Aay OTT: ఓటీటీకి వచ్చేసిన ‘ఆయ్’.. చివరి వరకు నవ్వులే నవ్వులు! డోంట్ మిస్
ABN, Publish Date - Sep 12 , 2024 | 03:56 PM
‘మ్యాడ్’ సినిమాతో హీరోగా పరిచయమైన ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ రెండో ప్రయత్నంగా రూపొందిన మూవీ ‘ఆయ్’. ఇప్పుడీ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. థియేటర్లలో మిస్సయిన వారు మిస్ అవ్వకుండా కుటుంబంతో కలిసి చూసేయండి.
వరుస విజయాలతో దూసుకెళుతోన్న జీఏ2 పిక్చర్స్ (GA2 Pictures) బ్యానర్ నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ ‘ఆయ్’ (Aay Movie) ఓటీటీకి వచ్చేసింది.‘మ్యాడ్’ సినిమాతో హీరోగా పరిచయమైన ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ రెండో ప్రయత్నంగా రూపొందిన ఈ మూవీలో నయన్ సారిక (Nayan Sarika) కథానాయికగా నటించగా అంజి కె.మణిపుత్ర (Anji K Maniputhra) దర్శకుడిగా పరిచయమయ్యాడు. మిస్టర్ బచ్చన్, ఐస్మార్ట్ శంకర్, తంగలాన్ వంటి భారీ చిత్రాల మధ్య థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది.
కథ విషయానికి వస్తే.. అమలాపురం ప్రాంతంలో పుట్టి పెరిగిన కార్తీక్ (నార్నే నితిన్), సుబ్బు (రాజ్ కుమార్), హరి(అంకిత కొయ్య) ముగ్గురూ చిన్ననాటి నుంచి మంచి స్నేహితులు. కార్తిక్ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా ఉండగా హరి, సుబ్బు ఊళ్లోనే ఉంటారు. అయితే కరోనా లాక్ డౌన్ వల్ల ఊరికొచ్చిన కార్తీక్ స్నేహితులతో సరదాగా గడుపుతూ.. పక్క ఊరికి చెందిన ఫంక్ పల్లవి (నయన్ సారిక)ని చూసి ప్రేమలో పడతాడు. అయితే కార్తీక్ తన కులానికి చెందిన వాడేనని ఇష్టపడినా తర్వాత తెలిసి దూరంగా ఉంటుంది. పెద్దలు కుదిర్చిన పెళ్లికి రెడీ అవుతుంది. వీరిద్దరి పెళ్లి చేయడానికి స్నేహితులు, హరి, సుబ్బు వేసే ఫ్లాన్లు విషయం తెలుసుకున్న కార్తిక్ తండ్రి అడబాల బూరయ్య (వినోద్ కుమార్) ఏం చేశాడు? పల్లవి తండ్రి వీరవాసరం దుర్గకు, బూరయ్యకు ఉన్న సంబంధం ఏంటి? పల్లవితో కార్తీక్ పెళ్లి అయిందా? లేదా అన్నది కథ. (Aay movie OTT)
చిన్ననాటి స్నేహం, వినోదం. పల్లె వాతావరణం ప్రధానంగా సాగే కథతో ప్రతి ఫ్రేములో గోదావరి ప్రజల వ్యంగ్యం , వెటకారం కలిపిన డైలాగ్స్, కామెడీ అక్కడి మనుషుల్లో కనిపించే అమాయకత్వం, పట్టింపులు, అనుబంధాలు, ఇలా అన్నింటినీ కలగలిపి కథను నడిపించారు. ముఖ్యంగా రాజ్ కుమార్ కసిరెడ్డి కామెడీ విపరీతంగా వర్కవుట్ అయింది. అదేవిధంగా క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ సినిమా గ్రాఫ్‌ని పెంచింది. ఇప్పుడీ సినిమా నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. థియేటర్లలో మిస్సయిన వారు ఎట్టి పరిస్థితుల్లో ఈ మూవీని మిస్ అవ్వకుండా కుటుంబంతో కలిసి ఈ ‘ఆయ్’ (Aay Movie) సినిమాను చూసేయండి.