Gold Run OTT: ఓటీటీలో తెలుగులో.. నార్వే వార్‌, హైస్ట్ సినిమా! స్ట్రీమింగ్‌ ఎందులో అంటే?

ABN, Publish Date - Sep 08 , 2024 | 02:55 PM

తెలుగు ఓటీటీ అభిమానుల‌ను అల‌రించేందుకు తాజాగా ఓ విదేశీ చిత్రం వ‌చ్చేసింది. అయితే ఎప్పుడు వ‌చ్చే హాలీవుడ్ఢో, కోరియ‌న్‌, చైనీస్ లాంగ్వేజ్ నుంచి కాకుండా నార్వేజియ‌న్ నుంచి అందులోనూ వార్‌, హైస్ట్ నేప‌థ్యంలో రూపొందిన చిత్రం అవ‌డం విశేషం.

gold run

తెలుగు ఓటీటీ అభిమానుల‌ను అల‌రించేందుకు తాజాగా ఓ విదేశీ చిత్రం గోల్డ్‌ ర‌న్ (Gold Run) వ‌చ్చేసింది. అయితే ఇప్పుడు డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చిన ఈ మూవీ ఎప్పుడు వ‌చ్చే హాలీవుడ్ఢో, కోరియ‌న్‌, చైనీస్ నుంచి కాకుండా నార్వేజియ‌న్ నుంచి అందులోనూ వార్‌, హైస్ట్ నేప‌థ్యంలో రూపొందిన చిత్రం అవ‌డం విశేషం. 2022 డిసెంబ‌ర్ 14న నార్వే థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ చిత్రం మంచి విజ‌యం సాధించింది. హాల్వార్డ్ బ్రెయిన్ (Hallvard Bræin) ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా జోన్ ఓయిగార్డెన్ (Jon Oigarden), మోర్టెన్ స్వార్ట్‌వీట్ (Morten Svartveit), స్వెన్ నార్డిన్ (Sven Nordin) కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

క‌థ విష‌యానికి వ‌స్తే.. 1940 సంవ‌త్స‌రంలో రెండో ప్ర‌పంచ యుద్దం స‌మ‌యంలో హిట్ల‌ర్ నేతృత్వంలోని జ‌ర్మ‌నీ సైన్యం ఇత‌ర దేశాల‌పై బ‌ల‌వంతంగా దాడులు చేస్తూ అక్క‌డి ప్ర‌జ‌ల‌ను చంపేయ‌డంతో పాటు బంగారం, వ‌జ్రాలు, ధ‌నాన్ని భారీగా దోచేసింది. అ క్ర‌మంలోనే నార్వేలో బంగారు నిల్వ‌లు భారీగా ఉన్న‌ట్లు జ‌ర్మ‌నీ సైన్యం గుర్తించి వాటిని ఎలాగైనా సొంతం చేసుకోవాల‌ని త‌న సైన్యాన్ని రంగంలోకి దింపుతుంది. అయితే ఈ విష‌యం నార్వే ప్ర‌భుత్వానికి తెలియ‌డంతో ఓ సీనియ‌ర్ అధికారిని నియ‌మించి అ బంగారం, ఇత‌ర ధ‌నాన్ని బ్రిట‌న్‌కు త‌ర‌లించాల‌ని అదేశాలు జారీ చేస్తుంది.


ఈక్ర‌మంలో నార్వే అధికారులు ఆ బంగారాన్ని అక్క‌డి నుంచి త‌ర‌లించ‌గ‌లిగారా, మ‌ధ్య‌లో ఎదురైన ఇబ్బందులు ఏంటి, జ‌ర్మ‌నీ సైన్యం ఏ విధంగా దాడులు చేసింది, ఎన్ని ర‌కాలుగా త‌ర‌లించేందుకు ఫ్లాన్స్ చేశారు, వారిని జ‌ర్మ‌నీ సైన్యం అడ్డుకోగ‌లిగిందా లేదా చివ‌రికి ఆ బంగారం ఏమైంది, ఎవ‌రు పైచేయి సాధించారనే ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌క‌థ‌నాల‌తో సినిమా చివ‌రికి స‌స్పెన్స్‌తో సాగుతుంది. రెండో ప్ర‌పంచ య‌ద్ద స‌మ‌యంలో నార్వేలో నిజంగా జ‌రిగిన ఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో ఈ సినిమాను ఇంట్రెస్టింగ్‌గా ఎక్క‌డా ఖ‌ర్చుకు వెన‌కాడ‌కుండా హాలీవుడ్ స్థాయిలో తెర‌కెక్కించారు. ఎక్క‌డా ఓవ‌ర్ బిల్డ‌ప్‌లు లేకుండా స్ట్రెయిట్‌గా సినిమాలోకి తీసుకుపోయి, నాటి ప‌రిస్థితుల‌ను వివ‌రిస్తూ నాటి యుద్ద వాతావ‌ర‌ణాన్ని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూయించారు.

ఇప్పుడు ఈ సినిమా VR OTT అనే ఓటీటీ యాప్‌, బుక్ మై షో స్ట్రీమ్ (Bms Stream) లో, కొన్ని ఫ్రీ వెబ్‌సైట్ల‌లో నార్వేజియ‌న్‌తో పాటు, తెలుగు, ఇంగ్లీష్ భాష‌ల‌లోనూ స్ట్రీమింగ్ అవుతుంది. ఎడా పెడా యాక్ష‌న్ సీన్లు లేన‌ప్ప‌టికీ ఉన్నంత‌లో వార్ సిన్స్ ఆక‌ట్టుకుంటాయి. మంచి వార్, స‌ర్వైవ‌ల్ మూవీస్ ఇష్ట‌ప‌డే వారు ఎట్టి ప‌రిస్థితుల్లో ఈ సినిమాను మిస్ చేయ‌కుండా చూసేయండి. ఎక్క‌డా అస‌భ్య‌త‌, అశ్లీల స‌న్నివేశాలు లేనందున కుటుంబ‌మంతా క‌లిసి ఈ గోల్డ్‌ ర‌న్ (Gold Run) చిత్రాన్ని ఒక్క‌సారి హాయిగా చూసేయ‌వ‌చ్చు.

Updated Date - Sep 08 , 2024 | 02:55 PM