Guntur Kaaram: అఫీషియల్‌గా ‘గుంటూరు కారం’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్.. విశేషమేమిటంటే?
ABN, Publish Date - Feb 04 , 2024 | 11:23 AM
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీగా రూపుదిద్దుకున్న చిత్రం ‘గుంటూరు కారం’. సంక్రాంతి స్పెషల్‌గా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. ఇప్పుడు అందరి ఇళ్లలోకి వచ్చేస్తోంది. అవును.. ‘గుంటూరు కారం’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 9 నుండి స్ట్రీమింగ్‌కి సిద్ధం చేస్తున్నట్లుగా నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఓ పోస్టర్ విడుదల చేసింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీగా రూపుదిద్దుకున్న చిత్రం ‘గుంటూరు కారం’ (Guntur Kaaram). సంక్రాంతి స్పెషల్‌గా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. మొదటి రోజు కాస్త నెగిటివ్ ప్రచారానికి గురైనప్పటికీ.. రెండో రోజు నుండి అనూహ్యంగా పుంజుకుని.. అద్భుతమైన కలెక్షన్స్‌ను రాబట్టింది. రమణగాడుగా మహేష్ బాబు నటనకు జనాలు నీరాజనాలు పలికారు. ఒక్క నటనే కాకుండా.. డ్యాన్స్‌తో కూడా మహేష్ బాబు ఇందులో మెప్పించారు. ఇప్పుడీ సినిమా అందరి ఇళ్లలోకి వచ్చేస్తోంది. అవును.. ‘గుంటూరు కారం’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 9 నుండి స్ట్రీమింగ్ కాబోతుందని తెలుపుతూ.. సదరు ఓటీటీ సంస్థ పోస్టర్‌ను విడుదల చేసింది. విశేషం ఏమిటంటే.. ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది. (#GunturKaaramonNetflix)
వాస్తవానికి ఇదే డేట్.. కొన్ని రోజులుగా సోషల్ మాధ్యమాలలో వినిపిస్తూనే ఉంది కానీ.. అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. తాజాగా ఆ ప్రకటన కూడా వచ్చేసింది కాబట్టి.. రమణగాడు చేసే ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఇక ఇంట్లోనే.. ఫ్యామిలీతో కూర్చుని ఆస్వాదించవచ్చు. ఈ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ (చిన్నబాబు) నిర్మించారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, జయరామ్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు. ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. (Guntur Kaaram OTT Streaming Date)
‘గుంటూరు కారం’ కథ (Guntur Kaaram Story) విషయానికి వస్తే.. వెంకటస్వామి (ప్రకాష్ రాజ్) ఒక రాజకీయ నాయకుడు, అతని కుమార్తె వసుంధర (రమ్యకృష్ణ) కూడా రాజకీయాల్లోకి వచ్చి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుంది. వసుంధరకి మొదట సత్యం (జయరామ్)తో వివాహం అవుతుంది. వసుంధర, సత్యంలకి పుట్టిన కుమారుడు రమణ (మహేష్ బాబు). కానీ వూర్లో గొడవలు రావటం అందులో ఆమె భర్త ఉండటంతో.. భర్తని, కొడుకుని గుంటూరులో వదిలేసి హైదరాబాదులో వున్న తన తండ్రి దగ్గరికి వసుంధర వచ్చేస్తుంది. అక్కడే రెండో సారి నారాయణ(రావు రమేష్)ని పెళ్లి చేసుకుంటుంది, వాళ్ళకి రాజగోపాల్ (రాహుల్ రవీంద్రన్) అనే కుమారుడు ఉంటాడు. వెంకటస్వామి తన నిజమైన వారసుడు రాజగోపాల్ అని చెప్పుకుంటూ అతన్ని కూడా ఎన్నికల్లో పోటీ చేయించడానికి సమాయత్తం అవుతూ ఉంటాడు. అయితే మొదటి వారసుడు రమణని హైదరాబాదు పిలిపించుకొని తనకి ఆస్తి అవసరం లేదు అని, వసుంధరకి తనకి సంబంధం లేదని దస్తావేజు కాయితాల మీద సంతకం పెట్టమని చెబుతూ ఉంటాడు. వెంకటస్వామి వకీలు పాణి (మురళి శర్మ).. రమణతో ఎలా అయినా సంతకం పెట్టిస్తాను అని చెప్పి తన కూతురు అమ్ములు (శ్రీలీల)ని గుంటూరు పంపిస్తాడు. అమ్ములు, బాలు (వెన్నెల కిషోర్)తో గుంటూరు వెళుతుంది, కానీ ఆమె రమణతో ప్రేమలో పడుతుంది. ఇంతకీ రమణ సంతకం పెట్టాడా? రమణకి తల్లి వసుంధర అంటే ఎందుకు కోపం? వెంకటస్వామి తన రాజకీయ భవిష్యత్తు కోసం ఎటువంటి రాజకీయ ఎత్తులు వేశాడు? చివరికి ఏమైంది అనే ప్రశ్నలకు సమాధానమే ‘గుంటూరు కారం’ సినిమా కథ.
ఇవి కూడా చదవండి:
====================
*Teja Sajja: మహేశ్ బాబుని ‘మగేశ్’ అనేవాడిని.. అప్పుడాయన ఏమనేవారంటే..
*************************
*Chiranjeevi: పద్మవిభూషణుడికి ఉపాసన అభినందన సభ.. హాజరైన తెలంగాణ సీఎం
*****************************
*Love Guru: శోభనం రోజు.. భర్త ఎదురుగానే భార్య ఏం చేస్తుందో చూశారా!
**************************
*Natti Kumar: గద్దర్ పేరుతో అవార్డ్స్ ఇవ్వడం సినిమా వారికి ఇష్టం లేదా?
**********************