Turbo: ముందుగానే ఓటీటీలోకి వ‌చ్చేసిన.. మ‌మ్ముట్టి లేటెస్ట్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌

ABN, Publish Date - Aug 08 , 2024 | 08:34 PM

రెండు నెల‌ల క్రితం థియేట‌ర్ల‌లో విడుద‌లై విజ‌యం సాధించిన యాక్ష‌న్ చిత్రం ట‌ర్బో ఓ రోజు ముందుగానే డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది. మ‌మ్ముట్టి హీరోగా న‌టించ‌గా మ‌న తెలుగు క‌మెడియ‌న్ సునీల్, క‌న్న‌డ న‌టుడు రాజ్ బీ షెట్టి కీల‌క పాత్ర‌ల్లో న‌టించడం విశేషం.

turbo

రెండు నెల‌ల క్రితం థియేట‌ర్ల‌లో విడుద‌లై విజ‌యం సాధించిన మ‌ల‌యాళ యాక్ష‌న్ చిత్రం ట‌ర్బో (Turbo) ఓ రోజు ముందుగానే డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది. మ‌మ్ముట్టి (Mammootty) హీరోగా న‌టించ‌డంతో పాటు నిర్మాత‌గాను వ్య‌వ‌హ‌రించిన ఈ సినిమాకు వైశాక్ (Vysakh) ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మే23న ప్రేక్ష‌కుల ముందుకు పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీలో మ‌న తెలుగు క‌మెడియ‌న్ సునీల్ (Sunil), క‌న్న‌డ న‌టుడు రాజ్ బీ షెట్టి (Raj B. Shetty) కీల‌క పాత్ర‌ల్లో న‌టించడం విశేషం.

క‌థ విష‌యానికి వ‌స్తే.. ట‌ర్బో జోష్ ఊర్లో ఖాళీగా ఉంటూ త‌గాదాల్లో త‌ల‌దూరుస్తూ గొడ‌వ‌లు ప‌డుతూ, కొట్లాడుతుంటాడు. ఈ క్ర‌మంలో ఓ రోజు అనుకోకుండా జ‌రిగిన‌ ఇష్యూతో చెన్నైకి వెళ్లాల్సి వ‌స్తుంది. మ‌రోవైపు ట‌ర్బో జోష్ బెస్ట్‌ ఫ్రెండ్ జెర్రీ చెన్నైలో ఓ బ్యాంక్‌లో ప‌ని చేస్తుంటాడు. అయితే ఆ బ్యాంక్‌లో క్లోజ్ అయిన ఓ అకౌంట్‌లో త‌న‌ పాస్‌వ‌ర్డ్ ఉప‌యోగించి కోట్ల‌లో న‌గ‌దు లావాదేవీలు జ‌ర‌గ‌డం గ‌మ‌నించి షాక‌వుతాడు. త‌ర్వాత‌ ఎవ‌రు ఈ ప‌ని చేస్తున్నారో తెలుసుకుని తీవ్ర స‌మ‌స్య‌ల్లో చిక్కుకుంటాడు.


అదే స‌మ‌యంలో ట‌ర్బో జోష్ ఈ విష‌యం తెలుసుకుని మిత్రునికి మ‌ద్ద‌తుగా రంగంలోకి దిగుతాడు. ఈ నేప‌థ్యంలో ట‌ర్బో ఈ ఇష్యూను ప‌రిష్క‌రించాడా లేదా అనే క‌థ‌క‌థ‌నాల‌తో కామెడీతో సాగుతూ ఆక‌ట్టుకుంటుంది. ఇప్పుడు ఈ మూవీ సోనీ లివ్ ఓటీటీలో మ‌ల‌యాళంతో పాటు తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ భాష‌ల్లోనూ అందుబాటులోకి వ‌చ్చింది. చూసే వారికి రెగ్యుల‌ర్ క‌మెర్షియ‌ల్ సినిమాలానే అనిపించినా ఎక్క‌డా బోర్ కొట్ట‌కుండా చివ‌రి వ‌ర‌కు సింపుల్‌గా న‌డిచిపోతుంది. అంజ‌నా జ‌య ప్ర‌కాశ్ (Anjana Jayaprakash) ఈ మూవీలో క‌థానాయిక‌గా న‌టించింది.

Updated Date - Aug 08 , 2024 | 08:34 PM