మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Bahubali Crown Of Blood: ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’.. ఎన్నో రహస్యాలను ప్రేక్షకులకు పరిచయం చేస్తుంది

ABN, Publish Date - May 02 , 2024 | 07:27 PM

ఇండియన్ బాక్సాఫీస్ వసూళ్లలో కొత్త చరిత్ర సృష్టించిన సినిమా బాహుబలి. తాజాగా ఈ సినిమా మేక‌ర్స్ ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ యానిమేషన్ సిరీస్ ను డిజిట‌ల్‌స్ట్రీమింగ్‌కు తీసుకు వ‌స్తున్నారు.

bahubali

ఇండియన్ బాక్సాఫీస్ వసూళ్లలో కొత్త చరిత్ర సృష్టించిన సినిమా బాహుబలి (Bahubali). ప్రభాస్ (Prabhas ), రానా (Rana Daggubati), అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన బాహుబలి సిరీస్ లో వచ్చిన రెండు సినిమాలు వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ (Bahubali Crown Of Blood)’ పేరుతో ఈ కథలో కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ యానిమేషన్ సిరీస్ ను గ్రాఫిక్ ఇండియా, అర్క మీడియా బ్యానర్స్ పై దర్శకుడు S.S. రాజమౌళి (SS Rajamouli), శరద్ దేవరాజన్, శోభు యార్లగడ్డ నిర్మించగా..జీవన్ జె. కాంగ్, నవీన్ జాన్ దర్శకత్వం వహించారు. ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ మే 17వ తేదీ నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ (Bahubali Crown Of Blood) ట్రైలర్ ను ఈరోజు రిలీజ్ చేశారు. మాహిష్మతి రాజ్యాన్ని ప్రపంచపటం నుంచి తుడిచేయాలని యుద్ధానికి దిగిన రక్త్ దేవ్ ను బాహుబలి, భల్లాలదేవుడు కలిసి వీరోచితంగా ఎదుర్కోవడం ట్రైలర్ లో ఆకట్టుకుంది. ప్రతి పాత్ర ఎమోషన్, యాక్షన్ సీక్వెన్సులు సిల్వర్ స్క్రీన్ ఎక్సీపిరియన్స్ ఇచ్చేలా రూపొందించారు. డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్ (Disney Plus Hotstar) కంటెంట్ హెడ్ గౌరవ్ బెనర్జీ మాట్లాడుతూ - బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్‌తో ఐకానిక్ ఫ్రాంచైజీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం సంతోషంగా ఉంది. పిల్లలతో పాటు పెద్దలను కూడా ఈ సిరీస్ తో ఆకర్షించబోతున్నాం. ఈ సిరీస్ తో గ్రాఫిక్ ఇండియాతో హాట్ స్టార్ రిలేషన్ మరింత బలోపేతం కానుంది.’’ అన్నారు.


దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) మాట్లాడుతూ.. బాహుబలి (Bahubali) ప్రపంచం చాలా విశాలమైంది. ఈ ఫిల్మ్ ఫ్రాంచైజీ ఆ ప్రపంచాన్ని సరైన విధంగా పరిచయం చేస్తుంది. ఈ కథలో తెలుసుకునేందుకు చాలా విషయాలు ఉన్నాయి. ఈ కథ మొదటిసారిగా బాహుబలి, భల్లాలదేవ జీవితాలలో తెలియని అనేక మలుపులను తెలియజేస్తుంది. ఈ ఇద్దరు సోదరులు మాహిష్మతిని రక్షించడానికి చేసిన వీరోచిత పోరాటం ఈ సిరీస్ తో తెలుస్తుంది. బాహుబలి అభిమానులకు ఈ కొత్త అధ్యాయాన్ని పరిచయం చేస్తున్నందుకు, ఈ కథను యానిమేషన్ ఫార్మాట్‌లో తీసుకు రావడానికి మేం చాలా సంతోషిస్తున్నాం అన్నారు.

హీరో రానా దగ్గుబాటి (Rana Daggubati) మాట్లాడుతూ ఈ సిరీస్ తో బాహుబలి ఫిల్మ్ ఫ్రాంచైజీ తన స్క్రీన్ మ్యాజిక్ కొనసాగిస్తోంది. యానిమేషన్ లో బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ (Bahubali Crown Of Blood) రూపొందడం సంతోషాన్ని ఇస్తోంది. బాహుబలి, భల్లాల దేవ్ జీవితం యొక్క ఈ కొత్త అధ్యాయం బాహుబలి ప్రపంచంలోని మరెన్నో రహస్యాలను ప్రేక్షకులకు పరిచయం చేస్తుంది. అని అన్నారు.

Updated Date - May 02 , 2024 | 08:17 PM