Vikkatakavi: తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌తో మొట్టమొదటి డిటెక్టివ్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
ABN, Publish Date - Nov 01 , 2024 | 07:57 PM
తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతోన్న మొట్ట మొదటి డిటెక్టివ్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది. నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘వికటకవి’ వెబ్ సిరీస్‌ను టాలీవుడ్ నిర్మాణ సంస్థ ఎస్.ఆర్.టి. ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్యాషనేట్ ప్రొడ్యూసర్ రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్‌ని మేకర్స్ ప్రకటించారు. ఆ వివరాల్లోకి వెళితే..
జీ5 ఓ సరికొత్త వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయబోతోంది. ఈ మాధ్యమం నుంచి ‘వికటకవి’ (Vikkatakavi) అనే డిటెక్టివ్ వెబ్ సిరీస్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ వెబ్ సిరీస్ విడుదల తేదీని తాజాగా Zee 5 ప్రకటించింది. ‘వికటకవి’ సిరీస్‌ను తెలుగు, తమిళ భాషల్లో నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు Zee 5 అధికారికంగా ప్రకటించింది. నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్‌ను టాలీవుడ్ నిర్మాణ సంస్థ ఎస్.ఆర్.టి. ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్యాషనేట్ ప్రొడ్యూసర్ రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహిస్తున్నారు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతోన్న మొట్ట మొదటి డిటెక్టివ్ వెబ్ సిరీస్ ఇదే కావటం విశేషం. (Vikkatakavi Streaming Date)
Also Read- L2 Empuraan: ‘హరి హర వీరమల్లు’కి పోటీగా మోహన్ లాల్ సినిమా..
ఈ వెబ్ సిరీస్ స్టోరీ లైన్ విషయానికి వస్తే.. హైదరాబాద్ విలీనం తర్వాత నల్లమల ప్రాంతంలోని ‘అమరగిరి’ అనే ప్రాంతాన్ని 30 ఏళ్లుగా ఓ శాపం పట్టి పీడిస్తుంటుంది. కొన్ని కారణాలతో అమరగిరి ప్రాంతంలోని సమస్యను గుర్తించటానికి డిటెక్టివ్ రామకృష్ణ వెళతాడు. తన తెలివి తేటలతో ఆ గ్రామానికి సంబంధించిన పురాతన కథలను, అధునిక కుట్రల వెనుకున్న రహస్యాలను వెలికితీస్తాడు. ఈ ప్రయాణంలో తనకు ఎదురయ్యే సవాళ్లు ఏంటి? అమరిగిరి ప్రాంతంతో రామకృష్ణకు ఉన్న అనుబంధం ఏంటనేది తెలుసుకోవాలంటే ‘వికటకవి’ సిరీస్ చూడాల్సిందేనంటున్నారు మేకర్స్. అజయ్ అరసాడ సంగీతాన్ని అందిస్తుండగా షోయబ్ సిద్ధికీ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. (Vikkatakavi Detective Web Series)
ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్‌ని తెలుపుతూ విడుదల చేసిన పోస్టర్ కూడా ‘వికటకవి’పై ఆసక్తిని పెంచుతోంది. నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ఇద్దరూ నల్లమల అడవిలో దేని కోసమో సెర్చ్ చేస్తున్నట్లుగా ఈ పోస్టర్‌ని డిజైన్ చేశారు. ఈ పోస్టరే ఇదొక థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ అనేలా ఇంట్రస్ట్‌ని కలగజేస్తోంది. మరి ఈ ‘వికటకవి’ ప్రేక్షకులని ఎలా అలరించనున్నాడో తెలియాలంటే నవంబర్ 28 వరకు వేచి చూడాల్సిందే.