Sathyam Sundaram OTT: ఓటీటీకి వ‌చ్చేస్తున్న స‌త్యం సుంద‌రం! ఎప్ప‌డు.. ఎందులో అంటే

ABN, Publish Date - Oct 21 , 2024 | 07:46 AM

కార్తీ , అరవింద్ స్వామి కీల‌క పాత్ర‌ల్లో న‌టించ‌గా ఇటీవ‌ల థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన స‌త్యం సుంద‌రం చిత్రం డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది.

karthi

కార్తీ (Karthi), అరవింద్ స్వామి(Arvind Swami) కీల‌క పాత్ర‌ల్లో న‌టించ‌గా ఇటీవ‌ల థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన స‌త్యం సుంద‌రం (Sathyam Sundaram) చిత్రం డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. 96 వంటి క‌ల్ట్ ల‌వ్‌స్టోరీ చిత్రాన్ని అందించిన ప్రేమ్‌కుమార్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా 2డీ ఏంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌, జ్యోతిక నిర్మించారు. ద‌స‌రా సంద‌ర్భంగా జూ. ఎన్టీఆర్ చిత్రానికి పోటీగా సెప్టెంబ‌ర్ 28న థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ మూవీ మంచి పాజిటివ్ టాక్‌ను ద‌క్కించుకోవ‌డ‌మే కాక ప్ర‌తి ఒక్క‌రూ చూడాల్సిన చిత్రంగా పేరు తెచ్చుకుంది.

క‌థ విష‌యానికి వ‌స్తే.. అయిన వారి వ‌ళ్ల వ‌చ్చిన ఇబ్బందుల‌తో సొంత ఊరిలో ఇళ్లు కాళీ చేసి సిటీకి వెళ్లిపోతుంది స‌త్య‌మూర్తి (అర‌వింద స్వామి) కుటుంబం. ఆ ఊరిపై ద్వేషం పెంచుకుని ఆ ఊరికెళ్ల‌డం మానేస్తారు. తిరిగి పాతికేళ్ల‌కు చిన్న‌త‌నంలో త‌న‌తో క‌లిసి పెరిగిన పెదనాన్న కూతురి పెళ్లి కోసం స‌త్యం ఆ ఊరికి త‌ప్ప‌క‌వెళ్లాల్సి వ‌స్తుంది. ఆ స‌మ‌యంలో సుంద‌రం (కార్తీ) క‌లిసి బావ‌ బావ అంటూ స‌త్యంను క‌ల‌వ‌డం, అత‌ను సుంద‌రాన్ని గుర్తు ప‌ట్ట‌లేక ప‌డే ఇబ్బందులు చివ‌ర‌కు ఏం జ‌రిగింద‌నే పాయింట్‌తో సినిమా ఆద్యంతం ఆహ్లాదంగా సాగుతుంది.

ఇప్పుడు దీపావ‌ళి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని ఈ సినిమా ఆక్టోబ‌ర్ 25 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. మంచి ఫ్యామిలీ ఎమోష‌న్ సినిమా కోసం ఎదురు చూస్తున్న వారు క‌టుంబ స‌మేతంగా క‌లిసి ఈ సినిమా చూసి ఆస్వాదించ‌వ‌చ్చు తిరిగి ఆ రోజుల‌కు వెళ్ల‌వ‌చ్చు. ముఖ్యంగా కార్తీ, అర‌వింద్ స్వామి మ‌ధ్య వ‌చ్చే సన్నివేశాలు, బ్యాగ్రౌండ్‌ స్కోర్‌, ఒక‌టి రెండు ఎమోష‌న్ సీన్లు కంట‌త‌డి పెట్టించ‌డ‌మే కాక చివ‌ర‌కు ప్రేక్ష‌కుడికి ఓ ఫీల్ ఇస్తుంది.

Updated Date - Oct 21 , 2024 | 07:46 AM