Dhee 17 Grand Finale: ‘ఢీ 17’ గ్రాండ్ ఫినాలే.. గెస్ట్ ఎవరంటే..?

ABN , Publish Date - May 29 , 2024 | 04:48 PM

తెలుగు బుల్లితెరపై ‘ఢీ’ షో క్రియేట్ చేసిన సంచలనాలు అందరికీ తెలిసిందే. డ్యాన్సింగ్ షోల్లో ‘ఢీ’కి ఉండే ప్రత్యేక స్థానం గురించి చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం ‘ఢీ’లో 17వ సీజన్ నడుస్తోంది. ఈ సీజన్ ప్రస్తుతం ఫినాలేకు చేరుకుంది. ఈ ‘ఢీ 17’ గ్రాండ్ ఫినాలే‌కు సంబంధించి ఓ ప్రోమో కూడా విడుదలైంది. ఈ ప్రోమోలో గెస్ట్ ఎవరో రివీల్ చేశారు.

Dhee 17 Grand Finale: ‘ఢీ 17’ గ్రాండ్ ఫినాలే.. గెస్ట్ ఎవరంటే..?
Dhee 17 Celebrity Season Grand Finale

తెలుగు బుల్లితెరపై ‘ఢీ’ (Dhee) షో క్రియేట్ చేసిన సంచలనాలు అందరికీ తెలిసిందే. డ్యాన్సింగ్ షోల్లో ‘ఢీ’ (Dhee Show)కి ఉండే ప్రత్యేక స్థానం గురించి చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం ‘ఢీ’లో 17వ సీజన్ నడుస్తోంది. ఈ సీజన్ ప్రస్తుతం ఫినాలే (Dhee17 Season Grand Finale)కు చేరుకుంది. ఈ ‘ఢీ 17’ గ్రాండ్ ఫినాలే‌కు సంబంధించి ఓ ప్రోమో కూడా విడుదలైంది. ఈ ప్రోమోలో గెస్ట్ ఎవరో రివీల్ చేశారు. రేస్ టు గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌లో కాజల్ అగర్వాల్ సందడి చేయగా.. ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌కు సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) ముఖ్య అతిథిగా రాబోతున్నట్లుగా ఈ ప్రోమోలో రివీల్ చేశారు. ఈ ప్రోమో సందడి సందడి ఉండటమే కాకుండా.. విన్నర్‌ని అనిల్ రావిపూడి ప్రకటించినట్లుగా చూపించారు.

*Kiraak RP: అమ్మాయిలతో నగ్న పూజలు చేయిస్తున్నాడంటూ వేణు స్వామిపై కిరాక్ ఆర్పీ ఫైర్..


ముఖ్యంగా ఈ ప్రోమోలో హైపర్ ఆది, అనిల్ రావిపూడిల కామెడీ.. శేఖర్ మాస్టర్‌ (Sekhar Master)తో కలిసి మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) పాటకి అనిల్ రావిపూడి వేసిన స్టెప్పులు ప్రోమోకే హైలెట్ అయ్యాయి. ఇక అనిల్ రావిపూడి ఎంట్రీతో ఈ ఎపిసోడ్ గ్రాండియర్‌గా మారింది. ఇవే కాకుండా కంటెస్టెంట్ల అల్టిమేట్ పెర్ఫామెన్స్‌లు చూసి అనిల్ రావిపూడి షాక్ అవడమే కాకుండా.. లేచి క్లాప్స్ కొడుతుండటం ఈ ప్రోమోలో చూడవచ్చు.


D-17Grand-Finale.jpg

ఇక కంటెస్టెంట్లు కూడా స్టేజ్ దద్దరిల్లేలా వారి పెర్ఫామెన్స్‌‌లతో ఆలరించారు. ముగ్గురు కంటెస్టెంట్లు.. నువ్వా, నేనా అన్నట్లుగా పెర్ఫామ్ చేయగా.. ఫైనల్ విన్నర్ ఎవరనేది తెలియాలంటే మాత్రం.. నేడు (బుధవారం) ఈటీవీలో రాత్రి 9.30కి వచ్చే గ్రాండ్ ఫినాలే ఈవెంట్ చూడాల్సిందే. ప్రస్తుతం ఈ గ్రాండ్ ఫినాలేకు సంబంధించిన ప్రోమో సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది.

Read Latest Cinema News

Updated Date - May 29 , 2024 | 04:48 PM