Chiranjeevi: ఆ వెబ్ సిరీస్ చూసిన చిరు.. రెండో సీజన్ కోసం ఎదురుచూస్తున్నా అంటూ ట్వీట్!

ABN , Publish Date - Jun 20 , 2024 | 03:56 PM

రీసెంట్‌గా మెగాస్టార్ చిరంజీవి ఓ వెబ్ సిరీస్ చూశారు. చూడటమే కాదు.. ఆ వెబ్ సిరీస్ రెండో సీజన్ కోసం వెయిట్ చేస్తున్నా అంటూ ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యారు కూడా. ఇంతకీ ఏమిటా వెబ్ సిరీస్ అనుకుంటున్నారా? ‘పరువు’. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లి. బ్యానర్‌పై విష్ణు ప్రసాద్ లగ్గిశెట్టి, సుస్మిత కొణిదెల నిర్మించిన జీ5 ఒరిజినల్ సిరీస్ ఇది.

Chiranjeevi: ఆ వెబ్ సిరీస్ చూసిన చిరు.. రెండో సీజన్ కోసం ఎదురుచూస్తున్నా అంటూ ట్వీట్!
Megastar Chiranjeevi

రీసెంట్‌గా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఓ వెబ్ సిరీస్ చూశారు. చూడటమే కాదు.. ఆ వెబ్ సిరీస్ రెండో సీజన్ కోసం వెయిట్ చేస్తున్నా అంటూ ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యారు కూడా. ఇంతకీ ఏమిటా వెబ్ సిరీస్ అనుకుంటున్నారా? ‘పరువు’ (Paruvu). గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లి. బ్యానర్‌పై విష్ణు ప్రసాద్ లగ్గిశెట్టి (Vishnu Prasad Laggisetty), సుస్మిత కొణిదెల (Sushmita Konidela) నిర్మించిన జీ5 ఒరిజినల్ సిరీస్ ఇది. సిద్దార్థ్ నాయుడు, వడ్లపాటి రాజశేఖర్ ఈ చిత్రానికి దర్శకులు. మెగా బ్రదర్ నాగబాబు, నివేదా పేతురాజ్, నరేష్ అగస్త్య, ప్రణీత పట్నాయక్, బిందు మాధవి, అమిత్ తివారి వంటి వారు ప్రముఖ పాత్రలు పోషించారు. పవన్ సాధినేని షో రన్నర్‌గా వ్యవహరించిన ఈ ZEE5 ఒరిజినల్ సిరీస్ జూన్ 14 నుంచి స్ట్రీమింగ్ అవుతూ మంచి ఆదరణను రాబట్టుకుంటోంది. ఈ సిరీస్ చూసిన వారంతా రెండో సీజన్ ఎప్పుడొస్తుందా? అనేలా ఎదురుచూస్తున్నారు.

Also Read- Chiranjeevi: మంత్రి దుర్గేష్‌కు శుభాకాంక్షలు.. అభివృద్ధి దిశగా ముందుకెళ్లాలనే ఆకాంక్షతో..


Paruvu-Web-Series.jpg

తాజాగా ఈ ‘పరువు’ వెబ్ సిరీస్‌ (Paruvu Web Series)ను చూసిన మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ట్వీట్ వేశారు. ‘పరువు’ రెండో సీజన్ (Paruvu Second Season) కోసం ఎదురుచూస్తున్నానని తెలపడమే కాకుండా.. ‘పరువు’ సీజన్ 1 మెయిన్ కాన్సెప్ట్‌ని ఆయన తన ట్వీట్‌లో రాయడం విశేషం. ‘‘ఒక చక్కటి ప్లాన్‌తో చందు బాడీ మాయం చేసి, ఆ జంట పడే తిప్పలు, అదే విషయమై ఎమ్మెల్యే గారి పాట్లు. చివరకి ఈ జంట తప్పించుకుందా లేదా అని సీజన్‌2 లోనే చూడాలనుకుంటా..’’ అని మెగాస్టార్ చిరంజీవి తన ఎగ్జైట్మెంట్‌ను పంచుకున్నారు. ‘పరువు చాలా పెద్ద సక్సెస్ అయింది.. తెలుగు ఓటీటీలో అద్భుతమైన కంటెంట్‌ను ఇస్తున్న సుష్మిత కొణిదెలను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది. నా ప్రియమైన సోదరుడు నాగబాబు అద్భుతంగా నటించారు.. డోంట్ మిస్’ అని చిరంజీవి వేసిన ట్వీట్ అందరినీ ఆకట్టుకుంటోంది. చిరు ట్వీట్‌కు నెటిజన్లు ‘థ్యాంక్యూ బాస్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తమ ‘పరువు’పై ట్వీట్ వేసిన చిరుకు గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లి., జీ5 (Zee5) వర్గాలు ధన్యవాదాలు తెలిపాయి.

Read Latest Cinema News

Updated Date - Jun 20 , 2024 | 03:56 PM