Raayan: ఓటీటీకి వచ్చేసిన ధనుష్ లేటెస్ట్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్
ABN, Publish Date - Aug 23 , 2024 | 05:53 AM
ఇటీవల థియేటర్లలోకి వచ్చి మంచి విజయం సాధించిన తమిళ చిత్రం రాయన్ డిజిటల్ ఓటీటీకి వచ్చేసింది. చాలా గ్యాప్ తర్వాత హీరో ధనుష్ నటిస్తూ దర్వకత్వం వహించిన ఈ సినిమా అంతటా పాజిటివ్ తెచ్చుకుని సూపర్ హిట్‌గా నిలిచింది. రూ. 100కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.
ఇటీవల థియేటర్లలోకి వచ్చి మంచి విజయం సాధించిన తమిళ చిత్రం రాయన్ (Raayan) డిజిటల్ ఓటీటీకి వచ్చేసింది. చాలా గ్యాప్ తర్వాత హీరో ధనుష్ (Dhanush) నటిస్తూ దర్వకత్వం వహించిన ఈ సినిమాలో తెలుగు నటుడు సందీప్ కిషన్ (Sundeep Kishan), మలయాళ నటుడు కాళీదాస్ జయరాం (Kalidas Jayaram), దుషారా విజయన్ (Dushara Vijayan) , నట రాక్షసుడు ఎస్జే సూర్య (S. J. Suryah), అపర్ణ బాలమురళి (Aparna Balamurali) కీలక పాత్రల్లో నటించగా అస్కార్ గ్రహీత రెహమాన్ (A. R. Rahman) సంగీతం అందించారు. సన్ పిక్చర్స్ (Sun Pictures) బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు.
తమిళంతో పాటు తెలుగులోనూ చిత్రాలతో ఇక్కడా తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్‌ను ఏర్పాటు చేసుకున్న ధనుష్ (Dhanush) తన రెండో ప్రయత్నంగా ఈసినిమాను డైరెక్ట్ చేసి విమర్శకుల ప్రశంసలు సైతం పొందారు. జూలై 26న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈరాయన్ (Raayan) సినిమా అంతటా పాజిటివ్ తెచ్చుకుని సూపర్ హిట్‌గా నిలిచింది. రూ. 100కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. 25 రోజుల తర్వాత ఇప్పుడు శుక్రవారం ఆగస్టు 23 నుంచి అమెజాన్ ప్రైమ్ (Amazon Prime Video) ఓటీటీలోకి వచ్చింది. తమిళంతో పాటు, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లోనూ స్ట్రీమింగ్‌కు అవుతోంది.
కథ విషయానికి వస్తే.. చిన్న తనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన రాయన్ తన ఇద్దరు తమ్ముళ్లు, చెల్లిని తీసుకుని ఓ సిటీకి వెళ్లి అక్కడ దొరికిన పని చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తుంటాడు. ఆపై పిల్లలంతా పెద్దవాళ్లే సమయానికి అంతా కలిసి ఓ ఫాస్ట్ పుడ్ సెంటర్ నడుపుతూ ఉంటారు. వివాదాలకు దూరంగా ఉండే రాయన్ నిత్యం గొడవలు పడే తన పెద్ద తమ్ముడు, కాలేజీ వివాదాలతో వచ్చే చిన్న తమ్ముడిని సముదాయిస్తూ తన వారిపై ఎలాంటి ఈగ వాలకుండా చూసుకుంటాడు. అదే సమయంలో ఆక్కడి మార్కెట్‌ను శాసిస్తున్న దొరై, సేతు ముఠాలను అంతమొందించాలని ఆ సిటీ పోలీస్ కమిషనర్ ఎదురుచూస్తుంటాడు.
అయితే ఓ రోజు దొరై తమ్ముడి హత్య జరగడంతో అది రాయన్ పెద్ద తమ్ముడు చేశాడని దొరై రాయన్‌కు వార్నింగ్ ఇస్తాడు. దీంతో అప్పటివరకు సౌమ్యుడిగా ఉన్న రాయన్ ఆగ్రహంతో దొరైను చంపి తన ఫ్యామిలీ జోలికి రావద్దని వార్నింగ్ ఇస్తాడు. తర్వాత సేతు ఆ మార్కెట్‌ను చేతిలోకి తీసుకోవడం దొరైని చంపిన వారిని వెతికే పనిలో ఉంటాడు. మరోవైపు తన చెల్లి పెళ్లి పనుల్లో బిజీలో ఉండగా రాయన్‌పై హత్యాప్రయత్నం జరిగి చెల్లిని కిడ్నాప్ చేస్తారు. ఇంతకు దొరై తమ్ముడిని చంపిందెవరు, రాయన్‌పై హత్యా ప్రయత్నం చేసిందెవరు, తమ్ముళ్లు తీసుకున్న నిర్ణయాలు ఏంటి చివరకు ఏమైందనే కథకథనాలతో సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా సాగుతూ ప్రతి ప్రేక్షకుడిని అలరిస్తుంది. యాక్షన్ సీన్స్, ఒకటి రెండు పాటలు ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ ట్విస్టు మెప్పిస్తుంది. థియేటర్లలో మిస్సయిన వారు ఇక ఇంట్లోనే చూసి ఎంజాయ్ చేయండి.