OTTలో.. ఆకట్టుకుంటోన్న రామ్ (ర్యాపిడ్ యాక్షన్ మిషన్)
ABN, Publish Date - Mar 27 , 2024 | 02:33 PM
రిపబ్లిక్ డే సందర్భంగా ఈ ఏడాది రామ్ (ర్యాపిడ్ యాక్షన్ మిషన్) అనే దేశభక్తి చిత్రం థియేటర్లోకి వచ్చి మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చి అందరినీ ఆకట్టుకుంటోంది.
రిపబ్లిక్ డే సందర్భంగా ఈ ఏడాది రామ్ (ర్యాపిడ్ యాక్షన్ మిషన్) RAM (RAPID ACTION MISSION) అంటూ దేశభక్తిని చాటే చిత్రం థియేటర్లోకి వచ్చింది. ఈ మూవీతో సూర్య అయ్యలసోమయాజుల (surya ayyalasomyajula ) హీరోగా పరిచయం అవగా.. ధన్యా బాలకృష్ణ (dhanya balakrishna) హీరోయిన్‌గా నటించింది. దీపిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఓఎస్‌ఎం విజన్‌తో కలిసి ప్రొడక్షన్ నెం.1గా ఈ సినిమాను రూపొందించారు. మిహిరామ్ వైనతేయ(mihiraam vynateyaa) దర్శకుడిగా ఈ చిత్రంతో తన సత్తా చాటుకున్నారు.
మొదటి సినిమానే అయినా అటు హీరోకి, ఇటు దర్శకుడికి రామ్ (ర్యాపిడ్ యాక్షన్ మిషన్) RAM (RAPID ACTION MISSION) మంచి పేరుని తీసుకొచ్చింది. థియేటర్లో ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. దేశ భక్తిని చాటే చిత్రమే అయినా అన్ని రకాల అంశాలను, ఎమోషన్స్‌ను కలగలిపి తీయడంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. మ్యూజిక్, ఆర్ఆర్, కెమెరావర్క్ ఇలా అన్ని క్రాఫ్ట్‌లకు మంచి గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే.
అలాంటి ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చింది. దీపికాంజలి వడ్లమాని నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోనూ అందరినీ ఆకట్టుకుంటోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో ఈ మూవీకి మంచి ఆదరణ దక్కుతోంది. థియేటర్లో మిస్ అయిన వారంతా ఈ దేశ భక్తి సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో కుటుంబ సమేతంగా చూసి ఎంజాయ్ చేయవచ్చు.