Aindham Vedham: మక్కల్ సెల్వన్ వదిలిన ‘మర్మదేశం’ దర్శకుడి వెబ్ సిరీస్ ట్రైలర్

ABN, Publish Date - Oct 18 , 2024 | 01:45 PM

‘మర్మదేశం’ దర్శకుడు ఎల్. నాగరాజన్ దర్శకత్వంలో జీ5 ఒరిజినల్ వెబ్ సిరీస్‌గా రాబోతున్న ‘ఐందం వేదం’ ట్రైలర్‌ను.. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఎలా ఉందంటే..

Aindham Vedham Poster

అభిరామి మీడియా వర్క్స్ బ్యానర్‌పై అభిరామి రామనాథన్, నల్లమై రామనాథన్ నిర్మించిన ‘ఐందం వేదం’ (Aindhaam Vedham) ఒరిజినల్ వెబ్ సిరీస్‌ను ‘మర్మదేశం’ ఫేమ్ ఎల్. నాగరాజన్ తెరకెక్కించారు. ఈ మూవీలో సాయి ధన్సిక, సంతోష్ ప్రతాప్, వివేక్ రాజగోపాల్, వై.జి. మహేంద్రన్, క్రిషా కురుప్, రాంజీ, దేవదర్శిని, మాథ్యూ వర్గీస్, పొన్వన్నన్ వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. ఈ సిరీస్ జీ5 ద్వారా ఆడియెన్స్ ముందుకు అక్టోబర్ 25న రాబోతోంది. ఈ క్రమంలో రిలీజ్ చేసిన టీజర్ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Makkal Selvan Vijay Sethupathi) చేతుల మీదుగా విడుదల చేశారు.

Also Read- Ani Master: జానీ నిరపరాధి అని తేలితే ఏం చేస్తారు..

ట్రైలర్ విషయానికి వస్తే.. ‘వెయ్యేళ్లకు ఒకసారి గురుడు, శుక్రుడు, శని, కుజుడు ఈ నాలుగు గ్రహాలు సూర్యుడ్ని చూసే విధంగా ఒకే వరుసలో ఉంటాయట.. అలా జరిగినప్పుడు అద్భుతం జరుగుతుందని చరిత్ర చెబుతుంది’, ‘నాలుగు వేదాలు ఉన్నాయి.. ఐదో వేదం ఇప్పుడు బయటకు రాబోతోంది’ అంటూ సాగిన ఈ ట్రైలర్‌లో ఎన్నో అంతు చిక్కని రహస్యాలను చూపించబోతోన్నట్టుగా తెలుస్తోంది. మర్డర్, మిస్టరీ, థ్రిల్లర్, సోషియో ఫాంటసీ ఇలా అన్నింటిని కలిపి నాగ ఈ ‘ఐందం వేదం’ను అద్భుతంగా తెరకెక్కించినట్టుగా కనిపిస్తోంది. ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంది. (Aindhaam Vedham Trailer Released)

Also Read- Jai Hanuman: జై హనుమాన్‌లో హనుమంతుడు ఎవరంటే.. పాన్ ఇండియన్ స్టార్


ట్రైలర్‌‌లో చూపించిన విజువల్స్, ఇచ్చిన ఆర్ఆర్, భయపెట్టేలా చేసిన కెమెరా వర్క్, యాక్షన్ సీక్వెన్స్ ఇవన్నీ కూడా హైలెట్ అవుతున్నాయి. ‘ఐందం వేదం’ జీ5 ఆడియెన్స్‌ను ఆకట్టుకునేందుకు ఓటీటీలోకి అక్టోబర్ 25న రాబోతోంది. అందరికీ తెలిసిన నాలుగు వేదాలు కాకుండా.. ఐదో వేదాన్ని జీ5 అందరికీ చూపించబోతోండటం ఆసక్తికరంగా ఉంది. ఈ వెబ్ సిరీస్ తెలుగు, తమిళ్ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

Also Read- Allu Arjun: యూపీ నుంచి సైకిల్‌పై.. ఫ్యాన్స్ ఎమోషనో.. పర్సనల్ ప్రమోషనో..

Also Read- Music Directors: టాలీవుడ్‌లో తమిళ కంపోజర్‌ల హవా..

Also Read- Ram Charan: నిండైన మనసుతో పాపకు ప్రాణం పోశాడు


-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 18 , 2024 | 01:45 PM