Hansika: పెళ్లి తర్వాత డబుల్ డోస్..

ABN , First Publish Date - 2022-12-24T14:03:13+05:30 IST

హీరోయిన్‌ హన్సిక (Hansika) ‘గాంధారి’ (Gandhari)గా వెండితెరపై కనిపించనుంది. ఆర్‌.కణ్ణన్‌ (R Kannan) దర్శకత్వంలో రూపొందే ఈ లేడీ ఓరియంటెండ్‌ చిత్రంలో

Hansika: పెళ్లి తర్వాత డబుల్ డోస్..
Hansika in Gandhari

హీరోయిన్‌ హన్సిక (Hansika) ‘గాంధారి’ (Gandhari)గా వెండితెరపై కనిపించనుంది. ఆర్‌.కణ్ణన్‌ (R Kannan) దర్శకత్వంలో రూపొందే ఈ లేడీ ఓరియంటెండ్‌ చిత్రంలో ఆమె తొలిసారి ద్విపాత్రాభినయం (Dual Role) చేస్తోంది. ఎమోషనల్‌, హారర్‌ బేస్డ్‌ మూవీగా ఈ చిత్రం తెరకెక్కనట్లుగా తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ చూస్తుంటే తెలిసిపోతుంది. ఇందులో హన్సికతో పాటు మెట్రో శిరీష్‌, మయిల్‌స్వామి, తలైవాసల్‌ విజయ్‌, నరేన్‌, పవన్‌ తదితర నటీనటులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. మసాలా పిక్స్‌ బ్యానరుపై ఆర్‌.కణ్ణన్‌ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రానికి సంగీతం ఎస్‌.వి.ముత్తుగణేశ్‌. కాగా, వైవిధ్యభరితమైన కథా చిత్రాలను రూపొందించే ఆర్‌.కణ్ణన్‌ తాజాగా ‘గ్రేట్‌ ఇండియన్‌ కిచెన్‌’, ‘కాసేదాన్‌ కడవులడా’ వంటి చిత్రాలను రూపొందించగా, ఈ రెండు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

మరోవైపు రీసెంట్‌గానే హన్సిక వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. డిసెంబర్ 4న తన ప్రియుడు, ముంబైకి చెందిన వ్యాపారవేత్త సోహైల్ ఖతురియాని వివాహమాడింది. పెళ్లి తర్వాత కూడా నటించడానికి ఆమె ఇంట్రస్ట్ చూపిస్తుందనేదానికి ఉదాహరణగా.. ఈ ‘గాంధారి’తో ఆమె డబుల్ ధమాకా ఇవ్వబోతుంది. త్వరలోనే ‘గాంధారి’కి సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేయనున్నామని దర్శకుడు ఆర్. కణ్ణన్ వెల్లడించారు.

Updated Date - 2022-12-24T14:03:14+05:30 IST