OTTలో కొత్త కొరియన్ క్రైమ్, థ్రిల్లర్.. గజినీ తాత అదరగొట్టేస్తాడంతే!
ABN, Publish Date - Jun 30 , 2024 | 02:57 PM
కాస్త గ్యాప్ తర్వాత ఓ కొరియన్ క్రైమ్, థ్రిల్లర్ చిత్రం రిమెంబర్ తెలుగులో డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చింది. లీ ఇల్-హ్యూంగ్ దర్వకత్వం వహించిన ఈ సినిమాలో లీ సుంగ్-మిన్ నామ్ జూ-హ్యూక్ ప్రధాన పాత్రల్లో నటించారు.
కొరియన్ సినిమాలంటే ఈ మధ్య మన వాళ్లు పడి చస్తున్నారు. ఆ భాష నుంచి సినిమాలు ఎప్పుడు వస్తాయా అని ఆశగా ఎదురు చూస్తూ ఉంటున్నారు. ఈ క్రమంలో కాస్త గ్యాప్ తర్వాత ఇటీవల ఓ కొరియన్ చిత్రం రిమెంబర్ (Remember) డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చింది. లీ ఇల్-హ్యూంగ్ (Lee Il-hyung) దర్వకత్వం వహించిన ఈ సినిమాలో లీ సుంగ్-మిన్ (Lee Sung-min) నామ్ జూ-హ్యూక్ (Nam Joo-hyuk) ప్రధాన పాత్రల్లో నటించారు.
యాక్షన్, క్రైమ్, థ్రిల్లర్ జానర్‌లో వచ్చిన ఈ మూవీ అంతకుముంతే తెలుగులో వచ్చిన గజిని సినిమా తరహా కథలానే అనిపిస్తుంది. 2015లో కెనడాలో వచ్చిన రిమెంబర్ (Remember) సినిమాను అదే పేరుతో కొరియాలో రిమేక్ చేసి 2022లో విడుదల చేశారు. కాగా ఈ సినిమా ఒరిజినల్ కెనడాలో డిజాస్టర్ అవగా రిమేక్ చేసిన సినిమా సౌత్ కొరియాలో హిట్‌గా నిలవడం గమనార్హం.
కథ విషయానికి వస్తే.. మిలటరీ నుంచి రిటైర్ అయి వయసు పైబడిన పిల్ జూ ఓ రెస్టారెంట్‌లో పార్ట్ టైమ్ జాబ్ చేస్తుంటాడు. అప్పటికే ఆల్జీమర్స్ వ్యాధి ఉన్న అతనికి క్యాన్సర్ నిర్ధారణ కావడంతో తను చనిపోయే లోపు గతంలో తన కుటుంబ సభ్యులను చంపిన నలుగురు హై ప్రొపెషనల్స్‌ను అంతమొందించాలని నిర్ణయించుకుంటాడు. ఇందుకోసం ఓ కుర్రాడి సాయం తీసుకుంటాడు. ఈ నేపథ్యంలో పిల్ జూకు హై ప్రొపెషనల్స్‌తో సంబంధం ఏంటి, వారు అతని ఫ్యామిలీ మెంబర్స్‌ను ఎందకు చంపారనే ఆసక్తికరమైన కథకథనాతో సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది.
ఇప్పుడీ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో తెలుగు భాషలోనూ అందుబాటులో ఉంది. ఎలాంటి అభ్యంతరకరమైన సన్నివేశాలు, బోల్డ్ సీన్లు లేనందున సినిమాను ఫ్యామిలీతో కలిసి చూడచ్చు నో ఫ్రాబ్లం. సినిమాకు దేశభక్తి టచ్ ఇవ్వడం, చివరి సన్నివేశం, ఫ్టాష్ బ్యాక్‌లో వచ్చే ఎమోషనల్ దృశ్యాలు ఆకట్టుకుంటాయి. సో యాక్షన్ , థ్రిల్లర్ జానర్లు ఇష్టపడే వారు ఈ చిత్రాన్ని చూడడం మిస్ చేయకండి.