Ott: ఓటీటీలోకి కొరియన్ ‘జాన్ విక్’.. అడ్డొచ్చిన వాళ్లని వేసేయడమే
ABN , Publish Date - May 05 , 2024 | 05:30 PM
డబ్బింగ్ సినిమా లవర్స్‌ను అలరించడానికి ఒక దాని తర్వాత ఒకటి సినిమా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఒక ఫ్లాట్ ఫాం కాకుంటే మరో ఫ్లాట్ ఫాంలో చిత్రాలు విడుదలవుతూ ప్రేక్షకులకు మంచి థ్రిల్‌ను అందిస్తున్నాయి. తాజాగా ఓ కొరియన్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
డబ్బింగ్ సినిమా లవర్స్‌ను అలరించడానికి ఒక దాని తర్వాత ఒకటి సినిమా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఒక ఫ్లాట్ ఫాం కాకుంటే మరో ఫ్లాట్ ఫాంలో చిత్రాలు విడుదలవుతూ ప్రేక్షకులకు మంచి థ్రిల్‌ను అందిస్తున్నాయి. తాజాగా ఓ కొరియన్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. అయితే ఈ సినిమా విడుదలైన రెండేండ్ల తర్వాత ఓటీటీలోకి రాగా కొరియన్ సినిమాలు ఎక్కువగా వచ్చే ఓటీటీ ఫ్లాట్‌ఫాంలు అమెజాన్, నెట్‌ఫ్లిక్స్‌లలోకి కాకుండా మనం అసలు ఉహించని మరో ప్లాట్‌ఫాంలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుండడం విశేషం.
2022లో విడుదలైన కొరియన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ది కిల్లర్ (ఏ గర్ల్ ఊ డిసర్వ్స్ టూ డై) The Killer: A Girl Who Deserves to Die. జాంగ్ హ్యూక్ (Jang Hyuk) కథానాయకుడిగా నటించిన ఈ సినిమాకు చోయ్ జే-హూన్ (Choi Jae-hoon) దర్వకత్వం వహించారు. ఇదిలాఉండగా ఇందులోని యాక్షన్ సన్నివేశాల దృష్ట్యా ఈ సినిమా కొరియన్ జాన్ వీక్ అనే పేరు తెచ్చుకోవడం గమనార్హం. ప్రస్తుతం ఈ సినిమా సోని లివ్ (Sony LIV) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా తెలుగు భాషలోనూ అందుబాటులో ఉంది.
కథ విషయానికి వస్తే.. కాంట్రాక్ట్ కిల్లర్ అయిన జాంగ్ హ్యూక్ తన వృత్తికి రిటైర్మెంట్ ప్రకటించి తన భార్య హైయోన్-సూతో కలిసి ప్రశాంతంగా జీవిస్తుంటాడు. ఓ రోజు హ్యూక్ భార్య హైయోన్-సూ తన బెస్ట్ ఫ్రెండ్‌తో విహారయాత్రకు వెళుతూ తన ఫ్రెండ్ కూతురు కిమ్ యూన్-జీని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి వెళ్లిపోతుంది.
ఈ క్రమంలో ఆ అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. దీంతో జాంగ్ హ్యూక్ అమెను వెతికేందుకు రంగంలోకి దిగుతాడు. ఈ నేపథ్యంలో కిడ్నాప్ చేసిందెవరు, ఎందుకు చేశారు.. చివరకు ఏమైందనే పాయుంట్‌తో సాగుతూసినిమా ఆద్యంతం యాక్షన్ ప్రియులను ఆకట్టుకుంటుంది. జాన్ వీక్ సినిమాలో మాదిరే ఇందులోనూ హీరో కనిపించిన వాడిని కనిపించినట్టు వేసేసుకుంటూ వెళ్లడం గమనార్హం.