Exhuma OTT: ఓటీటీలో.. అదిరిపోయే కొరియ‌న్ సూప‌ర్‌నేచుర‌ల్ హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్! డోంట్‌మిస్‌

ABN, Publish Date - Aug 19 , 2024 | 11:15 AM

ఇటీవ‌ల థియేట‌ర్ల‌లో విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించిన చిత్రం ఎక్స్‌హుమా డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది. ఈ ఏడాది ఫిభ్ర‌వ‌రిలో థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుని బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ సినిమాగా నిలిచింది.

exhuma

ఇటీవ‌ల థియేట‌ర్ల‌లో విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించిన చిత్రం ఎక్స్‌హుమా (Exhuma) డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది. ఈ ఏడాది ఫిభ్ర‌వ‌రిలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుని బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ సినిమాగా నిలిచింది. ఇండియ‌న్ క‌రెన్సీలో రూ. 1000 కోట్లు సాధించి చ‌రిత్ర సృష్టించింది. అంతేకాదు ఈ సంవ‌త్స‌రం హ‌య్యేస్ట్ గ్రాస‌ర్ సౌత్ కోరియన్‌ చిత్రంగా మొద‌టి స్థానంలో, అల్‌టైం హ‌య్యేస్ట్ గ్రాస‌ర్ చిత్రాల్లో ఆరో స్థానం ద‌క్కించుకుని రికార్డు నెల‌కొల్పింది. సూప‌ర్ నేచుర‌ల్ హ‌ర్ర‌ర్ నేప‌థ్యంలో రూపొందిన ఈ చిత్రంలో ఓల్డ్‌బాయ్ (Oldboy), ఐ సా ది డెవిల్ (I Saw the Devil) వంటి క‌ల్ట్ కొరియ‌న్ చిత్రాల్లో ప్ర‌ధాన పాత్ర పోషించిన చోయ్ మిన్ సిక్ (Choi Min sik) ఈ సినిమాలో కీల‌క పాత్రలో న‌టించ‌గా కిమ్ గో-యున్ (Kim Go eun), యూ హే జిన్ (Yoo Hae jin), లీ దో హ్యూన్ (Lee Do hyun)ఇత‌ర పాత్ర‌ల్లో క‌నిపించారు. జాంగ్ జే హ్యూన్ (Jang Jae hyun) ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

క‌థ విష‌యానికి వ‌స్తే.. అమెరికాలో ఓ డ‌బ్బున్న కొరియ‌న్‌ కుటుంబంలో అప్పుడే పుట్టిన కుమారుడు నాన్‌స్టాప్‌గా ఏడుస్తూ ఉంటాడు. డాక్ట‌ర్స్ ఎన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు చేసినా వారికి అంతుబ‌ట్ట‌దు. దీంతో అ బాబు తండ్రి పార్క్ కొరియాలో ఫేమ‌స్ అయిన‌ క్ష‌ద్ర పూజ‌లు వంటివి చేసే మంత్రగత్తె హ్వా-రిమ్‌ను పిలిపించ‌గా ఆమె బాబును చూసి పార్క్ వాళ్ల తాత ఆత్మ కుటుంబానికి శాపం మారి ఇబ్బంది పెడుతోంద‌ని, అత‌ని స‌మాధిని మారిస్తే స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుంద‌ని చెబుతోంది. దీంతో ఆ కుటుంబ సభ్యులు అలాగే చేయమని చెబుతారు. ఈ నేపథ్యంలో మంత్రగత్తె హ్వా-రిమ్ స‌మాధుల‌కు వాస్తులు చూసి, వాటిని త‌వ్వి.. తిరిగి పూడ్చే మాస్టర్ కిమ్ సాంగ్ డియోక్ సాయం కోరుతుంది.

ఈ క్ర‌మంలో ఊరికి దూరంగా ఓ అడ‌విలో కొండ‌పై స‌మాధి ఉండ‌డంతో.. ఇలాంటి ప్ర‌దేశాన్ని నేనెప్పుడు చూడ‌లేదు, ఇక్క‌డేదో నెగిటివ్ ఎన‌ర్జీ ఉంది నేను స‌మాధిని తవ్వ‌నంటూ మాస్టర్ కిమ్ అక్క‌డి నుంచి వెళ్లిపోతాడు. కానీ అప్పుడే పుట్టిన తన కుమారుడి ఆరోగ్యం కోసం అడిగినంత డ‌బ్బు ఇస్తాన‌ని పార్క్ అఫ‌ర్ చేసినా మాస్టర్ కిమ్ అంగీక‌రించ‌డు. అయితే ఎలాంటి ప్ర‌మాదం జ‌రుగ‌కుండా సాంప్ర‌దాయ పూజ నిర్వ‌హిస్తాను.. ఆ స‌మ‌యంలో స‌మాధిని త‌వ్వండి ఎలాంటి ఇబ్బంది రాద‌ని మంత్రగత్తె హ్వా-రిమ్ చెప్ప‌డంతో మాస్టర్ చివ‌ర‌కు స‌మాధిని తవ్వి శవ పేటికను బ‌య‌ట‌కు తీస్తాడు. అదే స‌మ‌యంలో అక్క‌డ ఓ పామును చంపేయ‌డంతో ఒక్క‌సారిగా అక్కడి వాతావ‌ర‌ణం మారి భారీ వ‌ర్షం వ‌స్తుంది. దీంతో ఆ స‌మాధిని ఓ ఇంట్లో భ‌ద్ర పరుస్తారు.


