Bigg Boss Telugu 8: ఓజీ Vs రాయల్స్! బిగ్ బాస్ సీజన్ 8 నామినేషన్స్ రచ్చ
ABN, Publish Date - Oct 08 , 2024 | 09:56 AM
బిగ్ బాస్ సీజన్ 8లో మరో కొత్త ఆద్యాయానికి సిద్దమైంది. తాజాగా వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన సభ్యులు అప్పటికే హౌజ్‌లో ఉన్న రాయల్స్ ను నామినేట్ చేసే పవర్ ఉండడంతో సరికొత్త ఫైటింగ్ ప్రారంభమైంది.
బిగ్ బాస్ సీజన్ 8లో మరో కొత్త ఆద్యాయానికి సిద్దమైంది. సెప్టెంబర్ 1న 14 మందితో ప్రారంభమైన బిగ్‌బాస్ సీజన్ 8 ఐదు వారాలు ముగిసే సరికి ఆరుగురు కంటెస్టెంట్స్ (బెజవాడ బేబక్క, ఆర్జే శేఖర్ భాషా, అభయ్ నవీన్, సోనియా ఆకుల, ఆదిత్య ఓం, నైనిక ) హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యి ఇంటికి వెళ్లి పోయారు. ఆ వెంటనే వైల్డ్ కార్డ్ ద్వారా 8 మందిని లోపలికి పంపిస్తున్నట్లు బిగ్‌బాస్ అనౌన్స్ చేయడం ఆ వెంటనే రాయల్స్ అంటూ అంతకుముందు సీజన్లలో పాల్గొన్న కంటెస్టెంట్లు హరితేజ, నయని పావని, గంగవ్వ, మెహబూబ్, గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజా, రోహిణి, ముక్కు అవినాష్‌లు వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా ఎంట్రీ ఇవ్వడం జరిగిపోయాయి.
అంతేగాక హౌస్‌లో ఉన్న వారికి ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్స్ (ఓజీ) అని ఇప్పటికే పేరు పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన వారికి రాయల్ క్లాన్‌గా నామయకరణం చేయడంతో పాటు ఆరో వారం పార్టిసిపెంట్లను నామినేట్ చేసే ఛాన్స్ కూడా ఇవ్వడంతో గేమ్ మరింత రసకందాయంగా మారింది. కొత్త వాళ్లు హౌజ్‌లో అడుగు పెట్టారో లేదో పాత కంటెస్టెంట్స్‌తో రచ్చ స్టార్ట్ అయింది. ఓజీ గ్యాంగ్‌లో ఒకింత ఈగో, నిస్పృహలతో వాదనలకు సై అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రాయల్ గ్యాంగ్ ఓటీ సభ్యలు్లో తమకు నచ్చని వారిని నామినేట్ చేశారు.
ఈ క్రమంలో సోమవారం జరిగిన ఎపిసోడ్‌లో ముందుగా హరితేజ యష్మీ, పృథ్విలను, గౌతమ్.. విష్ణుప్రియా, యష్మీలను, మెహబూబ్ యష్మీ, సీతలను, పావని.. విష్ణుప్రియ, సీతలను, టేస్టీ తేజ సీత, మణికంఠలను నామినేట్ చేయగా మంగళవారం ప్రసారం కానున్న రెండో ఏపిసోడ్‌లో ఎవరు ఎవరిని నామినేట్ చేశారో తెలియాల్సి ఉంది. చివరకు బిగ్‌బాస్ ఓజీ టీమష్‌కు ఇచ్చిన ఓ పవర్‌తో వైల్డ్ కార్ట్‌తో హౌజ్‌లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన వారిలో గంగవ్వ, మెహబూబ్‌లు నామినేషన్స్‌లోకి రావడం విశేషం. అయితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారాన్ని బట్టి ఆరో వారం ఆరుగురు కంటెస్టెంట్స్ విష్ణుప్రియ, కిరాక్ సీత, పృథ్వీ, యష్మీగౌడ, రాయల్ క్లాన్ నుంచి ఇద్దరు ఫైనల్‌గా నామినేషన్స్‌లో ఉన్నట్లు తెలుస్తోండగా గంగవ్వ ఓటింగ్ టాప్‌లో ఉండగా కిరాక్ సీత, యష్మి డేంజర్ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.