Viswam OTT: చడీ చప్పుడు లేకుండా.. సడెన్‌గా ఓటీటీకి వచ్చేసిన గోపీచంద్ ‘విశ్వం’! ఎందులో అంటే
ABN, Publish Date - Nov 01 , 2024 | 07:06 AM
మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ సూపర్ హిట్ చిత్రం విశ్వం ఉన్నఫలంగా ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసి అశ్చర్య పరిచింది.
మాచో స్టార్ గోపీచంద్ (Gopichand), దర్శకుడు శ్రీను వైట్ల (Srinu vaitla) ఫస్ట్ కొలాబరేషన్ లో తెరకెక్కించిన మోస్ట్ యాంటిసిపేటెడ్ చిత్రం 'విశ్వంస. సడన్‌గా చడీ చప్పుడు లేకుండా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. కావ్యా థాపర్ హీరోయిన్ గా నటించింది. ఈ హై బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌పై టిజి విశ్వప్రసాద్ నిర్మించగా దోనేపూడి చక్రపాణి ఈ చిత్రాన్ని సమర్పించారు. గత నెల ఆక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుని మంచి విజయం సాధించింది.
కథ విషయానికి వస్తే..
పాకిస్థాన్ నుంచి ఇండియాకు వచ్చి ఐఎస్‌ఐఎస్ టెర్రరిస్ట్ జలాలుద్దీన్ ఖురేషి (జిషు సేన్‌గుప్తా). ఇక్కడ సంజయ్ శర్మ అనే మారుపేరుతో ఇండియాలో ఉంటూ విద్యా వ్యవస్థ నడుపుతూ విద్యార్థుల్ని తీవ్రవాదులుగా తయారు చేస్తుంటాడు. భారత్‌ను నాశానం చేయాలనేది అతని ఆలోచన. దీనికోసం కేంద్రమంత్రి సీతారామరాజు (సుమన్) తమ్ముడైన బాచిరాజు (సునీల్)తో చేతులు కలుపుతాడు. ఆ విషయం మంత్రికి తెలియడంతో అతన్ని జలాలుద్దీన్ చంపేస్తాడు . ఈ హత్యను దర్శన అనే పాప చూడడంతో ఆ గ్యాంగ్ పాపను చంపడం కోసం తిరుగుతూ ఉంటుంది. ఒకసారి ఆ పాపను రక్షించిన గోపిరెడ్డి పాపకు తీవ్ర అపాయం ఉందని గ్రహించి ఆమెకు రక్షణగా ఉండాలనుకుంటాడు. అసలు హీరో గోపీచంద్.. ఆ పాపను కాపాడటానికి కారణం ఏంటి? అతని నేపథ్యం ఏంటి? సమైరా (కావ్య థాపర్)తో అతని ప్రేమకథ ఏమైంది? జలాలుద్దీన్ కశ్మీర్ వెళ్లి పన్నిన కుట్రలకు గోపీచంద్ ఎలా తిప్పికొట్టాడు. అసలు గోపీచంద్‌కు, కశ్మీర్‌లో ఉగ్రవాద సంస్థలకు సంబంధం ఏంటి? అన్నది మిగతా కథ. (Vishwam Movie OTT)
టెర్రరిస్ట్‌ల వల్ల దేశానికి థ్రెట్ ఏర్పడటం, వారి ప్రణాళికలు హీరో తిప్పి కొట్టడం, అందుకోసం తన ఐడెంటిటీని పక్కన పెట్టి మారు వేషంలో సీక్రెట్ మిషన్ చేయడం తరహాలో ఇప్పటికే చాలా చిన్న చిత్రాలు వచ్చాయి. ఈ సినిమా కూడా అదే మాదిరిగా రూపొందించినప్పటికీ శ్రీను వైట్ల మార్క్ కామెడీ ఈ సినిమాకు ప్రధాన బలం. వెన్నెల కిశోర్, సీనియర్ నరేశ్, వీటీవీ గణేశ్‌ల నేపథ్యంలో రైలులో నడిపించిన సన్నివేశాలు ఈ సినిమాకు ఆయువు పట్టు. అదేవిధంగా ఇంటర్వెల్‌కు ముందు వచ్చే ఫైటింగ్ సీక్వెన్స్ కూడా అదిరిపోతుంది. కాకపోతే సినిమా తర్వాత ఏం జరుగబోతుందే ముందే మనకు తెలిసిపోతుండడం మైనస్. ఇప్పుడీ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో మిస్సయిన వారు ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా అయితే ఈ సినిమాను ఒకటి రెండు సార్లు చూడొచ్చు.