A Taxi Driver: ఓటీటీలోకి అస్సలు మిస్సవకూడని రియల్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా.. ఎప్పటి నుంచంటే
ABN, Publish Date - Feb 16 , 2024 | 03:23 PM
ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి ఓ ఇంట్రెస్టింగ్ చిత్రం సిద్ధమవుతోంది. ఎప్పటిలా వచ్చే క్రైమ్, థ్రిల్లర్, హర్రర్, యాక్షన్ జానర్ కాకుండా దానికి భిన్నమైన హిస్టారికల్ యాక్షన్ డ్రామా బ్యాక్‌డ్రాప్ కొరియన్ సినిమా స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది.
ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి ఓ ఇంట్రెస్టింగ్ చిత్రం సిద్ధమవుతోంది. అయితే ఈ సారి ఎప్పటిలా వచ్చే క్రైమ్, థ్రిల్లర్, హర్రర్, యాక్షన్ జానర్ కాకుండా దానికి భిన్నమైన హిస్టారికల్ యాక్షన్ డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన కొరియన్ సినిమా ఏ ట్యాక్సీ డ్రైవర్ (A Taxi Driver). 2017లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అక్కడ ఆ ఏడాది సెకండ్ హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలవిడమే గాక.. ఇప్పటికీ కొరియాలో అత్యధిక వసూళ్లు రాబట్టిన 13వ చిత్రంగా రికార్డు ఈ చిత్రంపైనే ఉండడం విశేషం. సాంగ్ కాంగ్-హో (Song Kang-ho), థామస్ క్రెట్‌ష్‌మాన్ (Thomas Kretschmann), యూ హే (Yoo Hae-jin) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు జాంగ్ హూన్ (Jang Hoon) దర్శకత్వం వహించారు.
1980లలో కొరియా దేశాన్నే ఓ కుదుపు కుదిపేసిన ‘గ్వాంగ్జు’ అనే స్వాతంత్య్ర తిరుగుబాటు ఉద్యమం నేపథ్యంలో నిజంగా జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని కళ్లకు కట్టినట్లుగా తెరకెక్కించారు. 1980 మే లో కొరియా రాజధాని సియోల్‌లో అప్పటి ప్రభుత్వ నియంతృత్వానికి వ్యతిరేకంగా అప్పటి కళాశాలల విద్యార్థులు పెద్ద ఉద్యమాన్ని ప్రారంభించారు. అయితే ఇది అసలు సహించని నియంత ‘చున్ దూ-హ్వాన్’ మిలటరీని దింపి హత్యాకాండ గావించి సుమారు రెండు వేలకు పైగా విద్యార్థులను చంపించేశాడు. ఇప్పటికీ ఈ తిరుగుబాటు, హత్యాకాండలు గుర్తుకు వస్తే చాలు అక్కడ భయపడే వారు చాలా మంది ఉన్నారు.
అయితే ఇప్పుడు ఈ కథే ఇతివృత్తంగా తీసుకుని ఏ ట్యాక్సీ డ్రైవర్ (A Taxi Driver) అనే సినిమాను రూపొందించారు. కథ విషయానికి వస్తే.. బాగా అప్పులలో కూరుకుపోయిన కిమ్ మాన్-సోబ్ (Kim Man-seob) ఓ సాధారణ ట్యాక్సీ డ్రైవర్ ‘గ్వాంగ్జు’లో అసలు ఏం జరుగుతుందో ఏ మాత్రం తెలియకుండానే డబ్బులు ఎక్కువగా వస్తాయని ఓ జర్మన్ జర్నలిస్టు జుర్గెన్ హింజ్‌పీటర్ (Jürgen Peter Hinzpeter) ను ఆ ప్రాంతానికి తీసుకెళ్లేందుకు ఒప్పుకుంటాడు. ఈక్రమంలో ఆదిలోనే వారిని మిలిటరీ ఆపగా బిజినెస్ మాన్ అని చెప్పి లోపలికి ప్రవేశిస్తారు. ఇక అక్కడి నుంచి వారికి ఎదురైన ప్రమాదాలు, అక్కడ ఇబ్బందుల్లో ఉన్న వారిని రక్షించేందుకు వారు చేసే పనులు చాలా ఎమోషనల్‌గా సాగుతూ మనల్ని సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడతాయి.
ముఖ్యంగా జర్నలిస్టు సహా పలువురు తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చేరడంతో, అప్పటి నుంచి గ్వాంగ్జులో ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియజేసే బాధ్యత హీరోపై పడుతుంది. ఈ క్రమంలోనే నియంత ఆదేశాలతో ‘గ్వాంగ్జు’లో విద్యార్థులపై హాత్యాకాండ ప్రారంభమవుతుంది. వీటన్నింటిని హీరో కెమెరాతో చిత్రీకరించ గలిగాడా, అక్కడి నుంచి ఏ విధంగా బయట పడ్డాడు, తన కుటుంబాన్ని కలుసుకోగలిగాడా అనేవి ఆసక్తికరంగా హృదయానికి హత్తుకునేలా తెరకెక్కించారు.
ఇదిలాఉండగా సినిమా విడుదలైన 7 సంవత్సరాల తర్వాత ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఫిబ్రవరి 23 నుంచి అమెజాన్ ప్రైమ్ (PrimeVideo)లో స్ట్రీమింగ్ కానుంది. కాగా ఈ సినిమాలో మనకు కనిపించే ట్యాక్సీ డ్రైవర్, జర్నలిస్టు ఇతర పాత్రలు కూడా నిజంగా జరిగినవే కావడం గమనార్హం.