అయితే అందులో ఏదైనా బంగారం దొరుకుతుందేమోన‌ని దానికి కాప‌లా ఉన్న వ్య‌క్తి ఆ శవ పేటికని తెరిచే ప్ర‌య‌త్నం చేయ‌గా అందులోని ఆత్మ బ‌య‌ట‌కు వ‌చ్చి పార్క్ కుటుంబ స‌భ్యులను చంపేయ‌డం ప్రారంభిస్తుంది. ఈ విష‌యం తెలుసుకున్న హ్వా-రిమ్‌, మాస్టర్ కిమ్ అక్క‌డున్న శవ పేటిక ద‌హానం చేయించ‌డంతో ఆ ఆత్మ వెళ్లిపోతుంది. అప్ప‌టికే పార్క్, త‌ల్లి, తండ్రి చ‌నిపోగా ద‌వాఖాన‌లో ఉన్న పిల్లాడు మాత్ర‌మే బ్రతికి ఆరోగ్యం కుదుట ప‌డుతుంది. అయితే అప్పుడే మ‌రో విస్తుపోయే అంశం తెలుస్తుంది. అ త‌వ్విన స‌మాధిలోనే నిలువుగా పూడ్చేసిన మ‌రో భారీ శవ పేటిక బ‌య‌ట‌కు వ‌స్తుంది. పార్క్ తాత గురించిన అసలు రహస్యాలు బయట పడుతాయి. తర్వాత దానిని మ‌రో ప్రాంతంలో పూడ్చేయాల‌ని నిర్ణ‌యించుకుని శవ పేటికను బ‌య‌ట‌కు తీసి ఓ గుడి స‌మీపంలో భ‌ద్ర‌ప‌ర‌చ‌గా అందులోంచి అతి భ‌యంక‌ర‌మైన ఆత్మ శవ పేటికను బద్దలు కొట్టుకుని బ‌య‌ట‌కు వ‌స్తుంది. ఇంత‌కు అందులో ఉన్న ఆత్మ ఎవ‌రిదీ, దానిని అక్క‌డి వాళ్లు కంట్రోల్ చేయ‌గలిగారా, చివ‌ర‌కు దానిని ఎలా ఎదుర్కొన్నార‌నేదే అస‌లు స్టోరీ.

ఇప్పుడీ సినిమా బుక్ మై షో స్ట్రీమ్ (BookMyShow Stream) ఓటీటీలో కొరియ‌న్‌తో పాటు తెలుగు భాష‌లోనూ అందుబాటులో ఉంది. థ్రిల్ల‌ర్స్‌, మిస్ట‌రీ ,హ‌ర్ర‌ర్ సినిమాలంటే తెగ ఇష్ట‌మున్న‌వారు అస‌లు మిస్ చేయ‌కూడ‌ని సినిమా ఇది. సూప‌ర్ న్యాచుర‌ల్ హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్‌ జాన‌ర్‌లో రూపొందిన ఈ ఎక్స్‌హుమా (Exhuma) చిత్రం అస‌లు డిస్స‌పాయింట్ చేయ‌దు. భ‌య‌పెట్టేంత హ‌ర్ర‌ర్ స‌న్నివేశాలు ఇందులో లేక‌పోయినా క‌థ‌నం, స‌మాధుల ఎపిసోడ్, హ్వా రిమ్ చేసే క్షుద్ర పూజ‌లు మ‌న‌ల్ని సీటు ఎడ్జ్‌లో కూర్చోబెడ‌తాయి. నెక్ట్స్ ఏం జ‌రుగ‌బోతుంద‌నే స‌స్పెన్స్ క్రియేట్ చేస్తుంది. ఇక మొద‌టి స‌మాధి క‌న్నా రెండో స‌మాధి బ‌య‌ట‌కు వ‌చ్చాకే అస‌లు సినిమా స్టార్ట్ అవుతుంది. చూసే వారికి హై ఇస్తుంది. కొరియా ప్ర‌జ‌ల ఆచారా వ్య‌వ‌హారాలు ఆక‌ట్టుకుంటాయి. అయితే ఇందులో వ‌చ్చే ఆత్మ‌లు ప‌క్క‌న ఉండే మిర్ర‌ర్‌లో చూస్తే త‌ప్ప మ‌న‌కు డైరెక్ట్‌గా క‌న‌బ‌డ‌వు. చిత్రంలో ఎక్క‌డా ఎలాంటి అస‌భ్య‌, అస్లీల, వ‌ల్గ‌ర్ సన్నివేశాలనేవే లేవు కుటుంబ స‌మేతంగా హాయిగా చూసేయ‌వ‌చ్చు.

Updated Date - Aug 19 , 2024 | 11:49 AM