Filmfare OTT Awards 2024: ఓటీటీ అవార్డుల పండుగలో విజేతలు వీరే.. సాయిదుర్గా తేజ్
ABN, Publish Date - Dec 02 , 2024 | 03:16 PM
ఆదివారం రాత్రి ముంబైలో ఫిల్మ్‌ఫేర్ ఓటీటీ అవార్డులు ప్రకటించారు. ఈ వేడుకలో తెలుగు యాక్టర్ సాయి దుర్గతేజ్‌కి అరుదైన గౌరవం లభించింది. అలాగే ఈ ఏడాది ఓటీటీలో బెస్ట్‌గా నిలిచింది ఎవరంటే..
ప్రతియేడు ఘనంగా నిర్వహించే ఫిల్మ్‌ఫేర్ అవార్డుల వేడుకగా ఎక్స్‌టెన్షన్‌గా ఫిల్మ్‌ఫేర్ ఓటీటీ అవార్డుల వేడుకను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆదివారం ఈ అవార్డుల వేడుకను దేశ వాణిజ్య రాజధాని ముంబైలో అట్టహాసంగా నిర్వహించారు. ఈ వేడుకలో దేశంలోని అన్ని ఇండస్ట్రీలలో డైరెక్ట్ ఓటీటీలో రిలీజైన సినిమాలు, సిరీస్‌లకు సంబంధించి అవార్డులు ప్రకటించారు.
అవార్డులు అందుకున్నది వీరే..
సినిమాల్లో బెస్ట్ వీరే..
బెస్ట్ మూవీ: అమర్‌సింగ్ చంకీల
బెస్ట్ డైరెక్టర్: ఇంతియాజ్ అలీ (అమర్‌సింగ్ చంకీల)
బెస్ట్ యాక్టర్: దిల్జిత్ (అమర్‌సింగ్ చంకీల)
బెస్ట్ యాక్ట్రెస్: కరీనా కపూర్ (జానే జాన్)
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్: జైదీప్ అహ్లావత్ (మహారాజ్)
బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్: వామికా గబ్బి (ఖుఫియా)
బెస్ట్ డైలాగ్ రైటర్: ఇంతియాజ్ అలీ, సాజిద్ అలీ (అమర్‌సింగ్ చంకీల)
బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే: ఇంతియాజ్ అలీ, సాజిద్ అలీ (అమర్‌సింగ్ చంకీల)
బెస్ట్ కొరియోగ్రాఫర్: సిల్వెస్టర్ ఫోన్సెకా (అమర్‌సింగ్ చంకీల)
బెస్ట్ ఎడిటింగ్: ఆర్తి బజాజ్ (అమర్‌సింగ్ చంకీల)
బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్: ఏఆర్ రెహమాన్ (అమర్‌సింగ్ చంకీల)
బెస్ట్ స్టోరీ: జోయా అక్తర్, అర్జున్ వరైన్ సింగ్ (కహో గయే హమ్ కహాన్)
బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్: ఏఆర్ రెహమాన్ (అమర్‌సింగ్ చంకీల)
బెస్ట్ డెబ్యూ డైరెక్టర్: అర్జున్ వరైన్ సింగ్ (కహో గయే హమ్ కహాన్)
బెస్ట్ డెబ్యూ హీరో: వేదాంగ్ రైనా
బెస్ట్ సిరీస్ (క్రిటిక్స్): గన్స్ అండ్ గులాబ్స్
బెస్ట్ డైరెక్టర్(క్రిటిక్స్): ముంబయి డైరీస్ సీజన్ 2
బెస్ట్ సిరీస్ యాక్టర్(క్రిటిక్స్): కే కే మీనన్ (బొంబాయి మేరీ జాన్)
బెస్ట్ సిరీస్ యాక్ట్రెస్ (క్రిటిక్స్): హ్యుమా ఖురేషి (మహారాణి సీజన్ 3)
బెస్ట్ మూవీ (క్రిటిక్స్): జానే జాన్
బెస్ట్ యాక్టర్(క్రిటిక్స్): జైదీప్ అహ్లావత్
బెస్ట్ యాక్ట్రెస్ (క్రిటిక్స్): అనన్య పాండే
వెబ్ సిరీస్‌లలో బెస్ట్ వీరే..
