Babu- Balayya: అన్‌స్టాపబుల్ షో లో.. బాబుకు బాలయ్య సంధించిన అస్త్రాలివే..
ABN, Publish Date - Oct 25 , 2024 | 05:18 PM
ఆహా ఓటీటీ సంచలనం ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్బికె సీజన్ 4’ షో ఎపిసోడ్ 1 అక్టోబర్ 25న గ్రాండ్ లాంచ్‌కి సిద్ధమైంది. ఈ సీజన్‌ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో బాలయ్య శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ షో లో చంద్రబాబుకు బాలయ్య సంధించిన అస్త్రాలివే..
ఆహా ఓటీటీ సంచలనం ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్బికె సీజన్ 4’ షో ఎపిసోడ్ 1 అక్టోబర్ 25న గ్రాండ్ లాంచ్‌కి సిద్ధమైంది. ఈ సీజన్‌ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో బాలయ్య శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో ఇప్పటికే ప్రభంజనాన్ని సృష్టిస్తోంది. ఈ లాంఛింగ్ ఎపిసోడ్లో బాబుతో బాలయ్య ఎన్నో విషయాల ప్రస్తావనను తీసుకువచ్చారు. సీఎం చంద్రబాబుని బాలయ్య అడిగిన ప్రశ్నాపత్రమిదే.. (Unstoppable With NBK Season 4)
జైలు జీవితం చంద్రబాబునాయుడిలో సీమపౌరుషాన్ని నిద్రలేపిందా? వైఎస్ జగన్మోహన్రెడ్డిని కూడా కటకటాలపాలు చేసి కక్ష తీర్చుకోవాలన్న కసి వచ్చిందా? మాజీ సీఎంకు వ్యతిరేకంగా చంద్రబాబు సిద్ధం చేసిన ఫైల్స్ ఏంటి?
జైలు జీవితం చంద్రబాబులో మరో మనిషిని నిద్ర లేపిందా? జగన్ ఇక తీవ్ర పర్యవాసానాలు చూడబోతున్నారా?
స్కిల్ డెవలెప్ మెంట్ కేసులో సీఎం చంద్రబాబు చెబుతున్నదేంటి?
ఏ నిర్ణయం తీసుకోవడంలో నైనా అచితూచి వ్యవహరించే చంద్రబాబు, గత అయిదేళ్ల పరిణామాలు చూసిన తర్వాత రాజకీయ ప్రత్యర్థులకు దూకుడుగా సమాధానమిస్తారా లేదా ఎప్పటిలాగే వ్యవహరిస్తారా?
53రోజులు చంద్రబాబునాయుడు జైల్లో ఎలా గడిపారు ? సీఎంగా జైళ్లను ఆధునీకరించిన చంద్రబాబు.. ఓ నిందితుడిగా ఆ గదుల్లోనే గడపాల్సి రావడంతో ఎలా ఫిలయ్యారు? రాజమండ్రి జైల్లో VIPగా గడిపారా? భయంతో ఉక్కిరిబిక్కిరిఅయ్యారా? ఫస్ట్‌టైమ్ సీఎం చంద్రబాబునాయుడు చెప్పిన జైలు అనుభవాలు మీ ఆహాలో..
రాజమండ్రి సెంట్రల్ జైలు గోడల మధ్య నుంచి చంద్రబాబునాయుడు చూసిన ప్రపంచం ఎలా ఉంది? చదివిన పత్రికలేంటి? చూసిన టీవీలేంటి? కొత్తగా అలవర్చుకున్న అలవాట్లేంటి?
టీడీపీ-జనసేన మధ్య పొత్తును పవన్‌కల్యాణ్ ప్రకటించడానికి కొద్ది నిమిషాల ముందు రాజమండ్రిలోని సెంట్రల్ జైలు నాలుగుగోడల మధ్య జరిగిన మంత్రాంగమేంటి? ఇద్దరి మధ్య సుదీర్ఘంగా చర్చ తర్వాత వచ్చిన ప్రకటనా? పవన్ ఎమోషన్లో తీసుకున్న నిర్ణయమా?
Also Read-Unstoppable With NBK: బాలయ్య పండుగకు సెలవు కావాలి.. ఇదేందయ్యా ఇది
రాజకీయాల్లో నీడను కూడా నమ్మొద్దనే విధానం అనుసరించే చంద్రబాబునాయుడికి పవన్‌కల్యాణ్‌పై అమితమైన ప్రేమ, రాజకీయ ఆత్మీయత ఎలా కలిగాయి.. ? అవసరాలకు పుట్టిన ప్రేమా? కష్టంలో ఉన్నప్పుడు చూపించిన సానుభూతిలో నుంచి వచ్చిన ప్రేమా? పవన్‌తో స్నేహంపై చంద్రబాబు ఇచ్చిన నిర్వచనం ఏంటి?
వచ్చే పదేళ్లవరకు మాదే అధికారం అనే ధీమాలో ఉండడానికి కారణం ఏంటి? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల సీఎం చంద్రబాబుకు ఉన్న కమిట్ మెంట్, ప్రణాళికలు ఏంటి?
93శాతం స్ట్రైక్‌రేట్‌తో కూటమి సాధించిన భారీ విజయంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ కు చంద్రబాబు ఇస్తున్న వెయిటేజ్ ఎంత? పవన్‌కు కింగ్‌మేకర్ స్థాయిని ఇచ్చారా? ఎన్నికల్లో పవన్ పాత్రపై మనసులో మాట బయటపెట్టిన చంద్రబాబు. ఇంతకీ ఆయనేం చెప్పారు?
అడ్మినిస్ట్రేషన్, కుటుంబవ్యవహరాల్లో సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రహ్మణిలకు చంద్రబాబు ఇస్తున్న మార్కులెన్ని. ఇద్దరిలో ఎవరికి డిస్టెంక్షన్, ఎవరు పాస్‌మార్కులు? ఏ విషయంలో బ్రహ్మణికి ఎక్కువ మార్కులు వేశారో విని బాలయ్య షాక్ అయ్యారా?
లోకేష్, పవన్‌కల్యాణ్, బాలయ్య ముగ్గురిలో చంద్రబాబుకు అత్యంత ఇష్టమైన వ్యక్తి ఎవరు? తన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా చెప్పేసిన చంద్రబాబు. బాలయ్య నొచ్చుకున్నారా? ఇంతకీ ముగ్గురిలో ఎవరు చంద్రబాబు బెస్టీ.. !
రాజకీయాల్లో కలగజేసుకోని భార్య భువనేశ్వరీ, కోడలు బ్రహ్మణిలు చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు రోడ్డు మీదకు వచ్చి నిరసన తెలియజేస్తున్నప్పడు ఆయన మనోగతం ఏంటి?