Immaculate: ఓటీటీలో.. సిడ్నీ స్వినీ లేటెస్ట్ థ్రిల్లర్! తెలుగులోనూ స్ట్రీమింగ్! ఎందులో అంటే
ABN, Publish Date - Sep 08 , 2024 | 04:17 PM
హాలీవుడ్ సినిమాలను ఇష్టపడే వారి కోసం సస్పెన్స్ , హర్రర్ థ్రిల్లర్ ఇమ్మక్యూలేట్ అనే చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. కేవలం 9 మిలియన్ డాలర్లతో తెరకెక్కిన ఈ సినిమా 277 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లను రాబట్టి సూపర్ హిట్‌గా నిలిచింది.
హాలీవుడ్ సినిమాలను ఇష్టపడే వారి కోసం ఓ లేటెస్ట్ సస్పెన్స్ , హర్రర్ థ్రిల్లర్ ఇమ్మక్యూలేట్ (Immaculate) అనే చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. కేవలం 9 మిలియన్ డాలర్లతో తెరకెక్కిన ఈ సినిమా 277 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లను రాబట్టి సూపర్ హిట్‌గా నిలిచింది. మార్చిలో అమెరికా, కొన్నిసెలక్టెడ్ కంట్రీస్‌లలో విడుదలైన ఈ సినిమా జూలైలో మన దేశంలో రిలీజైంది. సుమారు రెండు నెలల తర్వాత ఇప్పుడు ఓటీటీకి వచ్చింది.
గంట 28 నిమిషాల నిడివితో ఉన్న ఈ హరర్ర్ చిత్రంలో ప్రధాన ఆకర్శణ కథానాయిక సిడ్నీ స్వినీ (Sydney Sweeney) కాగా, ఫేమస్ మనీహిస్ట్ (Money Heist) సిరీస్ ప్రోఫెసర్ అల్వారో మోర్టే (Álvaro Morte), బెనెడెట్టా పోర్కరోలి (Benedetta Porcaroli), డోరా రొమానో (Dora Romano), జార్జియో కొలంజెలి (Giorgio Colangeli)సిమోనా టబాస్కో (Simona Tabasco) వంటి నటులు ప్రధాన పాత్రల్లో నటించారు. మైఖెల్ మోహన్ ( Michael Mohan) దర్శకత్వం వహించారు.
కథా నేపథ్యం విషయానికి వస్తే.. సిసిలియా అనే యువతి మిచిగాన్ సిటీ నుంచి ఇటలీ వెళ్లి ఫాదర్ సాల్ టెడెస్చి అధ్వర్యంలోని ఓ చర్చిలో నన్‌గా మారుతుంది. అక్కడ ఉంటున్న వృద్ధ నన్స్‌కు సేవలు చేస్తూ తలో నాలుకలా ఉంటుంది. ఈ క్రమంలోనే సిసిలియాకు ఆ చర్చిలోప్రతి రోజూ వింత అనుభవాలు, విచిత్ర ఘటనలు ఎదురవడం స్టార్ట్ అవుతాయి. కొన్ని ఆకారాలు చంపడానికి ప్రయత్నం చేస్తుంటాయి, భయానక కలలు వస్తుంటాయి. ఎవరెవరో వచ్చి ఇక్కడి నుంచి పారిపో అంటూ సలహాలు ఇస్తూ ఉంటారు.
అయితే అనుకోకుండా ఓ రోజు సిసిలియా గర్భవతి అయినట్టు తెలుసుకుని షాక్ అవుతుంది. ఎలాంటి ఫిజికల్ రిలేషన్ లేకుండా ప్రెగ్నెంట్ కావడంతో ఈమె మరో మేరిమాత జీసస్ మరోమారు పుట్ట బోతున్నాడంటూ అక్కడి వారంతా సిసిలియాను జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ బయటకు అంతా ఓ విధంగా కనిపిస్తున్నా అంతర్గంతంగా ఏదో జరుగుతుందని ఆ రహస్యాన్ని తెలుసుకోవాలని సిసిలియా ప్రయత్నాలు చేస్తుంది. ఈక్రమంలో ఆమె కొన్ని విషయాలు తెలుసుకుంటుంది. ఆపై అక్కడి నుంచి పారిపోవాలని ప్రయత్నించి విఫలమై మళ్లీ అదే చర్చికి వస్తుంది.
ఇంతకు సిసిలియా ఆ చర్చికే ఎందుకు, ఎలా వచ్చింది, చర్చిలో జరిగిన ఘటనలేంటి, అక్కడి రహస్యాలు తెలుసుకున్నాక ఏం చేసింది, అక్కడినుంచి బయట పడగలిగిందా లేదా, అక్కడి నన్స్ అమెను ఎందుకు చంపాలని చూశారు, ఆ ఫాదర్ ఎవరు, అసలు సిసిలియాకు తెలియకుండా గర్భం ఎలా వచ్చిందనే ఆసక్తికర కథ కథనాలతో సినిమా సాగుతూ ప్రేక్షకులకు మంచి థ్రిల్‌ను ఇస్తుంది. ఇప్పుడు ఈ సినిమా బుక్ మై షో స్ట్రీమ్ (Bms Stream) ఓటీటీలో ఇంగ్లీష్‌తో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
అయితే పేరుకు ఇది హర్రర్ సినిమా అయినా ఒకటి రెండు సీన్లలో తప్పితే ఎక్కడా భయపెట్టే సందర్భాలు ఉండవు. కాకపోతే ఎక్కడా బోర్ కొట్టకుండా చివరి వరకు సస్పెన్స్‌ను నడిపించగలిగారు. క్లైమాక్స్‌లోచ్చే ట్విస్టులు, సిడ్నీ స్వీనీ యాక్టింగ్ బాగా ఆకట్టుకుంటాయి. అయితే సినిమాలో కథా పరంగా ఒకటి రెండు సన్నివేశాల్లో స్నానం సన్నివేశాలు తప్పితే మిగతా సినిమాను ఫ్యామిలీతో కలిసి ఇమ్మక్యూలేట్ (Immaculate) మూవీని చూసేయవచ్చు. ఇక మనందరికి బాగా పరిచమం ఉన్న మనీ హాస్ట్ ఫేం ఫ్రోఫెసర్ అల్వారో మోర్టే ఈ సినిమాలో ఫాదర్ సాల్ టెడెస్చిగా అలరిస్తాడు.