Masthu Shades Unnai Ra: ‘మస్తు షేడ్స్ ఉన్నాయి రా.!’.. అమెజాన్‌లో రికార్డ్ వ్యూస్
ABN, Publish Date - Aug 02 , 2024 | 01:46 AM
టెక్నాలజీ ఎంత పెరుగుతున్నా, ఎమోషన్స్‌ని మించే టెక్నాలజీ అందుబాటులోకి రాలేదు. అలాంటి బలమైన ఎమోషన్స్‌ను ప్రధానంగా చేసుకుని తీసిన చిత్రమే ‘మస్తు షేడ్స్ ఉన్నాయి రా.!’. అందరూ పోల్చుకో తగిన కథతో, అందరూ రిలేట్ అయ్యేలా ఇంటిల్లిపాది చూడగలిగే చిత్రంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలో రికార్డ్ వ్యూస్ రాబట్టి మరోసారి ట్రెండింగ్‌లోకి రావడం విశేషం.
మంచి సినిమాకు ఆడియెన్స్ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని కొన్ని చిత్రాలు ఇప్పటికీ నిరూపిస్తూనే ఉన్నాయి. చిన్న చిత్రాలకు, కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలకు భారీ ఓపెనింగ్స్ రాకపోవచ్చు కానీ.. ఆడియెన్స్‌కి కనెక్ట్ అయితే చిన్న చిత్రాలే పెద్ద సక్సెస్‌ను అందుకుంటాయి. ఈ క్రమంలోనే ‘మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా.!’ అనే చిత్రం వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. టెక్నాలజీ ఎంత పెరుగుతున్నా, ఎమోషన్స్‌ని మించే టెక్నాలజీ అందుబాటులోకి రాలేదు. అలాంటి బలమైన ఎమోషన్స్‌ను ప్రధానంగా చేసుకుని తీసిన చిత్రమే ‘మస్తు షేడ్స్ ఉన్నాయి రా.!’ (Masthu Shades Unnai Ra). అందరూ పోల్చుకో తగిన కథతో, అందరూ రిలేట్ అయ్యేలా ఇంటిల్లిపాది చూడగలిగే చిత్రంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలో రికార్డ్ వ్యూస్ రాబట్టి మరోసారి ట్రెండింగ్‌లోకి రావడం విశేషం.
Read Latest Cinema News
అభినవ్ గోమఠం (Abhinav Gomatam), వైశాలి రాజ్, అలీ రెజా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి తిరుపతి రావు ఇండ్ల (Thirupathi Rao Indla) దర్శకత్వం వహించారు. ఆరెం రెడ్డి, ప్రశాంత్.వి, భవాని కాసుల సంయుక్తంగా.. కాసుల క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫిబ్రవరి 23న థియేటర్లలో రిలీజ్ అయి మంచి చిత్రంగా గుర్తింపు తెచ్చుకుంది. మార్చ్ 29 నుంచి ప్రముఖ ఓటిటి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ అవుతూ 100 ప్లస్ మిలియన్ రియల్ టైం వ్యూయింగ్ మినిట్స్‌తో దూసుకుపోతోంది. ఈ విషయం తెలిసి చిత్ర మేకర్స్ తమ ఆనందాన్ని తెలియజేశారు. ఈ చిత్రాన్ని ఇంతగొప్పగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. మనోహర్ (అభినవ్ గోమఠం) ఒక ఆర్టిస్ట్. అతని పెళ్లి రోజున పెళ్లి కూతురు పారిపోతుంది. అంతే, అతని లైఫ్ ఒక్కసారిగా తలకిందులు అవుతుంది. మనోహర్ పెద్దగా చదువుకోలేదు. అలాగే జీవితంలో కూడా స్థిరపడకపోవడంతో కాసేపట్లో పెళ్లి అనే టైమ్‌లో పెళ్లికూతురు వేరే వ్యక్తితో వెళ్లిపోతుంది. అంతే.. బంధువులు అతడిని చిన్నచూపు చూస్తారు. ఈ సంఘటనతో పెళ్లి ప్రస్తావన ఇక వద్దనుకున్న మనోహర్ ఆఫ్ సెట్ ప్రింటింగ్ షాప్‌ను పెట్టాలని నిర్ణయించుకుంటాడు. దాని కోసం ఫోటోషాప్ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఉమ (వైశాలి రాజ్) ఇన్‌స్ట్రక్టర్‌గా ఉన్న కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో మనోహర్ చేరతాడు. అయితే ఉమకి కూడా ఫొటోషాప్ రాదు. ఆ ఇద్దరూ రాహుల్ (అలీ రెజా) దగ్గర ఫొటోషాప్ క్లాసులకు వెళతారు. అయితే అప్పటికే రాహుల్‌తో మనోహర్‌కి విభేదాలు ఉన్నాయి. ఆ విభేదాలు ఏంటి? పని చేయని ప్రింటింగ్ మెషీన్‌తో మనోహర్ ఏం చేశాడు? చివరి అతని లైఫ్ ఎలా టర్న్ అయింది? వంటి వాటికి సమాధానమే ఈ సినిమా.