మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Vidya Vasula Aham: ఎవ‌రెస్ట్ అంత అహంతో వ‌స్తున్న..‘కోట‌ బొమ్మాళి’ ప్రేమ‌ జంట‌

ABN, Publish Date - May 06 , 2024 | 05:59 PM

కోట‌బొమ్మాళి వంటి సూప‌ర్ హిట్ చిత్రం త‌ర్వాత రాహుల్ విజ‌య్, శివానీ రాజ‌శేఖ‌ర్ జంట‌గా న‌టించిన చిత్రం ‘విద్య వాసుల అహం’ త్వ‌ర‌లో డిజిట‌ల్ స్ట్రీమింగ్ రెడీ అయింది.

vidya vasula

కోట‌బొమ్మాళి ( Kotabommali PS) వంటి సూప‌ర్ హిట్ చిత్రం త‌ర్వాత రాహుల్ విజ‌య్ (Rahul Vijay), శివానీ రాజ‌శేఖ‌ర్ (Shivani Rajashekar) జంట‌గా న‌టించిన చిత్రం ‘విద్య వాసుల అహం’ (Vidya Vasula Aham). మణికాంత్ గెల్లి (Manikanth Gelli) దర్శకత్వం వ‌హించిన ఈ సినిమాను ఎటర్నిటీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో నవ్య మహేష్, ఏం రంజిత్ కుమార్ కొడాలి, చందనా కట్టా నిర్మించారు.

తాజాగా ఈ సినిమా రిలీజ్ పోస్ట‌ర్‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా రిలీజ్ చేశారు. ఆ ప్ర‌చార చిత్రాన్ని చూస్తే రాహుల్ విజయ్ వాసుగా, శివాని రాజా శేఖర్ విద్య పాత్రలో భార్య భర్తలుగా న‌టిస్తున్న‌ట్లు అర్థ‌మ‌వుతోంది. అంతేగాక ట్యాగ్ లైన్ ‘లాంగ్ లాంగ్ ఈగో స్టోరీ‘ అని ఉండ‌డంతో సినిమా కొత్తగా పెళ్లైన జంట ఈగో నేప‌థ్యంలో తెర‌కెక్కించిన‌ట్లు స్ప‌ష్టంగా తెలుస్తోంది.


అయితే తెలుగులో ఈ త‌ర‌హా సినిమాలు ఇప్పటికే చాలా వచ్చినప్పటికీ ఈ చిత్రం అందుకు భిన్నంగా ఉంటుంద‌ని మేక‌ర్స్ ఈ పోస్ట‌ర్‌తో చెప్ప‌క‌నే చెప్పారు. ఎవరెస్టు శిఖరంలో సగం.. ఈ 'విద్య, వాసుల' అహం.. అంటూ భార్య భర్తలు ఇద్దరి మ‌ధ్య‌ వచ్చే ఈగోలతో టిట్ ఫర్ టాట్‌గా ఒక‌రితో ఒక‌రు ఎలా పోటీ ప‌డ్డారో త్వ‌ర‌లో ఓటీటీలో చూడండి అంటూ ప్ర‌ముఖ డిజిట‌ల్ ప్లాట్‌ఫాం ఆహా త‌న ఎక్స్ అకౌంట్‌లో పోస్టు చేసింది.

ఇదిలాఉండ‌గా ఇందులో హీరోగా చేసిన రాహుల్ విజ‌య్ (Rahul Vijay) ఇంత‌కుముందు శివానీ రాజ‌శేఖ‌ర్ (Shivani Rajashekar) తో కోట బొమ్మాళి సినిమాలో న‌టించ‌గా ఇప్పుడు విద్య వాసుల అహం రెండో చిత్రం. అదేవిధంగా రాహుల్ విజ‌య్ అంతక‌ముందు శివాని సిస్ట‌ర్ శివాత్మిక (Shivathmika Rajashekar)తో పంచ‌తంత్రం (Panchathantram) అనే సినిమాలో న‌టించ‌డం గ‌మ‌నార్హం.

Updated Date - May 06 , 2024 | 06:01 PM