Committee Kurrollu: ‘కమిటీ కుర్రోళ్ళు’ టీం ప్రీ స్ట్రీమింగ్ సెలబ్రేషన్స్.. ఇదేందయ్యా ఇది
ABN, Publish Date - Sep 10 , 2024 | 08:10 PM
ఇప్పటి వరకు టీజర్ లాంచ్, ట్రైలర్ లాంచ్, ఆడియో లాంచ్, ప్రీ రిలీజ్, థ్యాంక్యూ మీట్, సక్సెస్ మీట్ వంటి ఫంక్షన్లుకు పరిమితమైన సినిమా ఇండస్ట్రీలో ‘కమిటీ కుర్రోళ్లు’ ఇంకాస్త ముందుకు తీసుకెళ్లారు. ఎప్పుడూ లేనిది.. ఇప్పుడు కొత్తగా ప్రీ స్ట్రీమింగ్ సెలబ్రేషన్స్ అంటూ సినిమా ఓటీటీలో విడుదలకాబోతోన్న సందర్భంగా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు.
ఇప్పటి వరకు టీజర్ లాంచ్, ట్రైలర్ లాంచ్, ఆడియో లాంచ్, ప్రీ రిలీజ్, థ్యాంక్యూ మీట్, సక్సెస్ మీట్ వంటి ఫంక్షన్లుకు పరిమితమైన సినిమా ఇండస్ట్రీలో ‘కమిటీ కుర్రోళ్లు’ (Committee Kurrollu) ఇంకాస్త ముందుకు తీసుకెళ్లారు. ఎప్పుడూ లేనిది.. ఇప్పుడు కొత్తగా ప్రీ స్ట్రీమింగ్ సెలబ్రేషన్స్ అంటూ సినిమా ఓటీటీలో విడుదలకాబోతోన్న సందర్భంగా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. సెప్టెంబర్ 12న ఈటీవి విన్‌లో మా ‘కమిటీ కుర్రోళ్ళు’ రీరిలీజ్ అవుతోంది. థియేటర్స్‌లో ఎలా అయితే జాతరలా ఎంజాయ్ చేశారో.. ఇక్కడ కూడా అలా ఆదరిస్తారని కోరుకుంటున్నాని అన్నారు మెగా డాటర్ నిహారిక కొణిదెల.
Also Read- Devara: ‘దేవర’ ట్రైలర్ ఎలా ఉందంటే..
నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు యదు వంశీ దర్శకత్వం వహించారు. ఆగస్ట్ 9న విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 12నుంచి ఈటీవి విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ‘కమిటీ కుర్రోళ్ళు’ టీం ప్రీ స్ట్రీమింగ్ సెలబ్రేషన్స్‌ని గ్రాండ్‌గా నిర్వహించింది. (Committee Kurrollu OTT)
ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల మాట్లాడుతూ.. ‘‘మా సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన ఆడియన్స్‌కి మరోసారి థాంక్ యూ సో మచ్. నా ఇండస్ట్రీ జర్నీ ఈటీవీ డీ జూనియర్స్ షో తో స్టార్ట్ చేశాను. నన్ను ఆడియన్స్‌కి పరిచయం చేసిన ఈటీవీకి థ్యాంక్యూ. ‘కమిటీ కుర్రోళ్ళు’ మా, మా అనుకునే సినిమా. ఈ సినిమా ఈటీవీలో రావడం మేము తీసుకున్న బెస్ట్ డెసిషన్. సెప్టెంబర్ 12న ఈటీవి విన్‌లో మా ‘కమిటీ కుర్రోళ్ళు’ రీరిలీజ్ అవుతుంది. థియేటర్‌లో ఎలా అయితే పండగ, జాతరలా ఎంజాయ్ చేశారో, ఈటీవీ విన్‌లో కూడా చూసి అలానే ఆదరిస్తారని కోరుకుంటున్నాను’’ అని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో డైరెక్టర్ యదు వంశీ, ‘కమిటీ కుర్రోళ్ళు’గా నటించిన యాక్టర్స్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మన్యం రమేష్, ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ సాయికృష్ణ వంటివారు మాట్లాడారు.
Read Latest Cinema News