Paarijatha Parvam: ‘పారిజాత పర్వం’ టీజర్.. హిలేరియస్..
ABN , Publish Date - Mar 21 , 2024 | 09:47 AM
చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్, మాళవిక సతీశన్ ప్రధాన పాత్రలలో వనమాలి క్రియేషన్స్ బ్యానర్‌పై సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో మహీధర్ రెడ్డి, దేవేష్ నిర్మిస్తున్న హిలేరియస్ క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘పారిజాత పర్వం’. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా మేకర్స్ టీజర్‌ని విడుదల చేశారు. చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్.. ఇలా సినిమాలోని ప్రధాన పాత్రలని పరిచయం చేస్తూ ప్రారంభమైన టీజర్ చాలా ఆసక్తికరంగా వుంది.
చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్, మాళవిక సతీశన్ ప్రధాన పాత్రలలో వనమాలి క్రియేషన్స్ బ్యానర్‌పై సంతోష్ కంభంపాటి (Santosh Kambhampati) దర్శకత్వంలో మహీధర్ రెడ్డి, దేవేష్ నిర్మిస్తున్న హిలేరియస్ క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘పారిజాత పర్వం’ (Paarijatha Parvam). ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా మేకర్స్ టీజర్‌ని విడుదల చేశారు. చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్.. ఇలా సినిమాలోని ప్రధాన పాత్రలని పరిచయం చేస్తూ ప్రారంభమైన టీజర్ చాలా ఆసక్తికరంగా వుంది. (Paarijatha Parvam Teaser Out)
యాక్షన్, డ్రామా, ఫన్ ఇలా అన్నీ ఎలిమెంట్స్‌తో టీజర్ ప్రేక్షకులని అలరిస్తోంది. టీజర్ చివరిలో వైవా హర్ష చెప్పిన డైలాగ్ నవ్వులు పూయిస్తోంది. చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్ పాత్రల ప్రజెన్స్ ఇంట్రస్టింగ్‌గా ఉండగా.. సునీల్ చేతిపై జై చిరంజీవా అనే టాటూ ప్రత్యేకంగా ఆకర్షించింది. దర్శకుడు సంతోష్ కంభంపాటి హిలేరియస్ క్రైమ్ కామెడీని ప్రేక్షకులకు అందించబోతున్నారనేది ఈ టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. (Paarijatha Parvam Teaser Talk)
టీజర్‌కి కంపోజర్ రీ (Ree) అందించిన నేపధ్య సంగీతం గ్రిప్పింగ్‌గా వుంది. బాల సరస్వతి కెమెరా, విజువల్స్, నిర్మాణ విలువలు అన్నీ ఉన్నతంగా వున్నాయి. సశాంక్ ఉప్పుటూరి ఎడిటర్‌గా, ఉపేందర్ రెడ్డి ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్న ఈ చిత్రానికి అనంత సాయి సహా నిర్మాత. ఏప్రిల్ 19న (Paarijatha Parvam Release Date) ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ టీజర్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.
ఇవి కూడా చదవండి:
====================
*Ilaiyaraaja Biopic: ఇళయరాజా బయోపిక్.. అధికారిక ప్రకటన వచ్చేసింది
************************
*RC16: ఘనంగా ‘RC16’ ప్రారంభం.. ఫొటోలు వైరల్
********************************
*Ashwatthama: ‘హనుమాన్’ వంటి మరో చిరంజీవి కథ.. హీరో ఎవరంటే?
***************************