OTT Plus: చిన్న బడ్జెట్‌ చిత్రాల కోసం ప్రత్యేక ఓటీటీ ఫ్లాట్‌ఫాం

ABN , Publish Date - May 05 , 2024 | 09:40 PM

తమిళ చిత్రపరిశ్రమలో చిన్న బడ్జెట్‌తో రూపుదిద్దుకునే మంచి చిత్రాలకు వరప్రసాదంగా ఓటీటీ ప్లస్‌ పేరుతో ఓటీటీ ఫ్లాట్‌ఫాం అందుబాటులోకి వచ్చింది. కోలీవుడ్‌లో ప్రతి యేటా సుమారుగా 200 వరకు చిత్రాలు నిర్మాణమవుతున్నాయి. అయితే, వీటిలో అనేక చిన్న బడ్జెట్‌ చిత్రాలు విడుదలకు నోచుకోవడం లేదు. వీటికి పరిష్కారమార్గంగా చిన్న బడ్జెట్‌ చిత్రాల కోసమే ఈ ఓటీటీ ప్లస్‌ ఫ్లాట్‌ఫాం రూపొందించారు.

OTT Plus: చిన్న బడ్జెట్‌ చిత్రాల కోసం ప్రత్యేక ఓటీటీ ఫ్లాట్‌ఫాం
OTT Plus Launch Event

తమిళ చిత్రపరిశ్రమలో (Kollywood) చిన్న బడ్జెట్‌తో రూపుదిద్దుకునే మంచి చిత్రాలకు వరప్రసాదంగా ఓటీటీ ప్లస్‌ (OTT Plus) పేరుతో ఓటీటీ ఫ్లాట్‌ఫాం అందుబాటులోకి వచ్చింది. కోలీవుడ్‌లో ప్రతి యేటా సుమారుగా 200 వరకు చిత్రాలు నిర్మాణమవుతున్నాయి. అయితే, వీటిలో అనేక చిన్న బడ్జెట్‌ చిత్రాలు విడుదలకు నోచుకోవడం లేదు. ఒక వేళ విడుదలైనప్పటికీ రెండు మూడు రోజులకు మించి ప్రదర్శించడం లేదు. దీంతో మంచి కథలతో రూపొందే అనేక చిత్రాలు ప్రేక్షకులకు అందుబాటులోకి రాకుండానే పోతున్నాయి. వీటికి పరిష్కారమార్గంగా చిన్న బడ్జెట్‌ చిత్రాల కోసమే ఈ ఓటీటీ ప్లస్‌ ఫ్లాట్‌ఫాం రూపొందించారు.

*Santhanam: అనుష్క సరసన నేను హీరోగా.. అంత ఈజీ కాదు


seenuramaswamy.jpg

ఎంఆర్‌ శ్రీనివాసన్‌, సుధాకర్‌, కేబుల్‌ శంకర్‌ కలిసి ఈ ఫ్లాట్‌ఫాం స్థాపించారు. దీని ప్రారంభోత్సవ కార్యక్రమం తాజాగా చెన్నై నగరంలో జరిగింది. ప్రముఖ దర్శకుడు శీను రామస్వామి (Director Seenuramasamy) పాల్గొని ఈ ఓటీటీ ప్లస్‌ ఫ్లాట్‌ఫాంను ప్రారంభించారు. భవిష్యత్‌లో నిర్మితమయ్యే చిన్న చిత్రాలకు ఈ ఓటీటీ ఫ్లాట్‌ఫాం ఒక మంచి వరప్రసాదంగా ఉంటుందని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ ఫ్లాట్‌ఫాం నెలవారీ సబ్‌స్ర్కిప్షన్‌ రూ.99 కాగా, వార్షిక చందాగా రూ.299 నిర్ణయించారు. ఇందులో కీరా దర్శకత్వం వహించిన ‘వీమన్‌’ స్ట్రీమింగ్‌ అవుతుంది. అలాగే, ‘బికినీ సమయల్‌’ అనే గ్లామర్‌ షో కూడా త్వరలోనే టెలికాస్ట్‌ కానుంది.

Read Latest Cinema News

Updated Date - May 05 , 2024 | 09:40 PM