Lucky Bhaskar: లక్కీ భాస్కర్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు.. ఎక్కడంటే..

ABN, Publish Date - Nov 25 , 2024 | 01:02 PM

దుల్కర్‌ సల్మాన్‌,  మీనాక్షి చౌదరి జంటగా నటించిన ‘లక్కీ భాస్కర్‌’. ఇప్పుడీ సినిమా ఓటీటీలో విడుదల కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ తాజాగా పోస్ట్‌ పెట్టింది


దుల్కర్‌ సల్మాన్‌(Dulquer Salman),  మీనాక్షి చౌదరి (Meenakshi Chowdary)జంటగా నటించిన చిత్రం ‘లక్కీ భాస్కర్‌’ (Lucky Bhaskar). వెంకీ అట్లూరి దర్శకుడు. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రం దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చి బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఇప్పుడీ సినిమా ఓటీటీలో విడుదల కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ (Netflix ott) తాజాగా పోస్ట్‌ పెట్టింది. నవంబర్‌ 28 నుంచి ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా అందుబాటులో ఉందని తెలిపారు. 

కథ:
1990ల సమయం అది. భాస్కర్‌ కుమార్‌.. ముంబై మగధ బ్యాంక్‌లో క్యాషియర్‌గా ఉద్యోగం చేస్తుంటాడు. మఽధ్యతరగతి కుటుంబం, చాలిచాలని జీతంతో కుటుంబాన్ని నెట్టుకొస్తుంటాడు. వస్తుందనుకున్న ప్రమోషన్‌ చేజారడంతో రూపాయి పెడితే రెండు రూపాయలు వచ్చే మార్గాలను ఎంచుకుంటాడు. తదుపరి అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌గా ప్రమోట్‌ అవుతాడు. మగధ బ్యాంక్‌లో ఆ జరిగిన స్కామ్‌ విచారణలో భాగంగా భాస్కర్‌ వ్యక్తిగత బ్యాంక్‌ అకౌంట్‌ చూసి అధికారులు షాక్‌ అవుతారు. నెలకు రూ. 19,500 జీతం తీసుకునే ఉద్యోగి అకౌంట్‌లో రూ.వంద కోట్లు వుంటాయి. అవి ఎలా వచ్చాయి. మగధ బ్యాంక్‌లో జరిగిన స్కామ్‌ ఏంటి? ఈ స్కామ్‌కి హర్ష్‌ మెహ్రాకి ఉన్న సంబంధం ఏంటి? చివరికి స్కామ్‌ నుంచి భాస్కర్‌ గట్టెక్కాడా? అన్నది కథ.

Updated Date - Nov 25 , 2024 | 01:17 PM