Dogman: ఇది చాలా డిఫరెంట్ థ్రిల్లర్ గురూ.. తెలుగులోనూ! ఏ ఓటీటీలో ఉందంటే
ABN, Publish Date - Aug 12 , 2024 | 10:54 AM
ఇటీవల డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చిన ఓ హాలీవుడ్ చిత్రం ప్రేక్షకులను తెగ ఆకర్షిస్తోంది. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో థ్రిల్లర్ డ్రామాగా వచ్చిన ఈ మూవీ సినీ లవర్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఇటీవల డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చిన ఓ హాలీవుడ్ చిత్రం ప్రేక్షకులను తెగ ఆకర్షిస్తోంది. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో థ్రిల్లర్ డ్రామాగా వచ్చిన ఈ మూవీ సినీ లవర్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆ మూవీనే డాగ్‌మ్యాన్ (Dogman). కాలేబ్ లాండ్రీ జోన్స్ (Caleb Landry Jones) లీడ్ రోల్‌లో జీవించగా జోజో T. గిబ్స్ (Jojo T. Gibbs), క్రిస్టోఫర్ డెన్హామ్ (Christopher Denham), గ్రేస్ పాల్మా (Grace Palma) ప్రధాన పాత్రలు పోషించారు. లూక్ బెస్సన్ (Luc Besson) స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు దర్శకత్వం వహించాడు.
కథ విషయానికి వస్తే.. చిన్నతనంలోనే సైకో అయిన తండ్రి వళ్ల బాగా బాధించబడి రెండు కాళ్లు పొగొట్టుకున్న డగ్లస్ అనే బాలుడు తర్వాత జీవితంలో ఎలా సర్వైవ్ అయ్యాడనే హృద్యమైన కథతో సినిమా నడుస్తుంది. కుక్కల బోనులో పెరిగిన డగ్లస్‌కు ఆ డాగ్స్ ఏ విధంగా అండగా ఉన్నాయి, వాటిని డగ్లస్ ఎలా ఉపయోగించుకున్నాడు, హిజ్రాగా ఎందుకు మారాడు, కుక్కలు అతనితో చివరి వరకు ఉన్నాయా లేవా అనే ఇంట్రెస్టింగ్ స్టోరీతో సినిమా సాగుతుంది. జీవితంలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా బతుకుబండిని ఎలా సాగించాలి అనే మంచి మెసేజ్ కూడా ఇస్తుంది.
అయితే.. చెప్పడానికి స్టోరీ లైన్ చిన్నదైనా కథనం నడిపించిన విధానం బావుంది. ఎక్కడా బోర్ కొట్టకుండా, ఆసక్తి తగ్గకుండా హీరో నేపథ్యంలో సినిమాను అద్యంతం ఆకట్టుకునేలా తెరకెక్కించారు. యాక్షన్ రెండు మాత్రమే ఉన్నప్పటికీ ప్రేక్షకులను సర్‌ఫ్రైజ్ చేస్తాయి. అన్నింటికన్నా ముఖ్యంగా డగ్లస్‌గా చేసిన హీరో కాలేబ్ లాండ్రీ జోన్స్ (Caleb Landry Jones) చేసిన యాక్టింగ్ అందరికీ నచ్చేయడం గ్యారెంటీ. కొన్ని సన్నివేశాలలో జోకర్ ఫేం జోక్విన్ ఫీనిక్స్ (Joaquin Phoenix)ను మైమరిపించాడంటే అతడు ఏ ఏంజ్‌లో నటించాడో అర్థం చేసుకోవచ్చు.
ఇప్పుడు ఈ సినిమా బుక్ మూ షో స్ట్రీమ్ (BookMyShow Stream), అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లలో రెంట్ పద్దతిలో స్ట్రీమింగ్ అవుతుండగా, కొన్ని ఫ్రీ వెబ్ సైట్లలోనూ తెలుగు బాషలోనూ అందుబాటులో ఉంది. సినిమాలో ఎక్కడా అశ్లీలత, అసభ్యత, వల్గారిటీ సన్నివేశాలు లేనందున ఈ సినిమాను ఇంటిల్లిపాది కలిసి హాయిగా చూసేయవచ్చు. సో సినీ లవర్స్ మీకు కాస్త డిఫరెంట్ మూవీ కావాలంటే ఈ డాగ్‌మ్యాన్ (Dogman) సినిమాను ట్రై చేయండి మంచి ఫీల్ ఇవ్వడం గ్యారెంటీ.