Kala Ratri Movie OTT: ఓటీటీలో.. తెలుగులో మలయాళ స్లాషర్ థ్రిల్లర్!
ABN, Publish Date - Aug 19 , 2024 | 07:01 AM
ప్రేక్షకులను అలరించేందుకు ఓ డిఫరెంట్ హర్రర్ తరహా చిత్రం ఓటీటీకి వచ్చేసింది. గత సంవత్సరం మలయాళంలో విడుదలైన నల్ల నిలవుల్ల రాత్రి అనే చిత్రాన్ని తెలుగులో స్ట్రీమింగ్‌కు తీసుకువచ్చారు.
ప్రేక్షకులను అలరించేందుకు ఓ డిఫరెంట్ హర్రర్ తరహా చిత్రం ఓటీటీకి వచ్చేసింది. గత సంవత్సరం మలయాళంలో విడుదలై మంచి విజయం సాధించిన నల్ల నిలవుల్ల రాత్రి (Nalla Nilavulla Rathri) అనే చిత్రాన్ని తెలుగులోకి అనువాదం చేసి తాజాగా డిజిటల్ స్ట్రీమింగ్‌కు తీసుకువచ్చారు. ఒక్కటంటే ఒక్క లేడీ క్యారెక్టర్ సరిగ్గా లేకుండా రూపొందిన ఈ చిత్రంతో మర్ఫీ దేవసి (Murphy Devasy) దర్శకుడిగా పరిచయం అయ్యారు. చెంబన్ వినోద్ జోస్ (Chemban Vinod Jose), బాబూరాజ్ (Baburaj), బిను పప్పు (Binu Pappu), జిను జోసెఫ్ (Jinu Joseph), గణపతి ఎస్. పొదువల్ (Ganapathi S. Poduval), రోనీ డేవిడ్ రాజ్(Rony David Raj), సజిన్ చెరుకైల్ (Sajin Cherukayil) ప్రధాన పాత్రల్లో నటించారు.
కథ విషయానికి వస్తే కేరళలోని కంతళూరు అనే విలేజ్‌లో డామ్నిక్, జోషి, పీటర్ ,రాజీవన్ అనే నలుగురు మిత్రులు కలిసి ఆర్గానిక్ వ్యవసాయం చేస్తూ సమీపంలోని అచయన్‌కు విక్రయిస్తూ ఉంటారు. అయితే సరైన లాభాలు రావడం లేదు ఇంకా లాభాలు కావాలనే కోణంలో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే అదే సమయంలో అబుదాబి నుంచి వచ్చిన తమ చిన్ననాటి మిత్రుడు కురియన్ వీరిని అనుకోకుండా కలుస్తాడు. ఓ సందర్భంలో కర్ణాటక షిమోగలో ఓ పెద్ద పంట భూమి అమ్మకానికి ఉంది అది కొని అక్కడ భారీ స్థాయిలో వ్యవసాయం చేయండని సలహా ఇస్తాడు. ఈ సలహా నలుగురిలో ఇద్దరికి మాత్రమే నచ్చగా డామ్నిక్ మిగతా ఇద్దరిని ఒప్పిస్తాడు.
ఆపై ఈ నలుగురు కురియన్‌తో కలిసి షిమోగలోని ఆ ప్రాంతాన్ని చూడడానికి వెళతారు. షిమోగాలోనే ఉండే మరో మిత్రుడు ఇరుంబన్ వీరితో కలుస్తాడు. ఆ రాత్రి వారంతా అక్కడి గెస్ట్ హౌస్‌లో ఉండి మందు తాగుతూ, పేకాట అడుతూ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే మధ్యలో బయటకు వచ్చిన రాజీవన్ కాసేపటికి హత్య చేయబడి కనిపిస్తాడు దీంతో అక్కడి వారంతా షాకవుతారు. ఆ వెంటనే వీరికి సాయంగా వచ్చిన కురియన్ మనిషి పౌల్ కూడా చనిపోయి కనిపిస్తాడు.
అయితే వీరిని చంపుతున్నదెవరు, అక్కడి నుంచి వారు సురక్షితంగా బయట పడగలిగారా లేదా అనే ఆసక్తి కరమైన కథకథనాలతో సినిమా సాగుతుంది. ఇప్పుడీ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఎక్కడ ఎలాంటి అసభ్య సన్నివేశాలు లేవు కానీ మూవీ చివరలో వచ్చే ఓకటి రెండు హత్యా సన్నివేశాలు డిస్ట్రబ్ చేస్తాయి. మంచి థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారు ఈ సినిమాను చూసేయవచ్చు.