మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Bubblegum: సుమ తనయుడి సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్..

ABN, Publish Date - Feb 01 , 2024 | 08:22 PM

యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల దంపతుల తనయుడు రోషన్‌ కనకాల హీరోగా అరంగేట్రం చేసిన ‘బబుల్‌గమ్‌’ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది. ఆహా ఓటీటీ అఫీషియల్‌గా ‘బబుల్‌గమ్‌’ ఓటీటీ రిలీజ్ డేట్‌ను ప్రకటించింది. ఈ సినిమా ఆహా ఓటీటీలో ఎప్పటి నుండి స్ట్రీమింగ్ అవుతుందంటే..

Bubblegum Movie Still

యాంకర్ సుమ (Anchor Suma), నటుడు రాజీవ్ కనకాల (Rajeev Kanakala) దంపతుల తనయుడు రోషన్‌ కనకాల (Roshan Kanakala) హీరోగా అరంగేట్రం చేసిన ‘బబుల్‌గమ్‌’ (Bubblegum) సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది. ఆహా ఓటీటీ అఫీషియల్‌గా ‘బబుల్‌గమ్‌’ ఓటీటీ రిలీజ్ డేట్‌ను ప్రకటించింది. ఈ సినిమా ఆహా ఓటీటీలో ఫిబ్రవరి 9 నుండి స్ట్రీమింగ్ కానుంది. రవికాంత్ పేరెపు (Ravikanth Perepu) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2023 ఇయర్ ఎండింగ్ స్పెషల్‌గా డిసెంబర్ 29న థియేటర్లలోకి వచ్చింది. అయితే థియేటర్లలో ఈ సినిమా మిశ్రమ స్పందనే రాబట్టుకుంది. కానీ రోషన్ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడు ఓటీటీ ఈ సినిమాకు మంచి ఆదరణ వస్తుందని చిత్రయూనిట్ భావిస్తోంది.

‘బబుల్‌గమ్‌’ కథ (Bubblegum Story) విషయానికి వస్తే.. ఆది (రోషన్ కనకాల) పక్కా హైదరాబాదీ కుర్రాడు. డీజే కావాలనేది అతని డ్రీమ్. డీజే కావడం కోసం ఇష్టలేని పనులు కూడా చేస్తూ కష్టపడుతుంటాడు. అలాంటి ఆది లైఫ్‌లోకి జాహ్నవి (మానస చౌదరి) వస్తుంది. ఓ రోజు అనుకోకుండా పబ్‌లో జాహ్నవిని చూసిన ఆది.. ఆమెతో ప్రేమలో పడతాడు. కానీ, ఆమె ఓ పెద్దింటి అమ్మాయి. పైగా లవ్ అండ్ రిలేషన్స్‌పై పెద్దగా నమ్మకం లేని అమ్మాయి. మరి ఇలాంటి భిన్న మనస్థత్వాలు ఉన్న వారిద్దరూ ఎలా ప్రేమలో పడ్డారు? వారి ప్రేమ కథ ఎటువంటి పరిణామాలకు దారితీసింది? చివరకి వారిద్దరూ ఒక్కటయ్యారా? లేదా? ఈ గొడవలో ఆది తన డ్రీమ్‌ని ఏం చేశాడు? వంటి ప్రశ్నలకు సమాధానమే బబుల్‌గమ్ కథ. (Bubblegum OTT Release Date)


మానస చౌదరి (Maanasa Choudhary) హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మించింది. హర్ష చెముడు, కిరణ్ మచ్చ, అనన్య ఆకుల, హర్షవర్ధన్, అను హాసన్, చైతు జొన్నలగడ్డ, బిందు చంద్రమౌళి తదితరులు ఇతర పాత్రలలో నటించిన ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. మరి థియేటర్లలో మిశ్రమ స్పందనని రాబట్టుకున్న ఈ చిత్రం ఓటీటీలో ఎలాంటి ఆదరణను చూరగొంటుందో తెలియాలంటే ఫిబ్రవరి 9 వరకు వెయిట్ చేయక తప్పదు.


ఇవి కూడా చదవండి:

====================

*Nandi Awards: నంది అవార్డ్స్‌పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం

***************************

*Mrunal Thakur: ఆ హీరోతో ఆ అవకాశం రానందుకు చాలా బాధపడ్డా..

******************************

*Dheera: ‘ధీర’ ట్రైలర్ బాగుంది.. సినిమా మంచి హిట్టవుతుంది

****************************

Updated Date - Feb 01 , 2024 | 08:22 PM