Dhee 18: ‘ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2’.. జడ్జిగా వస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా? ఇదే ఫస్ట్ టైమ్..

ABN , Publish Date - Jun 03 , 2024 | 08:46 PM

తెలుగు బుల్లితెరపై తిరుగులేని డ్యాన్స్ షో‌గా దూసుకెళుతోన్న ‘ఢీ’ షో క్రియేట్ చేసిన సంచలనాలు అందరికీ తెలిసిందే. డ్యాన్సింగ్ షోల్లో ఢీకి ఉండే స్థానమే వేరు. రీసెంట్‌గా సెలబ్రిటీ స్పెషల్‌తో సీజన్ 17ను ముగించుకున్న ఈ షో.. ఇప్పుడు ‘ఢీ 18’ ‘ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2’తో సరికొత్తగా ఎంటర్‌టైన్ చేయడానికి రెడీ అవుతోంది. ‘ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2’ షో‌కు సంబంధించి ఓ స్పెషల్ ప్రోమోని తాజాగా విడుదలై వైరల్ అవుతోంది.

Dhee 18: ‘ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2’.. జడ్జిగా వస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా? ఇదే ఫస్ట్ టైమ్..
Dhee Celebrity Special 2 Launch Episode

తెలుగు బుల్లితెరపై తిరుగులేని డ్యాన్స్ షో‌గా దూసుకెళుతోన్న ‘ఢీ’ షో క్రియేట్ చేసిన సంచలనాలు అందరికీ తెలిసిందే. డ్యాన్సింగ్ షోల్లో ఢీకి ఉండే స్థానమే వేరు. రీసెంట్‌గా సెలబ్రిటీ స్పెషల్‌తో సీజన్ 17 (Dhee 17)ను ముగించుకున్న ఈ షో.. ఇప్పుడు ‘ఢీ 18’ (Dhee 18) ‘ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2’ (Dhee Celebrity Special 2)తో సరికొత్తగా ఎంటర్‌టైన్ చేయడానికి రెడీ అవుతోంది. ‘ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2’ షో‌కు సంబంధించి ఓ స్పెషల్ ప్రోమోని తాజాగా ఈటీవీ వదిలింది. ఈ షో స్పెషల్ ఏంటో కూడా ఇందులో క్లారిటీగా చెప్పడం విశేషం. అన్నింటికీ మించి.. ఈ షో‌కి ఓ ప్రముఖ హీరోయిన్ జడ్జిగా రాబోతోంది. ఇంతకుముందు ఈ షోకి ఎందరో తారలు జడ్జిగా వ్యవహరించారు. ఈ సీజన్‌కు బబ్లీ బ్యూటీ హన్సిక (Hansika).. శేఖర్ మాస్టర్ (Sekhar Master), గణేష్ మాస్టర్‌ (Ganesh Master) తో కలిసి జడ్జిగా వ్యవహరించబోతోంది. ఇక ఈ షోకి మరో స్పెషల్ ఏమిటంటే.. ఇంతకు ముందు కేవలం బుధవారం మాత్రమే ప్రసారమయ్యే ఈ షో.. ఇకపై బుధ, గురు వారాలలో, అంటే రెండు రోజులు ప్రసారం కానుండటం.

Also Read- Anjali: బాలయ్య నన్ను ఎందుకు నెట్టారో నాకు తెలుసు.. అనవసరంగా పెద్దది చేశారు


Hansika.jpg

‘ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2’ మెగా లాంచ్ ఎపిసోడ్ విశేషాలు:

  • డిజే టిల్లు సాంగ్‌తో యాంకర్ నందు ఎంట్రీ

  • శేఖర్ మాస్టర్ ‘కుర్చీ మడతపెట్టి’ పాటకు డ్యాన్స్ పెర్ఫార్మెన్స్

  • హన్సిక గ్రాండ్ ఎంట్రీ, గణేష్ మాస్టర్ ఎంట్రీ, లేడీ టీమ్ లీడర్‌గా శ్రీసత్య, బాయ్స్ టీమ్ లీడర్‌గా హైపర్ ఆది ఎంట్రీలు..

  • 10 మంది కంటెస్టెంట్స్ అదిరిపోయే పెర్ఫార్మెన్స్

  • ఒక కంటెస్టెంట్ వాళ్ల పాపకి హన్సికతో పేరు రివీల్ చేయించడం

  • మరో కంటెస్టెంట్.. ఫోక్ సింగర్‌గా తను ఫేమస్ అయిన పాటను పాడటం

  • ఇంకో కంటెస్టెంట్‌కు హీరో వరుణ్ సందేశ్ సపోర్ట్‌గా రావడం

  • గెస్ట్‌లుగా హీరో కార్తికేయ, హీరోయిన్ ఐశ్వర్య మీనన్ (భజే వాయు వేగం హీరోహీరోయిన్లు), హీరో నవదీప్

  • హైపర్ ఆదిని హన్సిక ఆట పట్టించడం

  • హీరో కార్తికేయ మెగాస్టార్ చిరంజీవి పాటకు డ్యాన్స్ చేయడం

  • కంటెస్టెంట్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తే.. వాళ్లకి హన్సిక ఒక రోజ్ ఫ్లవర్ ఇవ్వడం

  • ప్రతి ఎపిసోడ్ ఎండింగ్‌లో.. టోటల్ ఎపిసోడ్‌కి బెస్ట్ పెర్ఫార్మర్ ఎవరైతే ఉంటారో వాళ్లకి టీ షర్ట్ గిఫ్ట్, ఆ షర్ట్‌పై హన్సిక ఆటోగ్రాఫ్.. ఇవే ఈ ‘ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2’లో ఉండబోతున్న విశేషాలు.


Read Latest Cinema News

Updated Date - Jun 03 , 2024 | 08:49 PM