Aavesham OTT Update: పుష్ఫ విలన్ ఫహద్ ఫాజిల్ రూ.100 కోట్ల ’ఆవేశం‘.. తెలుగులో ఎప్పటినుంచంటే
ABN, Publish Date - May 03 , 2024 | 07:23 AM
ఇటీవల మళయాళం విడుదలై సంచలన విజయం సాధించిన, పుష్ఫ చిత్రంలో విలన్‌గా ఆకట్టుకున్న ఫహాద్ ఫాజిల్ హీరోగా వచ్చిన ఈ సినిమా అవేశం చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది.
ఇటీవల మళయాళం విడుదలై సంచలన విజయం సాధించిన అవేశం (Aavesham) చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది. పుష్ఫ చిత్రంలో విలన్‌గా ఆకట్టుకున్న ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil) హీరోగా వచ్చిన ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై కేరళలో రికార్డుల సృష్టాంచాందా. రూ వంద కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టింది. ఈ ఏడాది ప్రేమలు, మంజమ్మల్ బాయ్స్, ది గోట్ లైఫ్ సినిమాల తర్వాత రూ.100 కోట్ల మార్క్‌ను దాటిన చిత్రంగా పేరు తెచ్చుకుంది. అంతేగాక ఫహద్ కేరీర్‌లోనే ఈ ఘనత సాధించిన మొదటి చిత్రంగా అవేశం (Aavesham) చరిత్ర సృష్టించింది.
గ్యాంగ్ స్టర్ కథకు కామెడీని, మదర్ సెంటిమెంట్‌ను జోడిస్తూ తెరకెక్కిన ఈ చిత్రం ఆద్యంతం ప్రేక్షకులను వీపరీతంగా అలరించింది. బీటెక్ చదవడానికి కేరళ నుంచి బెంగళూరుకు వచ్చిన ఓ ముగ్గురు మిత్రులను సీనియర్లు ర్యాగింగ్ చేస్తూ ఇబ్బంది పెడుతుంటారు. దీన్ని భరించలేని ఈ ముగ్గురు ఫ్రెండ్స్ ఓ గ్యాంగ్‌స్టర్ (ఫహాద్ ఫాజిల్)ను కలిసి అతని సాయంతో సీనియర్లపై తిరగబడతారు. ఆ తర్వాత నుంచి ఆ గ్యాంగ్‌స్టర్‌తో కలిసిపోతారు. చివరకు ఈ ముగ్గురు మిత్రులు గ్యాంగ్‌స్టర్‌ను చంపేందుకు ఎందుకు ఫ్లాన్ చేశారనే ఆసక్తికరమైన పాయింట్‌తో సాగుతూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది.
నటుడు ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil) స్వయంగా సుమారు రూ. 20 కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మించగా వంద కోట్లకై పైగా వసూళ్లను రాబట్టింది. అయితే ఇప్పుడు ఈ సినిమా మే 9 గురువారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో మలయాలంతో పాటు తెలుగు, కన్నడ, తమిళ భాషల్లోనూ స్ట్రీమింగ్‌కు తీసుకు వస్తున్నారు. గతంలో రోమాంచం వంటి సూపర్ మిట్ చిత్రాన్ని అందించిన జీతూ మాధవన్ (Jithu Madhavan) ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.