OTT: తన భార్యకు తనలానే ఉండే బాయ్ ఫ్రెండ్ ఉంటే.. ఓటీటీలోకి సందేహమా..

ABN, Publish Date - Dec 01 , 2024 | 03:01 PM

తన భార్యకు సేమ్ టు సేమ్ తనలానే ఉండే బాయ్ ఫ్రెండ్ ఉంటే, అతను సేమ్ అపార్ట్‌మెంట్‌లో ఉంటే.. ఆ భర్తకు సందేహం రాకుండా ఉంటుందా? వచ్చింది. మరి ఆ తర్వాత ఏం జరిగింది.. తెలియాలంటే..

Sandeham Movie Still

హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో సుమన్ వూట్కూరు హీరోగా నటించిన లవ్ అండ్ ఎంగేజ్ థ్రిల్లర్ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ఓటీటీ ప్రేక్షకులను ఈ సినిమా బాగా ఆకర్షిస్తోంది. సందేహంగా ఉందా.. అస్సలు సందేహ పడాల్సిన అవసరం లేదు. ఇంతకీ సినిమా పేరు ఏంటని అనుకుంటున్నారా? ‘సందేహం’. ‘ఊరికి ఉత్తరాన’ సినిమా ఫేమ్ సతీష్ పరమవేద ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. విష్ణు వర్షిణి క్రియేషన్స్ బ్యానర్‌పై సత్యనారాయణ పర్చా నిర్మించారు. థియేటర్లలో మంచి స్పందనను రాబట్టుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఈటీవీ విన్‌ ఓటీటీలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది.

Also Read-Pushpa 2 The Rule: ‘పుష్ప 2’.. ‘దేవర’లా కాదు కదా..

ఓటీటీలోనూ ‘సందేహం’ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తున్నట్లుగా మేకర్స్ చెబుతున్నారు. హెబ్బా పటేల్ నటనకు ఆడియెన్స్ ఫిదా అవుతుండటంతో.. ఈ వారం రిలీజ్ అయిన చిత్రాల్లోకెల్లా ‘సందేహం’ అందరినీ ఆకట్టుకుని ఓటీటీలో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాలో శ్వేతా వర్మ, రాశిక శెట్టి, శుభ శ్రీ రాయగురు, శ్రీనివాస్ భోగిరెడ్డి, సుందర్ రావు పర్చా, చంద్రశేఖర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాలో ఉన్న అన్ని పాత్రలకు తగిన ప్రాధాన్యం ఉండటం విశేషం. ఈ మూవీకి ప్రవీణ్ వనమాలి సినిమాటోగ్రఫీ, వెంకట ప్రభు ఎడిటింగ్ మేజర్ అట్రాక్షన్‌గా నిలిచాయి. సుభాష్ ఆనంద్ సంగీతం అందించారు.


‘సందేహం’ కథ విషయానికి వస్తే.. హర్ష (సుమన్ తేజ్) ప్రేమించిన అమ్మాయి శృతి(హెబ్బా పటేల్)ని ప్లాన్ చేసి అరేంజ్డ్ మ్యారేజ్‌లా చేసుకుంటాడు. ఫస్ట్ నైట్ రోజు, ఆ తర్వాత కూడా శృతి కొంచెం టైం కావాలంటుంది. అదే టైమ్‌లో సేమ్ టు సేమ్ హర్ష లాగే ఉండే ఆర్య (సుమన్ తేజ్) వాళ్ల అపార్ట్‌మెంట్‌లోకి వస్తాడు. హర్ష, శృతిలతో పరిచయం పెంచుకుని అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఆర్యతో శృతి ఉండే విధానాన్ని తట్టుకోలేక పోయిన హర్ష వాళ్లిద్దరి మధ్య ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఓ ప్లాన్ చేస్తాడు. ఆ తర్వాత కరోనాతోనే హర్ష చనిపోయినట్లుగా.. ఫ్యామిలీ డాక్టర్ శృతికి చెప్తాడు. హర్ష చనిపోయాడని అంతా అనుకుంటున్న సమయంలో.. ఒక రోజు హర్ష ఫోన్ నుంచి హర్ష చెల్లికి మిస్డ్ కాల్ వస్తుంది. దీంతో హర్ష చెల్లి ఆరా తీయడం మొదలుపెడుతుంది. అసలు హర్ష చనిపోయాడా? బతికే ఉన్నాడా? మరి ఆర్య ఏమయ్యాడు? హర్ష చెల్లికి కాల్ చేసింది ఎవరు? హెబ్బాను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తారు? వంటి సందేహాలు తీరాలంటే ఈటీవీ విన్‌లో ఉన్న ఈ సినిమా చూడాల్సిందే.

Also Read-Raashii Khanna: పుట్టినరోజున రాశీఖన్నా ఏం చేసిందంటే..

Also Read-Rashmika Mandanna: దేనికైనా ఓ హద్దుంటుంది.. మితిమీరితే ఊరుకోను

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Dec 01 , 2024 | 03:01 PM