Raghu Thatha OTT: ఓటీటీ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసిన.. కీర్తి సురేశ్ లేటెస్ట్ ఫ్యామిలీ బ్లాక్‌బ‌స్ట‌ర్‌

ABN, Publish Date - Sep 13 , 2024 | 10:06 AM

ఇటీవల తమిళనాడులో విడుదలై మిమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు సైతం పొందిన పొలిటిక‌ల్‌ కామెడీ డ్రామా, కుటుంబ‌మంతా హాయిగా క‌లిసి చూసే చిత్రం రఘు తాత ఓటీటీ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది.

raghu thatha

ఇటీవల తమిళనాడులో విడుదలై మంచి స్పంద‌న‌తో పాటు మిమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందిన పొలిటిక‌ల్‌ కామెడీ డ్రామా చిత్రం రఘు తాత (Raghu Thatha) ఓటీటీ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది. మహానటి కీర్తి సురేష్ (Keerthy Suresh) ప్రధాన పాత్రలో నటించ‌గా ‘కేజీఎఫ్‌’, ‘కాంతార’, ‘సలార్‌’ వంటి పాన్‌ ఇండియా చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ (Hombale Films) ఈ సినిమాను నిర్మించింది.. ది ఫ్యామిలీ మ్యాన్‌’, ‘ఫర్జీ’ వంటి బాలీవుడ్‌హిట్‌ వెబ్‌ సిరీస్‌లకు కథా రచయితగా పని చేసిన సుమన్‌ కుమార్‌ (Suman Kumar) దర్శకత్వం వ‌హించాడు. రవీంద్ర విజ‌య్ (Ravindra Vijay), ఎమ్మెస్ భాస్కర్ (M. S. Bhaskar), స‌మి, దేవ‌ద‌ర్శిణి (Devadarshini) ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు.

క‌థ విష‌యానికి వ‌స్తే.. 1970 నేప‌థ్యంలో నాడు హిందీ భాషను మహిళలపై బలవంతంగా రుద్దడంపై సెటైరిక్ పంచులు వేస్తూ కామెడీ టచ్‌తో ఈ సినిమాను రూపొందించారు. కాయ‌ల్ పాండియ‌న్ ఓ బ్యాంక్‌లో క్ల‌ర్క్‌గా ప‌ని చేస్తూ ఉంటుంది. అయితే ఆమెకు ప‌దోన్న‌తి వ‌చ్చే క్ర‌మంలో హిందీ భాష త‌ప్ప‌నిస‌రిగా వ‌చ్చి ఉండాలని స‌ద‌రు బ్యాంకు ష‌ర‌తు పెడుతుంది. దీంతో అప్ప‌టికే బాగా ఫెమినిస్ట్ , రెబ‌ల్ ల‌క్ష‌ణాలు ఉన్న కాయ‌ల్ ఆ ష‌ర‌తును వ్య‌తిరేకిస్తుంది. అదే స‌మ‌యంలో ఆమె లైఫ్‌లోకి సెల్వ‌న్ అనే ఇంజినీర్ రాగా త‌న జీవితం మ‌లుపు తిరుగుతుంది. సెల్వ‌న్‌ను త్వ‌ర‌గా పెళ్లి చేసుకోవాల‌ని చూస్తుంది. ఈ నేప‌థ్యంలో కాయ‌ల్ తిరిగి హిందీని ఎందుకు నేర్చుకోవాల‌నుకుంది, చివ‌ర‌కు నేర్చుకుందా లేదా, అస‌లు సెల్వ‌న్ ఎవ‌ర‌నే ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌క‌థ‌నాతో సినిమా సాగుతుంది.


సినిమా స్టార్టింగ్ నుంచే మంచి ఫీల్ గుడ్‌గా న‌డుస్తూ చూసే ప్రేక్ష‌కుల‌ను సినిమాలోకి తీసుకెళుతుంది. ఎక్క‌డా బోర్ కొట్ట‌కుండా మంచి సెటైరిక్ డైలాగులు, కీర్తి సురేశ్‌, ర‌వీంద్ర విజయ్ న‌ట‌న ఆక‌ట్టుకుంటాయి. దేవ ద‌ర్శిణి కామెడీ సినిమాకు హైలెట్. 1970 కాలంలో నాటి గ్రామాలు, ప్ర‌జ‌ల తీరుతెన్నులను, సమాజంలో స్త్రీలు ఎదుర్కొనే సమస్యలతో పాటు వారికి విధించే ఆంక్షలను, సంస్కృతీ సంప్రదాయాలకు సంబంధించిన చిన్నచిన్న విషయాలను కూడా సెటైరికల్‌గా చూపించారు. ఇప్పుడీ చిత్రం సెప్టెంబర్ 13 ఈ రోజు (శుక్ర‌వారం)నుంచి జీ5 (ZEE5)లో స్ట్రీమింగ్ అవుతోంది. త‌మిళంతో పాటు తెలుగు, కన్నడ భాషల్లో అందుబాటులో ఉండనుంది. ఇంటిల్లి పాది అంతా క‌లిసి ఈ రఘు తాత (Raghu Thatha) సినిమాను హాయిగా చూసి ఆస్వాదించొచ్చు. డోంట్ మిస్‌.

Updated Date - Sep 13 , 2024 | 10:06 AM