The Greatest of All Time OTT: కొడుకే ప్రత్యర్థి అయితే.. ఓటీటీకి వచ్చేస్తున్న‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’
ABN, Publish Date - Oct 02 , 2024 | 09:34 AM
వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఇళయ దళపతి విజయ్ హీరోగా డ్యూయెల్ రోల్‌లో నటించిన చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ సుమారు నెల తర్వాత ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది.
ఇళయ దళపతి విజయ్ (Vijay) హీరోగా డ్యూయెల్ రోల్‌లో నటించిన చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’(The Greatest of All Time). వెంకట్ ప్రభు (Venkat prabhu) దర్శకత్వం వహించిన ఈ మూవీ సెప్టెంబర్ 5న థియేటర్లలోకి వచ్చి మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. సుమారు నెల తర్వాత ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. విజయ్ రాజకీయ రంగ ప్రవేశానికి ముందు, చివరి చిత్రం అంటూ తెగ హైప్ తెచ్చుకున్న ఈ మూవీ తమిళనాట పర్వాలేదనిపించినా తెలుగు ప్రేక్షకులను మత్రం తీవ్రంగా నిరాశ పర్చింది. మీనాక్షి చౌదరి, స్నేహా, ప్రశాంత్, లైలా, వైభవ్, యోగిబాబు, అజ్మల్ వంటి అగ్ర నటులు కీలక పాత్రల్లో నటించారు. యువన్ శంకర్‌రాజా సంగీతం అందించారు.
యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ బృందంలో పని చేసే గాంధీ ఓ మిషన్ కోసం భార్య పిల్లలతో థాయ్‌లాండ్ వెళ్లినప్పుడు కొడుకు జీవన్ (విజయ్)ను కోల్పోతాడు. దీంతో గాంధీ డిప్రెషన్‌కు లోనై స్క్వాడ్‌ను వదిలి బయటకు వచ్చేసి భార్యకు దూరంగా ఉంటూ పాస్‌పోర్ట్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తూ ఉంటాడు. అనుకోకుండా ఓసారి మాస్కోకు వెళ్లిన గాంధీకి జీవన్ కనిపించడంతో ఇండియాకు తీసుకొచ్చి మళ్లీ ఫ్యామిలీ అంతా కలిసి ఉంటారు. ఈ క్రమంలో గాంధీతో పాటు యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ బృందంలోని వారు ఒకరొకరు హత్యకు గురౌతారు. వాటి వెనుక ఉన్నది ఎవరు? ఇంతకీ మీనన్ ఎవరు? తండ్రి జీవన్‌కు కొపం ఎందుకు? తదుపరి ఏమైందనేది మిగతా కథ. అసలు నిజాలు గాంధీ ఎలా తెలుసుకున్నాడు.. ఏం చేశాడనే కథనంతో సినిమా సాగుతుంది.
ఇప్పుడీ సినిమా అక్టోబర్ 3 (గురువారం) నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో తమిళంతో పాటు తెలగు ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ అవనుంది. దేశ రక్షణ కోసం ఎంతకైనా తెగించే ఓ ఏజెంట్ కథ ఇది. అనుకోని పరిస్థితుల్లో తన కొడుకే తన ప్రత్యర్థిగా మారడం, అనే లైన్ మీత మూవీ రన్ అవుతుంది. అయితే విలన్ క్యారెక్టర్లలో ఆ పాత్రధారులు ఇమడకపోవడం సినిమాకు మైనస్‌గా నిలిచింది. కానీ ఒకటి రెండు యాక్షన్ సీన్స్ జనాలను బాగా ఆకట్టుకుంటాయి. అయితే ఈ సినిమా Hd ప్రింట్ ఇప్పటికే కొన్ని ఫ్రీ వెబ్ సైట్లలో రావడం, సుమారు 3 గంటల నిడివి ఉండడం కాస్త ఇబ్బందికర అంశం. ఇప్పటి వరకు ఈ సినిమా చూడని వారు ఒక్కసారి మాత్రం చూడొచ్చు.