవర’ సినిమాకు పోటీగా విడుదలైన ఈ ‘సత్యం సుందరం’ చిత్రంపై అప్పట్లో బాగానే వార్తలు నడిచాయి. ఫైనల్‌గా ఈ సినిమాను థియేటర్లలో మిస్ అయిన వారందరికీ నెట్‌ఫ్లిక్స్ గుడ్ న్యూస్ చెప్పేసింది. (Sathyam Sundaram OTT Update)
Also Read- Vishal: విజయ్ పిలవకపోయినా వెళతా.. హీరో విశాల్ సంచలన వ్యాఖ్యలు
‘సత్యం సుందరం’ కథ విషయానికి వస్తే.. సత్యం, తన కుటుంబం ఉద్దండరాయుని పాలెంలో తరతరాలుగా వస్తున్న ఇంట్లో నివసిస్తుంటారు. బంధువుల వల్ల ఆస్తి తగాదాలతో సత్యమూర్తి (అరవింద్ స్వామి), ఆయన తండ్రి రామలింగం (జయప్రకాశ్) మూడు తరాలుగా నివసిస్తున్న ఇంటిని కోల్పోతారు. ఇక ఆ గ్రామంలో ఉండటం ఇష్టం లేక వైజాగ్ వెళ్లి స్థిరపడతారు. దాదాపు 20 ఏళ్లు సొంతూరికి, బంధువులకు దూరంగా ఉంటారు సత్యం. తప్పనిసరి పరిస్థితుల్లో చిన్నాన్న కుమార్తె భువన (స్వాతి కొండె) వివాహానికి వెళతారు. అక్కడ బావా అంటూ ఎంతో ఆప్యాయంగా తనను తాను పరిచయం చేసుకుంటాడు ఓ వ్యక్తి (కార్తీ).
Also Read- Bigg Boss 8 Telugu: ‘తొక్కలో నామినేషన్’.. సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు
ఆ వ్యక్తి సత్యమూర్తి చుట్టూనే తిరుగుతుంటాడు. చిన్నప్పటి జ్ఞాపకాలను చెబుతుంటాడు. బంక మట్టిలా వదలకుండా సత్యంతో మాట్లాడుతూనే ఉంటాడు. సత్యానికి మాత్రం తనను బావా అని పిలుస్తున్న అతనెవరో తెలీదు. తెలుసుకోవాలని ప్రయత్నించిన ఫలించదు. అతని పేరు కూడా తెలీదు. బస్ మిస్ కావడంతో ఒక రోజు అతని ఇంట్లోనే ఉంటాడు సత్యం. అతని ప్రేమకు ఫిదా అయిపోతాడు. అసలు సత్యమూర్తిని బావా అంటున్న వ్యక్తి పేరు ఏమిటి? అతని జీవితంలో సత్యమూర్తి వల్ల వచ్చిన మార్పులు ఏంటి. సత్యమూర్తికి అతనేం అవుతాడు? అనేదే ‘సత్యం సుందరం’ కథ. గోవింద్ వసంత ఈ చిత్రానికి సంగీతం అందించారు.