Prabhutva Juniour Kalasala: ఓటీటీలోకి వచ్చేసింది.. మిస్ కాకండి

ABN, Publish Date - Sep 26 , 2024 | 05:03 PM

ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్ జంటగా బ్లాక్ ఆంట్ పిక్చర్స్ పతాకంపై శ్రీమతి కొవ్వూరి అరుణ సమర్పణలో రూపొందిన చిత్రం ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143’. ఒక యదార్థ సంఘటన ఆధారంగా దర్శకుడు శ్రీనాథ్ పులకురం ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో మంచి స్పందనను రాబట్టుకుంటోందని, చూడని వారు ఓటీటీలో చూడాలని దర్శకనిర్మాతలు కోరారు.

Prabhutva Juniour Kalasala Movie Poster

ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్ జంటగా బ్లాక్ ఆంట్ పిక్చర్స్ పతాకంపై శ్రీమతి కొవ్వూరి అరుణ సమర్పణలో రూపొందిన చిత్రం ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143’ (Prabhutva Juniour Kalasala Punganur 500143). ఒక యదార్థ సంఘటన ఆధారంగా దర్శకుడు శ్రీనాథ్ పులకురం (Sreenath Pulakuram) ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. భువన్ రెడ్డి కొవ్వూరి ఈ సినిమాను నిర్మించారు. జూన్ 21న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం యూత్, ఫ్యామిలీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుకుంది. ఇప్పుడీ సినిమా ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143’ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాను థియేటర్లలో చూడని వారు.. ఓటీటీలో చూడాలని, ప్రతి ఒక్కరినీ అలరించే ప్రేమకావ్యం ఇదని తెలిపారు.

Also Read- Prakash Raj Vs Pawan: పవన్‌కు ప్రకాష్ రాజ్ మరో కౌంటర్‌

ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘మా ప్రభుత్వ జూనియర్ కళాశాల చిత్రాన్ని థియేటర్‌లో చూసిన వారందరికీ ధన్యవాదాలు. చూడని వారి కోసం ఒక శుభవార్త. మా చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. ప్రతి మనిషికి తొలి ప్రేమ ఎంతో మధురంగా, గుండెల్లో పదిలంగా ఉంటుంది. అలాంటి ఓ అందమైన తొలి ప్రేమను ప్రభుత్వ జూనియర్ కళాశాల చిత్రంలో చూపించాము. ఇంటర్మీడియట్ రోజులు.. తొలి ప్రేమ.. విరహ వేదనలు.. ఇలా అన్ని అంశాలతో కుర్రకారుని కట్టి పడేసేలా ఓ అందమైన ప్రేమ కావ్యాన్ని చూపించాం.


ప్రస్తుతం ఈ ప్రేమ కథా చిత్రానికి ఓటీటీ ఆడియన్స్ నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. ఇంకా సినిమా చూడని వారంతా.. ఈ ప్రేమ కావ్యాన్ని ఓటీటీలో చూడండి.. చూసిన ప్రతి ఒక్కరికీ మంచి ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తుంది. ఓటీటీలో విడుదల అయిన తర్వాత చాలామంది ఫోన్ చేసి సినిమా చాలా బాగుంది అని చెప్తున్నారు. ఫ్యామిలీ అందరు కలిసి మంచి కుటుంబ కథా చిత్రం చూడాలి అనుకుంటే మా ప్రభుత్వ జూనియర్ కళాశాల సరైన సినిమా’’ అని తెలిపారు.

Also Read- Movie Ticket Mafia: అభిమానుల జేబులు గుల్ల చేస్తున్న బెనిఫిట్‌ షోలు


Also Read- Harsha Sai: అసలెవరీ హర్షసాయి.. మరో మెగాస్టార్ అంటూ బిల్డప్ ఇచ్చిన వారంతా ఏమయ్యారు

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Sep 26 , 2024 | 05:03 PM