Antony: ఓటీటీలోకి తెలుగులో వచ్చేస్తున్న.. మలయాళ వయలెంట్ యాక్షన్ డ్రామా
ABN, Publish Date - Feb 20 , 2024 | 04:22 PM
ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి మరో ఆసక్తికరమైన మలయాళ వయలెంట్ యాక్షన్ డ్రామా చిత్రం అంటోని రెడీ అయింది.
ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి మరో ఆసక్తికరమైన మళయాళ వయలెంట్ యాక్షన్ డ్రామా చిత్రం అంటోని (Antony) రెడీ అయింది. ఇటీవల వైష్ణవ్ తేజ్ ఆదికేశవలో ప్రతినియకుడిగా నటించిన జోజు జార్జ్ (Joju George), కళ్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan) మెయిన్ లీడ్స్‌గా చెంబన్ వినోద్ జోస్ (Chemban Vinod Jose), నైలా ఉష (Nyla Usha) కీలక పాత్రల్లో నటించారు. జేక్స్ బెజాయ్ (Jakes Bejoy) సంగీతం అందించారు. ఈ సినిమా డిసెంబర్ 1న విడుదలై కేరళలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇటీవల తెలుగులో నాగార్జున హీరోగా వచ్చిన నా సామిరంగా సినిమాకు మాతృక అయిన పొరింజు మరియం జోస్ (Porinju Mariam Jose) అనే మలయాళ చిత్రాన్ని తెరకెక్కించిన జోషి (Joshiy) ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా ఒక్క కళ్యాణి ప్రియదర్శన్, ఒకరిద్దరు మినహా ఆ సినిమాలోని నటులే ఈ చిత్రంలోనూ నటించడం విశేషం.
కథ విషయానికి వస్తే.. ఆంటోనీ ఆంత్రాపర్ (Antony) అనే ఓ ఒక క్రూరమైన గ్యాంగ్‌స్టర్ ప్రమాదవశాత్తు జేవియర్ అనే స్థానిక గూండాని చంపేస్తాడు. అయితే అనుకోకుండా జేవియర్ కూతురు మారియాకు ఆంటోనీ గార్డియన్‌గా మారి ఆమె బాగోగులు చూసుకోవాల్సి వస్తుంది. దీంతో గొడవలు, వివాదాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటాడు. అయితే అప్పటికే కాలేజీలో చదువుతూ MMAలో శిక్షణ పొందిన మారియా బాగా దూకుడు స్వభావంతో ఉంటూ కళాశాల గొడవల్లోనూ తల దూర్చుతూ ఉంటుంది. అంటోనిని ద్వేషిస్తూ ఉంటుంది.
అయితే.. అదే సమయంలో చాలా కాలంగా సమయం కోసం చూస్తున్న టార్జాన్ అనే ఓ పాత శత్రువు ఆంటోనీ, మారియాలను చంపడానికి ఒకటి రెండు సార్లు ప్రయత్నాలు చేసి విఫలమవుతాడు. దీంతో ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకన్న ఆంటోనీ, మారియాలు తమ శత్రువును ఎలా ఎదుర్కొన్నారు, అంటోని (Antony) మంచి తనాన్ని మరియా గుర్తించిందా అనే ఆసక్తికరమైన కథకథనాలతో ఔట్ అండ్ ఔట్ ఫుల్ యాక్షన్ సన్నివేశాలతో రూపొందించారు. ఇప్పటికే ఈ సినిమా మలయాళ వర్షన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుండగా ఇప్పుడు తెలుగు వర్షన్ సినిమాను డిజిటల్ స్ట్రీమింగ్‌కు తీసుకు వస్తున్నారు. ఫిబ్రవరి 23 నుంచి ఆహా (aha videoin)లో స్ట్రీమింగ్ చేయనున్నారు.