Pailam Pilaga OTT: పైలం పిలగాడు.. ఓటీటీలోకి వచ్చేశాడు

ABN, Publish Date - Oct 26 , 2024 | 07:32 PM

థియేటర్లలో డీసెంట్ సక్సెస్ పొందిన ‘పైలం పిలగా’ చిత్రం ఇప్పుడు ఓటీటీలోనూ మంచి స్పందనను రాబట్టుకుంటూ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. అక్టోబర్ 10 నుండి ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకుల అలరిస్తోంది. ఈ సినిమాకు వస్తోన్న ఆదరణతో చిత్రయూనిట్ సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది.

Pailam Pilaga Movie Still

థియేటర్లలో డీసెంట్ సక్సెస్ పొందిన ‘పైలం పిలగా’ (Pailam Pilaga) చిత్రం ఇప్పుడు ఓటీటీలోనూ మంచి స్పందనను రాబట్టుకుంటూ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. అక్టోబర్ 10 నుండి ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమా, ఓటీటీలో వచ్చే క్రైమ్, హారర్, అడల్ట్ కంటెంట్‌కి భిన్నంగా పిల్లలు, పెద్దలు ఫ్యామిలీ అంతా కలిసి కూర్చుని చూసే నీట్ అండ్ క్లీన్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా పేరు గడిస్తూ.. ట్రెండింగ్‌లో ఉంది. మెలోడియస్ పాటలు, ఆకట్టుకునే డైలాగ్స్ ఈ సినిమాకు ప్లస్ అనేలా ఓటీటీ వీక్షకుల నుండి ప్రశంసలు అందుకుంటోంది. ఓటీటీలో ఈ చిత్రానికి వస్తోన్న ఆదరణతో చిత్ర బృందం సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది. (Pailam Pilaga in OTT)

Also Read-NBK: అన్‌స్టాపబుల్ స్టేజ్‌పై బాలయ్య.. కానీ ఈ లుక్ ఏ సినిమాలోదో కనిపెట్టారా?

ఈ సినిమా కథ విషయానికి వస్తే.. సాయి తేజ కల్వకోట (శివ) దుబాయ్ వెళ్లి బాగా సెటిల్ అవ్వాలని కలలు కంటూ ఉంటాడు. ఈ క్రమంలో అతని నాన్నమ్మ శాంతి (డబ్బింగ్ జానకి) ఒక స్థలం ఉంది, దానిని అమ్మితే డబ్బు వస్తుంది.. నువ్వు దుబాయ్ వెళ్ళవచ్చు అని చెబుతుంది. శివ తన స్నేహితుడు ప్రణవ్ సోను (శ్రీను)తో కలిసి స్థలం అమ్ముదామని అనుకుంటాడు. ఆ స్థలం లిటికేషన్‌లో ఉంటుంది. ఆ లిటికేషన్ ఏంటి? చివరికి శివ దుబాయ్ వెళ్లాడా? దేవి (పావని) ఎవరు? వాళ్ల ప్రేమ కథ ఏంటి? ఆ ప్రేమకథకి, శివ దుబాయ్ ప్లాన్‌కి ఉన్న లింకేంటి? అనేది తెలియాలంటే ఓటీటీలోకి వచ్చిన ఈ పైలం పిలగాడిని చూడాల్సిందే.

Also Read- Star Heroine: ఈ ఫొటోలోని పాప ఇప్పుడొక స్టార్ హీరోయిన్.. ఎవరో కనిపెట్టండి చూద్దాం!


ఇందులో పల్లెలు, ప్రకృతి, పర్యావరణం, వ్యవసాయం, ఉపాధి, వలసలు, ప్రభుత్వ ఉద్యోగుల అలసత్వం, లంచగొండితనం వంటి లోతైన అంశాలను సైతం హాస్యభరితంగా, వ్యంగ్యంగా చూపించడంతో ప్రేక్షకులను ఈ సినిమా మంచి ఎంగేజ్ చేస్తుంది. అలాగే ఊహించని క్లైమాక్స్‌ కూడా జనాలను స్క్రీన్ ముందు కూర్చోబెడుతుంది. హ్యాపీ హార్స్ ఫిలిమ్స్ బ్యానర్‌లో యాడ్ ఫిలిం డైరెక్టర్ ఆనంద్ గుర్రం దర్శకత్వంలో రామకృష్ణ బొద్దుల, ఎస్.కే. శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మించారు. డబ్బింగ్ జానకి, చిత్రం శీను, మిర్చి కిరణ్ తదితరులు ఇతర పాత్రలలో నటించారు.

Also Read-CID: బుల్లితెర ఆడియెన్స్‌కి గుడ్ న్యూస్.. రెండు దశాబ్దాలు స్మాల్ స్క్రీన్‌ని ఏలిన షో వచ్చేసింది

Also Read-Mahesh Babu: నువ్వు కాపాడిన 3772వ ప్రాణం సామీ..

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 26 , 2024 | 07:32 PM