బెస్ట్ సిరీస్: ది రైల్వే మెన్
బెస్ట్ డైరెక్టర్: సమీర్ సక్సెనా, అమిత్ గోలానీ (కాలా పాని)
బెస్ట్ యాక్టర్(కామెడీ): రాజ్‌కుమార్ రావు (గన్స్ అండ్ గులాబ్స్)
బెస్ట్ యాక్టర్(డ్రామా): గగన్ దేవ్ రియార్ (స్కామ్ 2003: ది తెల్గీ స్టోరీ)
బెస్ట్ సిరీస్ యాక్ట్రెస్ (కామెడీ): గీతాంజలి కులకర్ణి (గులక్ సీజన్ 4)
బెస్ట్ యాక్ట్రెస్ (డ్రామా): మనీషా కొయిరాలా (హీరామండి: ది డైమంఢ్ బజార్)
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్(కామెడీ): ఫైజల్ మాలిక్ (పంచాయత్ సీజన్ 3)
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్(డ్రామా): మాధవన్ (ది రైల్వే మెన్)
బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ (కామెడీ): నిధి (మామ్లా లీగల్ హై)
బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ (డ్రామా): మోనా సింగ్ (మెడ్ ఇన్ హెవెన్ సీజన్ 2)
బెస్ట్ ఒరిజినల్ స్టోరీ: బిశ్వపతి సర్కార్ (కాలాపానీ)
బెస్ట్ కామెడీ: మామ్లా లీగల్ హై
బెస్ట్ నాన్-ఫిక్షన్ ఒరిజినల్: ది హంట్ ఫర్ వీరప్పన్
బెస్ట్ డైలాగ్స్: సుమిత్ అరోరా (గన్స్ అండ్ గులాబ్స్)
బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే: ఎజె నిడిమోరు, కృష్ణ డీకే, సుమన్‌కుమార్ (గన్స్ అండ్ గులాబ్స్)
బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే: కిరణ్ యాద్నోపవిత్, కేదార్ పాటంకర్, కరణ్ వ్యాస్ (స్కామ్ 2003: ది తెల్గీ స్టోరీ)
బెస్ట్ కొరియోగ్రాఫర్: హున్త్సంగ్ మోహపాత్ర, రాహుల్ హెరియన్ ధరమన్ (హీరామండి: ది డైమండ్ బజార్)
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్: సుబ్రత చక్రవర్తి, అమిత్ రాయ్ (హీరామండి: ది డైమండ్ బజార్)
బెస్ట్ ఎడిటింగ్: యషా జైదేవ్ రాంచందానీ (ది రైల్వే మెన్)
బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్: రింపుల్, హర్‌ప్రీత్ నరులా, చంద్రకాంత్ సోనావానే (హీరామండి: ది డైమండ్ బజార్)
బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్: సామ్ స్లాటర్ (ది రైల్వే మెన్)
బెస్ట్ ఒరిజినల్ సౌండ్‌ట్రాక్: సంజయ్ లీలా భన్సాలీ, రాజా హసన్ (హీరామండి: ది డైమండ్ బజార్)
బెస్ట్ వీఎఫ్‌ఎక్స్: ఫిల్మ్‌గేట్ ఏబీ, హైవే స్టూడియోస్ (ది రైల్వే మెన్)
బెస్ట్ సౌండ్ డిజైన్: సంజయ్ మౌర్య (కాలాపానీ)
బెస్ట్ డెబ్యూ డైరెక్టర్: శివ రావైల్ (ది రైల్వే మెన్)
ఇక పీపుల్స్ ఛాయిస్ బెస్ట్ షార్ట్ ఫిల్మ్ అవార్డుకి గాను తెలుగు హీరో సాయిదుర్గా తేజ్, స్వాతి నటించిన ‘సత్య’ ఎంపికయ్యింది.