Raghu Thatha: ఓటీటీలో.. కీర్తి సురేశ్ చిత్రం సంచ‌ల‌నం

ABN, Publish Date - Sep 16 , 2024 | 06:42 PM

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో గ‌త నెల‌లో థియేట‌ర్ల‌లో విడుద‌లై మంచి స్పంద‌న‌ను తెచ్చుకుని ఇటీవ‌ల ఓటీటీలోకి వ‌చ్చిన ‘రఘు తాత’ చిత్రం అద్భుత‌మైన స్పంద‌న‌ను తెచ్చుకుని రికార్డులు సృష్టిస్తోంది.

Raghu Thatha

కీర్తి సురేష్ (Keerthy Suresh) ప్రధాన పాత్రలో నటించ‌గా.. గ‌త నెల‌లో థియేట‌ర్ల‌లో విడుద‌లై మంచి స్పంద‌న‌ను తెచ్చుకుని ఇటీవ‌ల ఓటీటీలోకి వ‌చ్చిన ‘రఘు తాత’ (Raghu Thatha) చిత్రం అద్భుత‌మైన స్పంద‌న‌ను తెచ్చుకుని రికార్డులు సృష్టిస్తోంది. హోంబళే ఫిల్మ్స్ (Hombale Films) బ్యానర్ మీద విజయ్ కిరగందూర్ (Vijay Kiragandur) నిర్మించిన ఈ చిత్రానికి సుమన్ కుమార్ (Suman Kumar) దర్శకత్వం వహించారు. రవీంద్ర విజ‌య్ (Ravindra Vijay), ఎమ్మెస్ భాస్కర్ (M. S. Bhaskar), స‌మి, దేవ‌ద‌ర్శిణి (Devadarshini) ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించారు.

వైవిధ్య‌మైన పాత్ర‌లు, క‌థాంశంతో రూపొందిన ‘రఘు తాత’ చిత్రం ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. సినిమా స్టార్టింగ్ నుంచే మంచి ఫీల్ గుడ్‌గా న‌డుస్తూ చూసే ప్రేక్ష‌కుల‌ను సినిమాలోకి తీసుకెళుతుంది. న‌మ్మిన దాని కోసం నిల‌బ‌డే స్వ‌తంత్య్ర భావాలున్న అమ్మాయి పాత్ర‌లో కీర్తి సురేష్ న‌ట‌న ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఫ్యామిలీ ఆడియెన్స్ అంద‌రూ క‌లిసి చూసే ఎమోష‌న‌ల్ మూవీగా అల‌రిస్తోంది. ప్ర‌స్తుతం ఈ మూవీ జీ5 (ZEE5)లో త‌మిళంతో పాటు తెలుగు, కన్నడ భాషల్లో అందుబాటులో ఉండగా ఈ సినిమా విడుద‌లైన 24 గంట‌ల్లోనే ఈ చిత్రానికి 50 మిలియ‌న్ స్ట్రీమింగ్ వ్యూస్ ద‌క్కించుకుని సంచ‌ల‌నం సృష్టిస్తోంది.

Updated Date - Sep 16 , 2024 | 06:42 PM