OTT: ఓటీటీలోకి వచ్చిన.. చైనీస్ సర్వైవల్ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్! డోంట్ మిస్
ABN, Publish Date - Jan 16 , 2024 | 04:33 PM
ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి చైనీస్ సర్వైవల్ డిజాస్టర్ థ్రిల్లర్ ది క్లైంబర్స్ డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. 2019 సెప్టెంబర్‌లో విడుదలైన ఈ చిత్రం చైనాలో మంచి విజయాన్ని సాధించగా నాలుగు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ చిత్రం స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి చైనీస్ సర్వైవల్ డిజాస్టర్ థ్రిల్లర్ ది క్లైంబర్స్ (The Climbers) డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. వు జింగ్ (Wu Jing), జాంగ్ జియీ (Zhang Ziyi), జాంగ్ యి (Zhang Yi), జింగ్ బోరాన్ (Jing Boran) మరియు హు గే (Hu Ge) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి డానియల్ లీ (Daniel Lee) దర్శకత్వం వహించారు. 2019 సెప్టెంబర్‌లో విడుదలైన ఈ చిత్రం చైనాలో మంచి విజయాన్ని సాధించగా నాలుగు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ చిత్రం స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
కథ విషయానికి వస్తే 1960లలో నలుగురితో కూడిన ఓ పర్వతారోహకుల టీం ఎవరెస్ట్ శిఖరాన్ని చైనాలో చాలా ప్రమాదకరమైన ఉత్తరం వైపు నుంచి అధిరోహించే ప్రయత్నం చేసే క్రమంలో కెప్టెన్ చనిపోగా మిగతా ముగ్గురు విజయవంతంగా ఎక్కేస్తారు. అయితే వారి దగ్గర ఉన్న కెమెరా అప్పటికే కింద పడిపోవడంతో వారు ఫొటో తీసుకోలేక పోతారు. దాంతో చైనా ప్రజలు గానీ ప్రభుత్వం గానీ వారి విజయాన్ని విశ్వసించరు. ఈ క్రమంలో 15 సంవత్సరాల తర్వాత ఓ 15 మంది యువకులతో కూడిన టీం ఎవరెస్టును అధిరోహించడానికి సిద్ధమవగా వీరికి ఆ ముగ్గురు సారథ్యం వహించాల్సి వస్తుంది. ఈ క్రమంలో వారు పర్వతాన్ని ఎక్కగలిగారా, తిరిగి రాగలిగారా ఈ క్రమంలో వారు ఎన్ని కష్టాలు పడాల్సి వచ్చిందనే కథను ఆధ్యంతం ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కించారు.
1960లో నిజంగా జరిగిన కథను అధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు. సినిమా చిత్రీకరణ కూడా నైరుతి చైనాలోని టిబెట్ పరిసరాల్లో ఎలాంటి గ్రీన్ మ్యాట్ వాడకుండా చేయగా, షూటింగ్‌కు ముందు సినిమాలో హీరో పాత్రదారి వు జింగ్ రెండు మూడు నెలలు కఠోర శిక్షణ తీసుకోవడం గమనార్హం. అయితే చిత్రంలో చాలా సార్లు ఎవరెస్ట్ మనది దీన్ని ప్రతి ఒక్కరూ అధిరోహించి తీరాల్సిందే అంటూ వచ్చే డైలాగ్స్ మన ప్రేక్షకులను అసహానానికి గురి చేసే అవకాశం ఉన్నది. ఇదిలా ఉండగా ఇంటర్నేషనల్ స్టార్ జాకీచాన్ సినిమాలో అతిథి పాత్రలో కనిపిస్తాడు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఇప్పటివరకు అతి కొద్ది మంది పర్వతారోహకులు మాత్రమే చైనా ఉత్తర భాగం నుంచి ఎవరెస్ట్‌ను అధిరోహించినట్టు సమాచారం. చివరగా ఈ చిత్రాన్ని 1960లో మొదటిసారిగా ఎవరెస్ట్‌ను విజయవంతంగా అధిరోహించిన ఫాంగ్ వుజౌకు అంకితం ఇచ్చారు.
అయితే ఈ ది క్లైంబర్స్ (The Climbers) మూవీ గతంలో ఇదేరకమైన జానర్‌లో వచ్చిన హలీవుడ్ సినిమా వర్టికల్ లిమిట్ గుర్తు చేసినప్పటికీ మనల్ని ఎక్కడా నిరుత్సాహ పర్చదు. ముఖ్యంగా సినిమాలో నటీనటుల యాక్టింగ్, ఎమోషనల్ సీన్స్, స్పెషల్ ఎఫెక్ట్స్, పర్వతారోహణ దృశ్యాలు అద్యంతం అబ్బుర పరిచేలా ఉన్నాయి. మంచు తుఫానులు, పర్వతం ఎక్కేటప్పుడు జరిగే ప్రమాద సన్నివేశాలు మనల్ని సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడుతాయి. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. సినిమాలో ఎక్కడా బోల్డ్, మసాలా సన్నివేశాలు ఉండవు. సో కుటుంబం అంతా ఈ సినిమాను యన ఇంట్లోనే కూర్చోని మన లాంగ్వేజ్ లోనే హాయిగా చూడొచ్చు, థ్రిల్ అవ్వోచ్చు. సో డోంట్ మిస్ ఇట్.