Outside OTT: ఇదో డిఫరెంట్ జాంబీ సినిమా గురు.. చూసి తీరాల్సిందే! ఎందులో ఉందంటే
ABN, Publish Date - Oct 21 , 2024 | 10:03 AM
గత వారం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు, బయపెట్టేందుకు ఓ జాంబీ చిత్రం ఔట్‌సైడ్ వచ్చింది. ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్‌ను ఇస్తోంది.
గత వారం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు, బయపెట్టేందుకు ఓ జాంబీ చిత్రం ఔట్‌సైడ్ (Outside) వచ్చింది. అయితే హలీవుడ్, బాలీవుడ్ నుంచి వచ్చిన సినిమా కాకుండా పిలిప్పిన్స్ (Philippine) నుంచి వచ్చిన చిత్రం అవడం విశేషం. అవార్డ్ విన్నింగ్ యాక్టర్ సిడ్ లూసెరో (Sid Lucero), బ్యూటీ గొంజాలెజ్ (Beauty Gonzalez), మార్కో మాసా (Marco Masa), ఐడెన్ టైలర్ (Aiden Tyler) కీలక పాత్రల్లో నటించగా కార్లో లెడెస్మా (Carlo Ledesma) దర్శకత్వం వహించారు. కాగా ఇది రెగ్యులర్ జాంబీ చిత్రంలా కాకుండా ఓ ఫ్యామిలీ చుట్టూ తిరిగే కథగా ఇంట్రెస్టింగ్గా తెరకెక్కించడం గమనార్హం.
కథ విషయానికి వస్తే.. జాంబీ వైరస్ వళ్ల దేశమంతా నాశనమైపోగా ఫ్రాన్సిస్ తన భార్య ఇత్తరు కుమారులు మాత్రం దానిని నుంచి తప్పించుకుని తను ఎప్పుడో చిన్నతనంలోనే వదిలేసి వచ్చిన తన తండ్రి ఫామ్ హౌస్‌కు చేరుకుంటారు. తీరా వాళ్లు అక్కడికి వెళ్లే సరికి తల్లికి వైరస్ ఎఫెక్ట్ అవగా తండ్రి సుసైడ్ చేసుకుని కనిపిస్తారు. ఫ్రాన్సిస్ తమ్ముడు మాత్రం వేరే ప్రాంతంలో ఉంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఆ ఫామ్‌హౌజ్‌కు వచ్చిన ఫ్రాన్సిస్ ఫ్యామిలీకి అక్కడ ఎక్కువ రోజులు ఉండలేమని తెలిసి భార్య బలవంతంతో వేరే ప్రాంతానికి బయలుదేరి విఫలమై తిరిగి అదే ఇంటికి వచ్చి చేరుతారు.
ఈ క్రమంలో రోజులు గడిచిన తర్వాత ఫ్రాన్సిస్‌లో వింత ప్రవర్తన మొదలువుతుంది, ఆ ఇంట్లో సూసైడ్ చేసుకున్న తన తండ్రి ఆత్మ కనిపించి ఏదో చెప్పినట్లుగా ఫీలవుతూ తన భార్యపై ఆగ్రహంతో ఉండడమే కాక సైకోగా ప్రవర్తించడం మొదలు పెడతాడు. ఆ నేపథ్యంలోనే జాంబీలు ఆ ఇంటిపై ఎటాక్‌కు ప్రయత్నం చేయడం, ఫ్రాన్సిస్ నుంచి త్పించుకునేందుకు భార్య కుమారులు ప్రయత్నించడం, వారిని ఇంట్లో బంధించడం, చిన్న కొడుకుపై జాంబీ ఎటాక్ జరగడం వంటి ఘటనలు చోటు చేసుకుంటాయి. చివరకు ఆ ఫ్యామిలీ జాంబీల నుంచి తప్పించుకుందా, ఫ్రాన్సిస్ తమ్ముడు ఏమయ్యాడు, ఫైనల్‌గా ఎవరు మిగిలారనే ఆసకక్తికరమైన కథకథనాలతో సినిమా సాగుతూ చూసే ప్రేక్షకులకు కొత్త థ్రిల్‌ను ఇస్తుంది.
సుమారు రెంగడు గంటలపైనే నిడివి ఉన్న ఈ సినిమా ఇప్పుడు నెట్ఫ్తిక్స్ (Netflix) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. కాకపోతే ఈ సినిమా కేవలం ఫిలిఫ్పీన్స్, హాందీ, ఇంగ్లీష్ భాషలలో మాత్రమే అందుబాటులో ఉంది. జాంబీ సినిమాలు ఇష్టపడే వారు ఈ సినిమాను మిస్సవకుండా మస్ట్‌గా చూడొచ్చు. అయితే ఓ దగ్గర మాత్రం లైట్ మసాలా సన్నివేశం ఉంటుంది కాబట్టి కుటుంబంతో కలిసి చూసేప్పుడు మాత్రం కాస్త జాగ్రత్త వహిస్తే మంచిది. మిగతా అంతా ఫ్యామిలీతో కలిసి ఈ ఔట్‌సైడ్ (Outside) మూవీని చూసేయవచ్చు.