Paarijatha Parvam OTT: ‘ఆహా’లోకి వచ్చేసిన హిలేరియస్ క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్

ABN , Publish Date - Jun 12 , 2024 | 05:23 PM

హిలేరియస్ క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘పారిజాత పర్వం’ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్, మాళవిక సతీశన్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా ‘ఆహా’ తెలుగు ఓటీటీలో మంచి స్పందనను రాబట్టుకుంటోంది. సంతోష్ కంభంపాటి డైరెక్ట్ చేసిన ఈ మూవీ యాక్షన్, డ్రామా, ఫన్ ఇలా అన్నీ ఎలిమెంట్స్‌తో రూపుదిద్దుకుంది.

Paarijatha Parvam OTT: ‘ఆహా’లోకి వచ్చేసిన హిలేరియస్ క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్
Paarijatha Parvam Movie Still

హిలేరియస్ క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘పారిజాత పర్వం’ (Paarijatha Parvam) ఆహా ఓటీటీ (Aha OTT)లో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్, మాళవిక సతీశన్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా ‘ఆహా’ తెలుగు ఓటీటీలో మంచి స్పందనను రాబట్టుకుంటోంది. సంతోష్ కంభంపాటి (Kambhampati Santosh) డైరెక్ట్ చేసిన ఈ మూవీ యాక్షన్, డ్రామా, ఫన్ ఇలా అన్నీ ఎలిమెంట్స్‌తో రూపుదిద్దుకుంది. చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్ పెర్ఫార్మెన్స్‌లని.. అలాగే డిఫరెంట్ స్క్రీన్‌ప్లే, విజువల్స్, మ్యూజిక్, టాప్ క్లాస్ ప్రొడక్షన్ వేల్యూస్‌తో రూపొందిన ఈ హిలేరియస్ కిడ్నాప్ డ్రామాని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారని ఆహా ప్రకటించింది. ప్రస్తుతం ఈ మూవీ టాప్‌లో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. (Paarijatha Parvam in Aha OTT)

Also Read- Nara Rohith: పెదనాన్న.. అంటూ నారా రోహిత్ రాసిన లెటర్ వైరల్


Paarijatha-parvam.jpg

ఈ సినిమా కథ (Paarijatha Parvam Story) విషయానికి వస్తే.. చైతన్య (చైతన్య రావు) తన ఫ్రెండ్ హర్ష(హర్ష చెముడు)ని హీరోగా పెట్టి ఒక రియల్ స్టోరీని డైరెక్ట్ చేయాలని ప్లాన్ చేస్తుంటాడు. మరో వైపు బార్ శీను(సునీల్) హీరో అవుదామని వచ్చి డాన్‌గా మారతాడు. చైతన్య తన మొదటి సినిమాని హర్ష‌తోనే చేయాలని ఫిక్సై.. పలువురు నిర్మాతలని కలుస్తూ ఉంటాడు. అలా కలుస్తోన్న సమయంలో ఓ నిర్మాత శెట్టి(శ్రీకాంత్ అయ్యంగార్) వాళ్ళని బాగా అవమానిస్తాడు. అప్పుడు చైతన్య, హర్షలు ఏం చేశారు? హీరో అవుదామని వచ్చిన బార్ శీను‌కి, చైతన్యకి ఉన్న కనెక్షన్ ఏంటి? ఈ కనెక్షన్‌కు పార్వతి(శ్రద్ధా దాస్) పాత్రకి ఉన్న సంబంధం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే హిలేరియస్ కిడ్నాప్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా.

Read Latest Cinema News

Updated Date - Jun 12 , 2024 | 08:31 PM