Music Shop Murthy: ఒకటి కాదు.. రెండు ఓటీటీలలో.. అవేంటంటే?
ABN, Publish Date - Jul 17 , 2024 | 03:47 PM
అజయ్ ఘోష్, చాందినీ చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మ్యూజిక్ షాప్ మూర్తి’. ఇటీవల థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి స్పందననే రాబట్టుకుంది. థియేటర్లో సినిమాను చూసిన ప్రతీ ఒక్కరూ ఎమోషనల్‌గా కనెక్ట్ అవడమే కాక, బరువెక్కిన గుండెతో థియేటర్ నుంచి బయటకు వచ్చినట్లుగా ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. తాజాగా ఈ సినిమా రెండు ఓటీటీలలో విడుదలైన మంచి స్పందనను రాబట్టుకుంటోంది.
అజయ్ ఘోష్ (Ajay Ghosh), చాందినీ చౌదరి (Chandini Chowdary) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ (Music Shop Murthy). ఇటీవల థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి స్పందననే రాబట్టుకుంది. థియేటర్లో సినిమాను చూసిన ప్రతీ ఒక్కరూ ఎమోషనల్‌గా కనెక్ట్ అవడమే కాక, బరువెక్కిన గుండెతో థియేటర్ నుంచి బయటకు వచ్చినట్లుగా ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. థియేటర్లలో అలరించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. అదీ కూడా ఒక్కటి కాదు.. రెండు ప్రముఖ ఓటీటీ సంస్థలలో ఈ సినిమా స్ట్రీమింగ్‌కు వచ్చింది. అవేంటంటే.. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), ఈటీవీ (Etv Win) విన్‌లలో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. ముందుగా ఈటీవీ విన్‌లో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లోనూ అందుబాటులో ఉందనేలా.. సదరు ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది.
Also Read- Game Changer: అప్డేట్స్ లేవ్.. లీక్స్‌తోనే పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్
ఫ్లై హై సినిమాస్‌పై హర్ష గారపాటి మరియు రంగారావు గారపాటి ఈ సినిమాను నిర్మించారు. శివ పాలడుగు (Siva Paladugu) రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీ ఆడియెన్స్‌ని సైతం ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ చిత్రం విడుదలైన రెండు ఓటీటీలలోనూ టాప్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది. ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ ఇలా అన్ని అంశాలతో, మంచి సందేశంతో కూడిన ఈ చిత్రాన్ని ఓటీటీ ప్రేక్షకుల సైతం ఆదరిస్తున్నందుకు సంతోషంగా ఉందని చిత్రయూనిట్ కూడా సంతోషం వ్యక్తం చేస్తోంది.
ఈ చిత్ర కథ విషయానికి వస్తే (Music Shop Murthy Story).. వినుకొండ అనే వూరిలో మూర్తి (అజయ్ ఘోష్) ఒక మ్యూజిక్ షాప్ పెట్టుకొని దానిపై వచ్చీ రాని ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు. అతని భార్య జయ (ఆమని) పిండి వంటలు చేసి అమ్ముతూ భర్తకి సాయపడుతూ ఉంటుంది. మ్యూజిక్ షాప్ అమ్మేసి ఒక మొబైల్ షాప్ పెట్టమని భర్తతో పోరు పెడుతూ ఉంటుంది. మూర్తికేమో సంగీతం వదలకూడదు, అందులోనే ఇంకా ఏదైనా కొత్తగా ప్రయత్నం చేసి ముందుకు వెళ్లాలని అనుకుంటాడు. ఆ వూర్లో ఎటువంటి ఫంక్షన్ అయినా మ్యూజిక్ ఈవెంట్ మాత్రం మూర్తి పెడుతూ ఉంటాడు. అలా ఒకసారి ఒక ఫంక్షన్‌లో మూర్తి చేసిన పని నచ్చి అక్కడి వాళ్ళు అతన్ని డీజే అయితే బాగుంటుంది, డబ్బు కూడా బాగా వస్తుంది అని సలహా ఇస్తారు. 52 ఏళ్ల మూర్తి డీజే అయి, కుటుంబాన్ని ఆర్ధిక ఇబ్బందులనుండి బయట పడేయాలని, ఆన్‌లైన్‌లో దాని గురించి వెతకటం మొదలుపెట్టి తెలుసుకుంటాడు. అదే వూర్లో అంజన (చాందిని చౌదరి) అనే అమ్మాయి అమెరికానుండి వచ్చి డీజే అవ్వాలని అనుకుంటుంది. కానీ ఆమె తండ్రి (భాను చందర్) ఆమెకి అడ్డుపడతాడు, ఆడపిల్లలు అలాంటివి చెయ్యకూడదు అంటాడు. ఒక సందర్భంలో మూర్తి షాపుకు అంజన వచ్చి అక్కడ సంగీత కళాకారులని చూసి, మూర్తికి సంగీతం అంటే ప్రాణం అని తెలుసుకొని, అతనికి డీజే నేర్పుతా అని చెబుతుంది. ఇద్దరూ మంచి స్నేహితులు అవుతారు, కానీ వారిద్దరినీ చూసి వూర్లో వాళ్ళు ఇంకోలా భావిస్తారు. ఇంతకీ మూర్తి డీజే అయ్యాడా? అంజన తండ్రి మాట కాదని ఏమి చేసింది? మూర్తి, అంజన కలిసి ఎటువంటి ప్రయత్నాలు చేశారు? మూర్తి భార్య మూర్తి డీజే అయితే ఎందుకు ఒప్పుకోవటం లేదు? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ ఓ మంచి మెసేజ్‌తో కూడిన సమాధానమే ఈ సినిమా.
Read Latest Cinema News